Indian 2 Box Office Day 8: కష్టాల్లో కూరుకుపోయిన కమల్ హాసన్ మూవీ.. 8 రోజుల్లో ఇండియన్ 2 కలెక్షన్స్ ఇంతే!
Indian 2 Worldwide Box Office Collection Day 8: గత కొన్ని రోజులుగా ఇండియన్ 2 సినిమా వసూళ్లు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయుడు 2 సినిమాకు 8 రోజుల్లో వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.

Indian 2 8 Days Box Office Collection: ఇండియన్ 2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. లోక నాయకుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ శంకర్ వంటి సెన్సేషనల్ కాంబినేషన్‌లో భారతీయుడు 2 సినిమా వచ్చిన కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఇండియన్ 2 సినిమాకు 8వ రోజున భారతదేశంలో రూ. 1.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది కూడా ఏడో రోజు కంటే తక్కువగానే అని చెప్పాలి. 7వ రోజున భారతీయుడు 2 సినిమాకు రూ. 1.95 కోట్లు రాగా 8వ రోజున 80 లక్షల వరకు కలెక్షన్స్ తగ్గాయి. ఈ 1.15 కోట్లల్లో తెలుగు వెర్షన్ వాటా 27 లక్షలు కాగా హిందీ బెల్ట్ నుంచి రూ. 2 లక్షలు మాత్రమే వచ్చాయి.
ఒక తమిళంలోనే ఎక్కువగా రూ. 81 లక్షలుగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో భారతీయుడు 2 చిత్రానికి 8వ రోజున 43.59 శాతం కలెక్షన్స్ పడిపోయాయి. ఇక ఇండియావైడ్‌గా 8 రోజుల్లో ఇండియన్ 2 మూవీకి రూ. 71.55 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఇండియాలో ఇండియన్ 2 సినిమా వారం గడిచిన వంద కోట్ల క్లబ్‌లో చేరుకోలేకపోవడాన్ని గమనించవచ్చు.
తమిళనాడులో ఇండియన్ 2 సినిమాకు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 చిత్రం రూ. 143 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే, వరల్డ్ వైడ్‌గా ఇండియన్ 2 సినిమాకు రూ. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇంకా ఈ సినిమాకు 100 కోట్లకుపైగా వసూళ్లు వస్తేనే సాధారణ హిట్‌గా లెక్కలోకి వస్తుంది.
వారం గడిచిన భారతీయుడు 2 చిత్రానికి ఇండియాలో వంద కోట్లు రాలేదు. వంద కోట్లు చేరుకోడానికి కూడా ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఈ లెక్కన చూస్తే మరో వంద కోట్ల కలెక్షన్స్ రావాలంటే మాత్రం అసాధ్యమనిపిస్తోంది. ఇలా అయితే ఇండియన్ 2 సినిమాకు కష్టాలు తప్పేలా లేదు. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లతో రోజు రోజుకూ మరింతగా కష్టాల్లోకి కూరుకుపోతోంది భారతీయుడు 2 చిత్రం.
కాగా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదు అయింది. తెలుగులో హిట్ కావాలంటే ఇండియన్ 2 సినిమాకు ఇంకా 11 కోట్లకుపైగా రావాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో వసూళ్లు వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే 11 కోట్లు రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.
ఇకపోతే భారతీయుడు 2 సినిమాకు 9వ రోజున ఇండియాలో రూ. 5 లక్షల వరకు కలెక్షన్స్ రావొచ్చన ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, ఈ అంచనా ప్రస్తుతం బుక్ అయిన టికెట్ల పరంగా వేశారు. నైట్ షో పూర్తి అయ్యేసరికి ఈ కలెక్షన్స్ బాగానే పెరిగే అవకాశం ఉంది.