Siren Telugu OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Siren Telugu OTT: జయం రవి, కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన సైరన్ మూవీ తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Siren Telugu OTT: జయంరవి, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సైరన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగులో ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. తెలుగు వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సైరన్ 108 పేరుతో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. సైరన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల గ్యాప్ తర్వాత సైరన్ ఓటీటీలో విడుదల కాబోతోంది.
కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్...
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జయంరవి ఖైదీగా కనిపించగా, కీర్తిసురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. మూగచెవిటి అమ్మాయిగా ఓ గెస్ట్ రోల్‌లో అనుపమ పరమేశ్వరన్ కనిపించింది.
తెలుగులో డైరెక్ట్ ఓటీటీ...
ఫిబ్రవరి 16న సైరన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్లు అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదాపడింది. తమిళంలో నెగెటివ్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ రిలీజ్‌కు నోచుకోలేదు. తెలుగు వెర్షన్ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.
సైరన్ కథ ఇదే…
తన భార్య జెన్నీఫర్ (అనుపమ పరమేశ్వరన్)ను మర్డర్ చేసిన కేసులో తిలగన్‌కు(జయం రవి) యావజ్జీవ శిక్ష పడుతుంది. తిలగన్‌కు ఓ కూతురు (యువిన పార్థవీ) ఉంటుంది. ఖైదీ కూతురు అంటూ చిన్నతనం నుంచి అందరూ ఎగతాళి చేయడంతో తిలగన్‌ను అతడి కూతురు ద్వేషిస్తుంటుంది. పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన తిలగన్ ఇద్దరు పోలిటికల్ లీడర్‌తో పాటు పోలీస్ ఆఫీసర్‌ను చంపేస్తాడు.
ఈ హత్య కేసులను ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) తీసుకుంటుంది. తిలగన్ హంతకుడు అని తెలిసినా సరైన ఆధారాలే లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేయలేకపోతుంది నందిని. అసలు తిలగన్ జైలుకు ఎందుకు వెళ్లాడో తెలుసుకోవడం మొదలుపెడుతుంది. నంది అన్వేషణలో ఏం తేలింది? అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే తిలగన్‌కు యావజ్జీవ శిక్ష ఎందుకు పడింది?
ప్రేమించిన పెళ్లాడిన తన భార్య జెన్నిఫర్‌ను నిజంగానే తిలగన్ చంపేశాడా? పొలిటికల్ లీడర్స్ తో పాటు ఐపీఎస్ ఆఫీసర్ నాగలింగాన్ని (సముద్రఖని) తిలగన్ చంపాలని ఎందుకు అనుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
రొటీన్ స్టోరీలైన్...
రొటీన్ స్టోరీలైన్, ఇన్వేస్టిగేషన్ సీన్స్‌లో థ్రిల్ మిస్సవ్వడంతో సైరన్ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోయిన్ అంటూ ప్రచారం చేశారు. కానీ ఆమె గెస్ట్ రోల్‌కే పరిమితం చేయడం కూడా ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు.
పోలీస్ ఆఫీసర్‌గా కీర్తిసురేష్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు.దసరా తర్వాత తెలుగులో రిలీజ్ అవుతోన్న కీర్తి సురేష్ మూవీ ఇదే. తమిళంలో వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తోన్న కీర్తిసురేష్ తెలుగులో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.