Super Deluxe: 400+ థియేటర్లలో సమంత రమ్యకృష్ణ విజయ్ సేతుపతి మూవీ- ఐదేళ్లకు తెలుగులో రిలీజ్- ఈపాటికే ఓటీటీలో స్ట్రీమింగ్!
Samantha Ramya Krishna Vijay Sethupathi Fahadh Faasil Movie: సమంత, రమ్యకృష్ణ, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి అగ్ర నటీనటులు నటించిన బ్లాక్ బస్టర్ తమిళ సినిమా సూపర్ డీలక్స్. ఐదేళ్ల తర్వాత 400కుపైగా థియేటర్లలో సూపర్ డీలక్స్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
Super Deluxe Telugu Theatrical Release Date: ఒకరిద్దరూ అగ్ర నటీనటులు ఉంటేనే ఆ సినిమాకు ఎంతో క్రేజ్, విపరీతమైన అంచనాలు ఉంటాయి. అలాంటిది ఏకంగా నలుగురైదుగురు స్టార్ యాక్టర్స్ నటించిన ఐదేళ్ల క్రితం నాటి సినిమా సూపర్ డీలక్స్. వివిధ భాషల్లో పేరు సంపాదించుకున్న అగ్ర నటీనటులు నటించిన ఈ సినిమా 2019లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ మాస్టర్ పీస్ సినిమాను దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్‌పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మించారు. ఈ సినిమాకు త్యాగరాజ కుమార రాజా దర్శకత్వం వహించారు. ఈ సూపర్ డీలక్స్ సినిమాలో తమిళ స్టార్ హీరో, నటుడు మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, మలయాళ పాపులర్ యాక్టర్ పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, సీనియర్ అగ్ర నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
సూపర్ డీలక్స్ సినిమాలో వీరితోపాటు మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్, మృణాళిని రవి, విజయ్ రామ్, మాస్టర్ అశ్వంత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అప్పట్లో తమిళంలో మాస్టర్ పీస్‌గా నిలిచి పలు రికార్డ్స్ కొల్లగొట్టింది. అలా ఎంతో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఐదేళ్లకు ఇప్పుడు తెలుగులో అది కూడా థియేటర్లలో విడుదల కానుంది.
ఆగస్టు 9న సూపర్ డీలక్స్ సినిమాను తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సుమారు 400కుపైగా థియేటర్లలో సూపర్ డీలక్స్ విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. తమిళంలో పెద్ద విజయం అందుకున్న ఈ సూపర్ డీలక్స్ సినిమాలో విజయ్ సేతుపతి స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్ అద్భుతనటన కనబరచారు. అదేవిధంగా ఆ క్యారెక్టర్‌కు గాను ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.
ఇక సమంత, ఫహాద్ ఫాజిల్ భార్యాభర్తలుగా నటించి అలరించారు. భర్తను మోసం చేసి ఎఫైర్ కొనసాగించే భార్యగా సమంత నటన ఆకట్టుకుంటుంది. భార్య విషయం తెలిసిన భర్తగా.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఏం చేయలేక ఆవేశాన్ని మాత్రమే వెళ్లగక్కే సగటు మధ్యతరగతి మనిషిగా, భర్తగా ఫహాద్ ఫాజిల్ నటన ఎంతో ఆలోచింపజేస్తుంది.
శివగామి రమ్యకృష్ణ ఓవైపు గృహిణిగా మరోవైపు అడల్ట్ సినిమాల్లో నటించే నటిగా స్పెషల్ రోల్ చేసింది. భార్య, కొడుకు ఉన్న ఓ భర్త (విజయ్ సేతుపతి) శిల్పాగా ఎందుకు మారాడు? మంచి భర్త ఉండి కూడా వేంబు )సమంత) ఎఫైర్ ఎందుకు పెట్టుకుంది? గృహిణి అయిన లీలా (రమ్యకృష్ణ) ఎందుకు శృంగార సినిమాల్లో నటించాల్సి వచ్చింది? అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
ఇవే కాకుండా సినిమా ప్రారంభం నుంచే సూపర్ ట్విస్టులతో సూపర్ డీలక్స్ ఆద్యంతం అలరిస్తుంది. భక్తి భావన, కామం, మోసం, సైన్స్, లవ్, రివేంజ్, అమాయకత్వం వంటి పలు ఎమోషన్స్‌ను ఒక్కో పాత్రతో.. సన్నివేశాలతో చాలా బాగా ఆవిష్కరించారు. కాగా ఇప్పటికే సూపర్ డీలక్స్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇంతకుముందు తమిళంలో సూపర్ డీలక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ అయింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి ఉంది. ఇక సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి పీఎస్‌వినోద్, నీరవ్ షా డీవోపీగా పని చేశారు. నాలుగు విభిన్న కథలను జోడించి చిత్రీకరించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను అందుకుని.. క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.