Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. అన్నీ తెలుగులోనివే.. ఇక్కడ చూసేయండి!
Today OTT Streaming Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే (సెప్టెంబర్ 12) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 8 వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 5 చాలా స్పెషల్‌గా ఉండగా.. అవన్నీ తెలుగులో ఉండటం విశేషం. మూడు తెలుగు, ఒకటి కన్నడ డబ్బింగ్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.
Today OTT Releases: ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 25కిపైగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ప్రతి వారం ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఎక్కువగా రెగ్యులర్‌గా శుక్రవారం నాడే స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ, ఈసారి గురువారం అంటే ఇవాళ (సెప్టెంబర్ 12) కూడా అధికంగా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
రెండ్రోజుల్లో సమానంగా
అంటే, ఈ వారంలో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో సమానంగా ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు 8 వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూడాల్సిన స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసులు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఆయ్ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 12
మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12
బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
మిడ్‌నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
కమిటీ కుర్రోళ్లు (తెలుగు చిత్రం)-ఈటీవీ విన్ ఓటీటీ- సెప్టెంబర్ 12
భీమా (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 12
కల్‌బరి రికార్డ్స్ (హిందీ చిత్రం)- జియో సినిమా ఓటీటీ- సెప్టెంబర్ 12
సోనీ లివ్ ఓటీటీ
తలవన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 10
బెంచ్ లైఫ్ (తెలుగు వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 11
మూడు తెలుగు సినిమాలు
ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 8 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో మూడు తెలుగు సినిమాలు చాలా స్పెషల్ కానున్నాయి. వాటిలో ఒకటి డిజాస్టర్ మూవీ కాగా మిగతా రెండు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాయి. ఆ సినిమాలే వరుసగా మిస్టర్ బచ్చన్, ఆయ్, కమిటీ కుర్రోళ్లు.
తెలుగు డబ్బింగ్ కన్నడ చిత్రం
ఈ మూడింటితోపాటు తెలుగులో డబ్బింగ్‌కు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ భీమా కూడా స్పెషల్ కానుంది. ఇందులో కన్నడ సీనియర్ నటుడు దునియా విజయ్ హీరోగా నటించారు. అయితే, గురువారం రిలీజ్ కావాల్సిన తెలుగు వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగు వెబ్ సిరీస్ కూడా
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ ఏడు భాషల్లో సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఇవాళ 8 ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో ఐదు ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో నాలుగు సినిమాలు (మూడు తెలుగు, ఒకటి కన్నడ డబ్బింగ్) కాగా.. ఒకటి తెలుగు వెబ్ సిరీస్ ఉంది.