Trigger Warning Review: ట్రిగ్గర్ వార్నింగ్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?-netflix ott movie trigger warning review in telugu ott movies jessica alba trigger warning explained in telugu ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trigger Warning Review: ట్రిగ్గర్ వార్నింగ్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Trigger Warning Review: ట్రిగ్గర్ వార్నింగ్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

Trigger Warning Movie Review In Telugu: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ట్రిగ్గర్ వార్నింగ్. హాలీవుడ్ పాపులర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ట్రిగ్గర్ వార్నింగ్ రివ్యూలో తెలుసుకుందాం.

ట్రిగ్గర్ వార్నింగ్ రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: ట్రిగ్గర్ వార్నింగ్

నటీనటులు: జెస్సికా ఆల్బా, మార్క్ వెబ్బర్, జేక్ వియరీ, ఆంటోనీ మైఖేల్ హాల్, గాబ్రియల్ మాస్సో, టోన్ బెల్, హరి ధిల్లాన్ తదితరులు

దర్శకత్వం: మౌళి సూర్య

సంగీతం: ఎనిస్ రాత్తోఫ్

నిర్మాతలు: ఎస్తర్ హరిన్‌స్టీన్, బాసిల్ ఇవానిక్, ఎరికా లీ

రిలీజ్ డేట్: జూన్ 21, 2024

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

Trigger Warning Review Telugu: ఓటీటీలో విభిన్నమైన కంటెంట్ సినిమాలు ప్రతివారం వస్తూనే ఉంటాయి. అలా జూన్ 21న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి నేరుగా రిలీజైన రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ట్రిగ్గర్ వార్నింగ్. హాలీవుడ్ పాపులర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మౌళి సూర్య దర్శకత్వం వహించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ట్రిగ్గర్ వార్నింగ్ మూవీ ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మొన్నటివరకు టాప్ 5 ప్లేసులో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం టాప్ 8 స్థానంతో సరిపెట్టుకుంది. మరి న్యూ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ఆకట్టుకుందా లేదా అనేది ట్రిగ్గర్ వార్నింగ్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

పార్కర్ (జెస్సీకా ఆల్బా), స్పైడర్ (టోన్ బెల్) ఇద్దరూ అమెరికన్ సీక్రెట్ ఎజెన్సీలో స్పైగా వర్క్ చేస్తారు. ఆపరేషన్ అలైస్ 116 మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని వస్తారు. కానీ ఇంతలో పార్కర్ తండ్రి హ్యారీ (హరి ధిల్లాన్) చనిపోయినట్లు తెలుస్తుంది. దాంతో తన సొంతూరు క్రియేషన్‌కు వెళ్తుంది పార్కర్. మైన్‌లో పనిచేస్తున్న తన తండ్రి అక్కడే యాక్సిడెంటల్‌గా చనిపోవడంపై పార్కర్‌కు అనుమానం కలుగుతుంది. అది సూసైడ్ అని తన మాజీ బాయ్ ఫ్రెండ్, టౌన్ షెరీఫ్ (పోలీస్) జెస్సీ (మార్క్ వెబ్బర్) చెబుతాడు.

హైలెట్స్

కానీ, పార్కర్ నమ్మదు. తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుంటుంది. తండ్రిది హత్యే అని కన్ఫర్ చేసుకున్న పార్కర్ ఏం చేసింది? హ్యారీ హత్యలో ఎంతమంది పాత్ర ఉంది? ఈ హత్య కేసులో జెస్సీ తమ్ముడు ఎల్విస్ (జేక్ వియరీ)ను అనుమానించడానికి గల కారణాలు ఏంటీ? తండ్రి పెట్టించిన రెస్టారెంట్ మరియాలో పని చేసే మైక్ (గాబ్రియల్ మాస్సో) పార్కర్‌కు ఎలాంటి సహాయం చేశాడు? స్పైడర్ పాత్ర ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ట్రిగ్గర్ వార్నింగ్ చూడాల్సిందే.

విశ్లేషణ:

ట్రిగ్గర్ వార్నింగ్ మూవీ ఒక రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్. తన తండ్రిని చంపిన వాళ్లపై సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసే పార్కర్ ఎలా పగ తీర్చుకుంది అనేదే కథ. అయితే, రొటీన్ స్టోరీస్‌తో సినిమాలు తెరకెక్కించినప్పటికీ టేకింగ్ బాగుంటే ఆ మూవీ సక్సెస్ అవుతుంది. కానీ, ట్రిగ్గర్ వార్నింగ్ టేకింగ్ స్టోరీ కంటే రొటీన్‌‌గా చప్పగా సాగుతుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో మూవీ స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత చాలా స్లోగా నడుస్తుంది మూవీ.

ఆపాటికే తెలిసిపోయే ట్విస్ట్

తండ్రితో ఉన్న అనుబంధం, పార్కర్ లవ్, సిటీలో జరుగుతున్న అనుమానాస్పద ఆర్మ్స్ డీలింగ్‌తో సినిమా గంటసేపు సాగుతుంది. ఈలోపు పార్కర్ తండ్రిని ఎవరు హత్య చేశారో ఈజీగా తెలిసిపోతుంది. కానీ, హీరోయిన్‌కు తెలిసాకా పెద్దగా థ్రిల్లింగ్‌గా అనిపించదు. పార్కర్ తండ్రి హత్యకు సంబంధించి ఎలాంటి ట్విస్ట్ ఉండదు. ప్రేక్షకులు ఊహించినట్లుగానే ఉంటుంది.

నో టైటిల్ జస్టిఫికేషన్

పార్కర్‌ను టార్చర్ పెట్టే సీన్, అక్కడి నుంచి తప్పించుకునే సీన్ బాగుంది. రెండు మూడు చోట్ల యాక్షన్ సీన్స్ బాగున్నాయి. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ఎమోషన్ అంతగా పండలేదనే చెప్పాలి. మెయిన్ విలన్ ఎవరో ముందే కనిపెట్టేసేలా ఉంది. క్లైమాక్స్‌ పర్వాలేదు. బీజీఎమ్ కూడా ఓకే. ట్రిగ్గర్ వార్నింగ్ టైటిల్‌కు జస్టిఫికేషన్ అయితే ఏం ఇవ్వలేదు. అయితే, పార్కర్ తండ్రి, విలన్ గ్రైనెట్ పిన్ ద్వారా మరణిస్తారు. అదే టైటిల్‌కు జస్టిఫికేషన్ అనుకోవాలేమో.

ఇంట్రెస్టింగ్ టాపిక్స్

అయితే సినిమాలో రెండు మూడు ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌కు పార్కర్ అని అబ్బాయి పేరు ఉంటే.. తన బాయ్ ఫ్రెండ్ పేరు జెస్సీ అని అమ్మాయి పేరు ఉంటుంది. ఇదే కాకుండా ఈ మూవీని లేడి డైరెక్టర్ తెరకెక్కించారు. ఆమె పేరు మౌళి సూర్య అనే అబ్బాయి పేరే. అయితే సినిమాలో హీరోయిన్ పేరు పార్కర్ అని ఒక చోట మాత్రం ఉండటం కలిసి వస్తుంది. అందుకే అలా తన పేరు పెట్టారని అనుకోవచ్చు.

ఇలా తీయడం

ఇక యాక్షన్ సీన్స్‌లో జెస్సికా ఆల్బా ఆకట్టుకుంది. మరి అంత గ్లామర్‌గా చూపించలేదు. కాబట్టి ఫ్యామిలీతో చూసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా పాత్రల నటన కూడా బాగుంది. ఈ సినిమాకు జెస్సికా కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించింది.

పలు సినిమాలకు అవార్డ్ అందుకున్న చంద్ర మౌళి ఇలాంటి తరహాలో చిత్రాన్ని తెరకెక్కించడం నిరాశపరిచే విషయం. గంట 40 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.