Prabhas Donations: ప్రభాస్.. ది రియల్ లైఫ్ కర్ణ.. ఇప్పటికీ ఎన్ని కోట్లు దానమిచ్చాడంటే?-prabhas the real life karna to say reasons kalki 2898 ad karna role prabhas donations list till now to disasters floods ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Donations: ప్రభాస్.. ది రియల్ లైఫ్ కర్ణ.. ఇప్పటికీ ఎన్ని కోట్లు దానమిచ్చాడంటే?

Prabhas Donations: ప్రభాస్.. ది రియల్ లైఫ్ కర్ణ.. ఇప్పటికీ ఎన్ని కోట్లు దానమిచ్చాడంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 06, 2024 04:33 PM IST

Prabhas Donations List Till Now: కల్కి 2898 ఏడీ సినిమాలో కర్ణుడిగా ఎంతగానో అలరించిన ప్రభాస్ రియల్ లైఫ్‌‌లో కూడా కర్ణుడే అని అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవలే తెలంగాణ, ఏపీలోని వరద బాధితులకు చెరో రూ. కోటి విరాళంగా ఇచ్చాడు. ఇలా ఇప్పటివరకు ప్రభాస్ ఎన్ని కోట్లు దానిమిచ్చాడో తెలుసుకుందాం.

ప్రభాస్.. ది రియల్ లైఫ్ కర్ణ.. ఇప్పటికీ ఎన్ని కోట్లు దానమిచ్చాడంటే?
ప్రభాస్.. ది రియల్ లైఫ్ కర్ణ.. ఇప్పటికీ ఎన్ని కోట్లు దానమిచ్చాడంటే?

The Real Life Karna Prabhas: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ మూవీ దాదాపుగా రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన కల్కి మూవీ అక్కడ కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోయింది.

ప్రభాస్ రియల్ క్యారెక్టర్

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ చేసిన కర్ణుడి పాత్రకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. కర్ణుడిగా ప్రభాస్ కనిపించిన ప్రతిసారి విజిల్స్, అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అంతగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆ పాత్రను అభిమానించడానికి కారణం అందులో ప్రభాస్ కనిపించిన తీరు ఒకటి అయితే.. నిజ జీవితంలోను డార్లింగ్ కార్యెక్టర్ అదే కావడం రెండో కారణం.

ప్రభాస్ రియల్ లైఫ్ కర్ణుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇటీవల ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలకు సినీ తారలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో రాష్టానికి చొప్పున చెరో కోటి రూపాయలను విరాళంగా ఇచ్చాడు ప్రభాస్. ఇదే కాకుండా ఇంతకుముందు జరిగిన పలు విపత్తులకు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన డిజాస్టర్స్‌కు ప్రభాస్ డొనేషన్ ఇచ్చాడు.

కరోనా సమయంలో 4 కోట్లు

రీసెంట్‌గా ఏపీ, తెలంగాణ వరద బాధితులకు ఇచ్చిన విరాళంతోపాటు ఇప్పటివరకు ప్రభాస్ విరాళంగా ఎన్ని కోట్లు దానిమిచ్చాడో తెలుసుకుందాం. కరోనా మొదటిసారిగా ప్రభలించినప్పుడు సహాయంగా రూ. 2 కోట్లు ప్రకటించాడు ప్రభాస్. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్‌లో కూడా రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు ప్రభాస్. కరోనా సమయంలోనే మొత్తంగా రూ. 4 కోట్లు విరాళంగా అందజేశాడు డార్లింగ్.

హుద్ హుద్ తుఫాను సమయంలో రూ. 2 కోట్లను ప్రభాస్ విరాళంగా ఇచ్చాడు. ఒకానొక సమయంలో మా అసోసియేషన్‌కు రూ. 50 లక్షలు, టీఎఫ్‌ఐ డైరెక్టర్స్ ఫండ్‌కు రూ. 50 లక్షలు అందజేశాడు. ఇవి రెండు కలిపి రూ. కోటి అయ్యాయి. 2021లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1 కోటి విరాళం ఇచ్చాడు ప్రభాస్.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో వరద బాధితులకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు దానంగా ఇచ్చేశాడు ప్రభాస్. వయనాడ్ బాధితులకు రూ. 2 కోట్లు ఇచ్చాడు ప్రభాస్. ఇలా మొత్తంగా ప్రభాస్ ఇప్పటికీ దానంగా ఇచ్చినవి రూ. 16 కోట్లు. ఇవే కాకుండా పలు సామాజిక పనులకు కూడా ప్రభాస్ ఖర్చు చేస్తుంటాడు.

వంద మంది పేద విద్యార్థులకు

అలా ప్రతి సంవత్సరం బాగా చదివే వంద మంది పేద విద్యార్థులకు హైదరాబాద్‌లోని ప్రముఖ స్కూల్‌లో ఫీజు కట్టి చదివిస్తున్నాడు ప్రభాస్. 1650 ఎకరాల అడవిని దత్తత తీసుకుని దాని సంరక్షణ చూసుకుంటున్నాడు. ఎన్ని చేసిన ఎవరికి మాత్రం చెప్పకూడదని ప్రభాస్ అనుకుంటాడు. కానీ, స్టార్ హీరో కావడం వల్ల ఏం చేసినా క్షణాల్లో ఆ న్యూస్ తెలిసిపోతుంది.

ఈ విషయంపై యాంకర్ సుమ కనకాల గురించి చెప్పింది. "ప్రభాస్‌ని ఒక ఆర్గనైజేషన్ కోసం హెల్ప్ అడిగ్గానే వెంటనే చేశారు. కానీ, అది ఎవరికీ చెప్పొద్దు అన్నారు. నేను మాత్రం చెప్పేసా సారీ డార్లింగ్" అని ఒక ప్రమోషన్స్‌లో సుమ కనకాల తెలిపింది. అయితే, చేసిన సహాయం ఎవరికీ తెలియకూడదని ప్రభాస్ అనుకున్న.. ఆ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వాలు ప్రకటించడం, ఇలా సెలబ్రిటీలు చెప్పడం వల్ల తెలిసిపోతుంది.

అందుకే రియల్ లైఫ్ కర్ణ..

సెలబ్రిటీలకు, ప్రభుత్వాలకు తెలిసే ఇన్ని విరాళాలు ఉంటే.. చెప్పనివి, ప్రభాస్ పర్సనల్‌గా చూసుకునేవి మరెన్ని ఉన్నాయో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీన్ని బట్టి ప్రభాస్.. ది రియల్ లైఫ్ కర్ణ అనడంలో సందేహం లేదని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. అవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.