Netflix OTT Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈవారం టాప్ 10 సినిమాలు- బోల్డ్, స్పై, ఫాంటసీ అడ్వెంచర్ జోనర్స్‌లలో!-netflix top 10 trending ott movies this week netflix ott movies indian 2 ott release the union ott shazam 2 ott ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈవారం టాప్ 10 సినిమాలు- బోల్డ్, స్పై, ఫాంటసీ అడ్వెంచర్ జోనర్స్‌లలో!

Netflix OTT Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈవారం టాప్ 10 సినిమాలు- బోల్డ్, స్పై, ఫాంటసీ అడ్వెంచర్ జోనర్స్‌లలో!

Sanjiv Kumar HT Telugu
Aug 19, 2024 11:22 AM IST

Trending OTT Movies This Week In Netflix: ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోని ఈవారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి స్పై యాక్షన్ మూవీస్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈవారం టాప్ 10 సినిమాలు- బోల్డ్, స్పై, ఫాంటసీ అడ్వెంచర్ జోనర్స్‌లలో!
నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈవారం టాప్ 10 సినిమాలు- బోల్డ్, స్పై, ఫాంటసీ అడ్వెంచర్ జోనర్స్‌లలో!

Netflix OTT Trending Movies This Week: దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్రెష్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులను అందిస్తుంటుంది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ. మరి ఈ వారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా ఓటీటీ

తాప్సీ మరోసారి నటించిన బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా. తాప్సీ, విక్రాంత్ మాస్సె, విక్కీ కౌశల్ మెయిన్ రోల్స్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 9న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మొదటి నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ మూవీ ఈవారం టాప్ 1 ప్లేస్ దక్కించుకుంది.

ఇండియన్ 2 ఓటీటీ

కమల్ హాసన్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాలతో రెండో సారి వచ్చిన సినిమా ఇండియన్ 2. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన భారతీయుడు 2 చిత్రం ఆగస్ట్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. మొదట్లో ఓటీటీలో కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఇండియన్ 2 మూవీ ఇప్పుడు టాప్ 2 ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది.

ది యూనియన్ ఓటీటీ

హాలీవుడ్‌ నుంచి కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన మూవీ ది యూనియన్. హాలీ బెర్రీ, మార్క్ వాల్‌బర్గ్ మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది యూనియన్ ఆగస్ట్ 16న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ వచ్చింది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే టాప్ 3 స్థానంలో నిలిచింది.

షాజమ్: ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ ఓటీటీ

హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ హీరో మూవీల్లో షాజమ్: ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ ఒకటి. డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సూపర్ హీరో కామెడీ యాక్షన్ మూవీ షాజమ్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. షాజమ్ మూవీకి సీక్వెల్ షాజమ్ 2 రెండు రోజుల్లోనే నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

మహారాజ ఓటీటీ

విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మహారాజ ఇప్పటికీ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ సత్తా చాటుతోంది. ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజ టాప్ 5 ప్లేస్ దక్కించుకుంది. ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఐఎమ్‌డీబీ పదికి 8.7 రేటింగ్ ఇచ్చింది.

డంజన్స్ అండ్ డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ ఓటీటీ

ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా వచ్చిన డంజన్స్ అండ్ డ్రాగన్స్: హానర్ అమాంగ్ థీవ్స్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 6 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది.

కింగ్స్‌మన్: ది సీక్రెట్ సర్వీస్ ఓటీటీ

స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన కింగ్స్‌మన్: ది సీక్రెట్ సర్వీస్ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో ఇదివరకే స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7లో ట్రెండింగ్ అవుతోంది.

ఇవే కాకుండా 2021లో వచ్చిన తాప్సీ బోల్డ్ మూవీ హసీన్ దిల్‌రూబా టాప్ 8 స్థానంలో, స్పై యాక్షన్ కామెడీ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన కింగ్స్‌మన్: ది గోల్డెన్ సర్కిల్ టాప్ 9 ప్లేసులో, షాలినీ పాండే నటించిన మహారాజ్ మూవీ టాప్ 10లో ట్రెండింగ్‌లో నిలిచింది.