Bike for youth : యువత కోసమే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్- స్టైలిష్ డిజైన్, అదిరే పర్ఫార్మెన్స్..
Royal Enfield Scram 440 : రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 ను మోటోవర్స్ 2024 లో ఆవిష్కరించింది. ఈ బైక్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
రాయల్ ఎన్ఫీల్డ్ మోటోవర్స్ 2024 లో కొత్త స్క్రామ్ 440ని విడుదల చేసింది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 స్క్రామ్ 411 ఆధారిత అప్డేటెడ్ వెర్షన్. ఈ బైక్ పెద్ద ఇంజిన్, ఎక్కువ శక్తి, ఎక్కువ ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్స్‌ని పొందుతుంది. ఇది ఆర్ఈ బైక్స్‌లో 411 సీసీ డిస్ప్లేస్మెంట్కు ముగింపును సూచిస్తుంది! అయితే మోటార్ అప్‌గ్రేడ్ అవతారంలో స్క్రామ్ 440లో కొనసాగుతుంది.
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 పాత స్క్రామ్ 411 నుంచి ఛాసిస్‌ని నిలుపుకుంటుంది. రేర్ సబ్ ఫ్రేమ్ మరింత లోడ్ బేరింగ్ లక్షణాల కోసం సవరించడం జరిగింది. మెరుగైన దృఢత్వం కోసం ఇప్పుడు కొత్త స్టీల్‌తో తయారు చేశారు. స్టైలింగ్ అలాగే ఉంది కానీ కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇండికేటర్ల రూపంలో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్స్క్రామ్ 440 బైక్‌ని ఫోర్స్ బ్లూ, ఫోర్స్ టీల్, ఫోర్స్ గ్రే, ట్రయల్ గ్రీన్, ట్రయల్ బ్లూ అనే ఐదు కొత్త కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.
ఈ బైక్‌లో వైర్-స్పోక్డ్ వీల్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు ఇప్పుడు అల్లాయ్ వీల్స్‌ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. 19 ఇంచ్ ఫ్రంట్, 17 ఇంచ్ రేర్ వీల్ సెటప్ డ్యూయల్ పర్పస్ టైర్లతో పనిచేస్తాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 200 ఎంఎం, సీటు హైట్ 200 ఎంఎం. స్క్రామ్ 440లో టైప్-ఏ యూఎస్బీ ఛార్జర్, పాత మోడల్ మాదిరిగానే డిజిటల్-అనలాగ్ క్లస్టర్ ఉంటాయి. నావిగేషన్ కోసం ట్రిప్పర్ పాడ్ ఆప్షనల్ యాడ్-ఆన్‌గా అందుబాటులో ఉంది.
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440: పవర్ అండ్ పర్ఫార్మెన్స్
సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, 443 సీసీ ఇంజిన్ వస్తుంది ఈ కొత్త బైక్. దీన్ని ఒరిజినల్ హిమాలయన్/స్క్రామ్ 411 లాంగ్-స్ట్రోక్ ఇంజిన్ ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ ఇంజిన్ ఇప్పుడు 25.4 బీహెచ్పీ పవర్, 34 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది పాత స్క్రామ్ 411 కంటే ప్రధాన అప్‌గ్రేడ్.
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440:
సస్పెన్షన్ సెటప్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ అబ్సార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ పనితీరును 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 240 ఎంఎం రేర్ డిస్క్‌తో అప్‌గ్రేడ్ చేశారు. స్క్రామ్ 440 బరువు 187 కిలోలు. ఈ బైక్ ఇప్పుడు సెంటర్ స్టాండ్‌తో వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త స్క్రామ్ 440ని జనవరి 2025 లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. పాత మోడల్ కంటే స్వల్పంగా ధరల పెంపు ఉంటుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం