OTT: ఓటీటీలో బ్లాక్ బస్టర్, బోల్డ్ చిత్రాలను వెనక్కి నెట్టిన డిజాస్టర్ మూవీ- టాప్ 1లో ట్రెండింగ్- ఈ ట్విస్ట్ ఊహించరు!
OTT Trending Movies This Week: ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్, బోల్డ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి మరి టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లోకి వచ్చింది డిజాస్టర్ మూవీ అయిన ఇండియన్ 2. ఆగస్ట్ 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కమల్ హాసన్ భారతీయుడు 2 మొదట నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా ఇప్పుడు మాత్రం అదరగొడుతోంది.
OTT Trending Movies: సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలకు వచ్చే రెస్పాన్స్‌కు, బాక్సాఫీస్ కలెక్షన్స్‌కు కొన్నిసార్లు ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఈ రెండింటికి ఓటీటీ రిలీజ్ అయ్యాక వచ్చే స్పందనకు కూడా అస్సలు పొంతన ఉండదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు సైతం ఓటీటీల్లో నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ట్రోలింగ్ బారిన పడుతుంటాయి.
అలాగే థియేటర్లలో ఎవరు ఇష్టపడని సినిమాలు మంచి కంటెంట్ చిత్రాలు అంటూ ఓటీటీ ఆడియెన్స్ వాటిపై ప్రశంసలు కురిపిస్తారు. ఇలా ఎప్పుడు ఏ సినిమాకు, ఓ విధంగా ఎలాంటి టాక్ వస్తుందో చెప్పలేం. అయితే, ఇటీవల విడుదలై భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది.
బ్లాక్ బస్టర్ హిట్- బోల్డ్ రొమాంటిక్
అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద, విమర్శకుల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీని, నేరుగా ఓటీటీలో విడుదలైన బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని సైతం వెనక్కి నెట్టి టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2.
అయితే, భారతీయుడు 2 చిత్రానికి థియేటర్ రెస్పాన్స్ దారుణంగా వచ్చిన విషయం తెలిసిందే. ఓటీటీలోకి వచ్చాకా కూడా ఇండియన్ 2 సినిమా మొదట్లో తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. ఇదేం సినిమా, లాజిక్ లేకుండా ఆ సీన్స్ ఏంటీ అని నెటిజన్స్ సోషల్ మీడియాలో భారతీయుడు 2పై తెగ ట్రోలింగ్ చేశారు. అలా అన్ని చోట్ల తీవ్రమైన నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఇండియన్ 2 ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది.
బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా
ఎన్నో అంచనాలతో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా జూలై 12న థియేటర్లలోకి వచ్చి తీవ్రమైన డిజాస్టర్ మూవీగా పేరు తెచ్చుకుంది. లోక నాయకుడు కమల్ హాసన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా భారతీయుడు 2 నిలిచింది. ఇలాంటి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను త్వరగానే ఓటీటీలోకి రిలీజ్ చేశారు.
ఇండియన్ 2 మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్ట్ 9 నుంచి సౌత్‌తోపాటు హిందీ భాషలో డిజిటల్ ప్రీమియర్ చేశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో భారతీయుడు 2 సినిమా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే, ఈ డిజాస్టర్ మూవీ రెండు మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలను వెనక్కి నెట్టి మరి ట్రెండింగ్ అవుతోంది.
రెండో స్థానంలో
ఆ సినిమాలే ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా, మహారాజ. తాప్సీ నటించిన బోల్డ్ మూవీ హసీన్ దిల్‌రూబాకు సీక్వెల్‌గా వచ్చిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఆగస్ట్ 9న విడుదలైన ఈ సినిమా మొదట టాప్ 1 ప్లేసులో ఉండగా.. ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది. అందుకు కారణం ఇండియన్ 2 మొదటి ప్లేసులో సత్తా చాటడమే.
ఇక అటు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి, ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలు సంపాదించుకున్న విజయ్ సేతుపతి సినిమా మహారాజ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 3 స్థానంలోకి వెళ్లిపోయింది. ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా కంటే ముందు వరకు టాప్ 1లో కొనసాగిన ఈ చిత్రం రెండింటి కారణంగా మూడో ప్లేసుకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇలా ఎంతో నెగెటివిటీ మూటగట్టుకున్న ఇండియన్ 2 ఇలా టాప్ 1లోకి రావడం ఎవరు ఊహించని ట్విస్ట్.