Brahmamudi July 6th Episode: బ్రహ్మముడి- అనామికకు ఊహించని దెబ్బేసిన కావ్య అప్పు- 2 వీడియోలతో నిరూపించిన అక్కా చెల్లెళ్లు-brahmamudi serial july 6th episode anamika in huge trouble kavya appu big twist to anamika brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 6th Episode: బ్రహ్మముడి- అనామికకు ఊహించని దెబ్బేసిన కావ్య అప్పు- 2 వీడియోలతో నిరూపించిన అక్కా చెల్లెళ్లు

Brahmamudi July 6th Episode: బ్రహ్మముడి- అనామికకు ఊహించని దెబ్బేసిన కావ్య అప్పు- 2 వీడియోలతో నిరూపించిన అక్కా చెల్లెళ్లు

Sanjiv Kumar HT Telugu
Published Jul 06, 2024 07:22 AM IST

Brahmamudi Serial July 6th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 6వ తేది ఎపిసోడ్‌లో అనామికకు ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తారు అక్కా చెల్లెళ్లు కావ్య అప్పు. అనామికే కావాలని ఇదంతా చేయించినట్లు రెండు వీడియోలతో సహా కోర్టులో జడ్జ్ ముందు నిరూపిస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూలై 6వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూలై 6వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్ జైలుకు వెళ్లి వచ్చాకా పెళ్లి అన్న, భార్య అన్న విముఖత వస్తుందని జడ్జ్ అంటాడు. అదంతా నాకు తెలియదు సార్ అతనితో సంబంధం పెట్టుకున్న అప్పును అస్సలు వదలకూడదు, ఈ తప్పులో ఇద్దరికి భాగముంది కాబట్టి ప్రపంచానికి తెలియాలి. ఇంకెవరు కట్టుకున్న భార్యకు ఎవరు అన్యాయం చేయకుండా దారుణమైన శిక్ష వేయాలని అనామిక డిమాండ్ చేస్తుంది.

మీరు వేసే శిక్షే చాలా చిన్నది

ఏ తీర్పు చెప్పాలో కూడా నువ్వే చెబుతావా. అదొక్కటి నాకు వదిలేయమని జడ్జ్ అంటాడు. మీరెమంటారు కల్యాణ్ దుగ్గిరాల అని అడుగుతాడు జడ్జ్. నాకు విడాకులు కావాలి సార్ అని కల్యాణ్ అంటాడు. మరి శిక్ష నుంచి తప్పించుకోవాలని లేదా అని జడ్జ్ అడుగుతాడు. నేను చేయని తప్పుకు శిక్ష పడుతుందంటే ఆనందంగా భరిస్తాను సార్. అనామికను పెళ్లి చేసుకుని నేను తెలిసి చేసిన అపరాధం. ఇంకా తనతో కలిసి జీవితాతం భరించాల్సి వస్తే దానికంటే మీరు వేసే శిక్ష చాలా చిన్నది సార్ అని కల్యాణ్ అంటాడు.

దాంతో అంతా షాక్ అవుతారు. అనామిక లాయర్ లేస్తుంటే.. మీ వంతు రాలేదమ్మా అని వారిస్తాడు జడ్జ్. యువరానర్ ఆయన చాలా తెలివిగా నా చేయి నాపైనే పెడుతున్నాడు. అప్పును పెళ్లి చేసుకునేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు అని అనామిక అంటుంది. అతనికి శిక్ష పడుతుంది కదమ్మా అని జడ్జ్ అంటే.. అదంతా కాదు సర్. నా భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకోడానికి వీళ్లేదని అనామిక అంటుంది. విడాకులు ఇచ్చాక నువ్ ఒప్పుకునేదేంటమ్మా.. అతను అప్పును చేసుకుంటాడో వడ్డీనే చేసుకుంటాడో నీకు అనవసరం కదమ్మా అని జడ్జ్ అంటాడు.

చిరాకు రాదా

ఈ అమ్మాయి ఏం కోరుకుంటుందో ఈ కోర్టుకు అర్థమయ్యేలా చెప్పండి అని కల్యాణ్ లాయర్‌తో జడ్జ్ అంటాడు. దాంతో అనామిక పేరును మళ్లీ అడుగుతాడు లాయర్. కంటిన్యూగా అదే ప్రశ్న పరివిధాలుగా అడుగుతాడు. దాంతో ఎన్నిసార్లు అడుగుతారు. చిరాకు వస్తుందని అనామిక అంటుంది. మరి నీ భర్తకు రాదా. అప్పుతో అక్రమ సంబంధం పెట్టుకున్నావ్ అని ఇంటా బయట, అందరిముందు చెప్పిందే చెబితే ఏ మగాడికి అయినా చిర్రెత్తికొస్తుంది కదా అని లాయర్ అంటాడు.

అప్పుతో కల్యాణ్‌కు ఉన్నది స్నేహం అని ఎన్నోసార్లు చెప్పాడు. అనామిక పేరు మారనట్లే తన స్నేహం మారదు అన్నాడు. అయినా అనామిక వినలేదు. దాంతో కల్యాణ్ విడాకులు ఇస్తానన్నాడు. దాంతో అనామిక ఇగో హర్ట్ అయింది. అందుకే ఇలా కోర్టుదాకా తెచ్చింది. అందుకే నా క్లయింట్ నిరపరాధి అని గుర్తించాలని లాయర్ చెబుతాడు. అలా అయితే అప్పు, కల్యాణ్ హోటల్‌లో రహస్యంగా కలుసుకోవడానికి కారణం ఏంటీ అని అనామిక లాయర్ అడుగుతుంది.

గదిలో ఎన్ని క్షణాలు ఉన్నారు

అప్పును క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అనామిక లాయర్ అడుగుతుంది. అప్పు కల్యాణ్ హోటల్‌ గదిలో ఉన్న వీడియో చూస్తాడు జడ్జ్. అదంతా తప్పుడు సమాచారం, అది నిరూపిస్తానని కల్యాణ్ లాయర్ అంటాడు. ఆ వీడియోలో కల్యాణ్, అప్పు ఒకే బెడ్ మీద ఉన్నారా. కౌగిలింతలో ఉన్నారు. గదిలో ఎన్ని క్షణాలు ఉన్నారు. ఎప్పుడు బయటకు వచ్చారు. ఎలా దొరికారు. ఇదంతా వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి కావాలని ఆడిన డ్రామా అని లాయర్ అంటాడు.

వాళ్లు హోటల్‌కు వెళ్లింది నిజమే. కానీ వాళ్లు వెళ్లిన ఒక నిమిషానికే బయట నుంచి బేరర్ గడియపెట్టాడు. అప్పుడే అనామిక అత్తను, మీడియాను పట్టుకుని వచ్చింది. అనామిక ఒక్క నిమిషంలో మీడియాను ఎలా తీసుకొచ్చింది. సరే వాళ్లు ముందు గది బుక్ చేసుకుందామనుకున్నాం. కానీ, ఆ టైమ్‌లో హోటల్‌లో వాళ్ల పేరు మీదే బుక్ కాలేదు. దానికి సంబంధించిన వీడియో మీ ముందు ఉంచాను అని లాయర్ అంటాడు. దాంతో అదంతా జడ్జ్ చూస్తాడు.

అప్పును ప్రశ్నలు అడగాలి

అనామికే కావాలనే ప్లాన్ చేసి వాళ్ల మధ్య సంబంధం ఉందనిపించేలా కావాలని ప్లాన్ చేసింది. ఏ తప్పు చేయని ఒక ఆడపిల్ల శీలం మీద బురద జల్లడం నేరం. ఒక అమాయకుడి మీద నింద వేయడం అంతకంటే నేరం. కాబట్టి నా క్లయింట్‌ను నిరపరాధిగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను అని లాయర్ అంటాడు. తర్వాత అప్పుతో కల్యాణ్‌కు సంబంధం లేదన్నదాంట్లో నిజం లేదు. మీరు ఒప్పుకుంటే అప్పును కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని అనామిక లాయర్ అంటుంది. జడ్జ్ ప్రోసీడ్ అంటాడు.

దాంతో అప్పు వచ్చి కోర్టు బోనులో నిల్చుంటుంది. కల్యాణ్‌తో సంబంధం ఎప్పటినుంచి అని లాయర్ అడిగితే.. మా అక్కకు తను మరిది. సంవత్సరం నుంచి తెలుసు అని అప్పు అంటుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా. నువ్ కల్యాణ్‌ను ప్రేమించలేదా, పెళ్లి చేసుకోవాలనుకోలేదా అని లాయర్ అడుగుతుంది. నేను ప్రేమించాను. కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఎందుకుంటే వాడు నన్ను ప్రేమించలేదు కాబట్టి. వాడి మనసులో నేను లేనప్పుడు ఫ్రెండ్‌లాగే ఉందామనుకున్నాను అని అప్పు అంటుంది.

అనామికే ఒప్పుకున్నట్లు సాక్ష్యం

లేదు. నీకు కల్యాణ్‌కు సంబంధం ఉంది అందుకే అనామిక కేసు పెట్టిందని లాయర్ అంటుంది. పిచ్చిది.. అపార్థం చేసుకుందని, ఉంటే రుజువు చేయండని అప్పు అంటుంది. లేదని నువ్ చేయగలవా అని లాయర్ అడిగితే చేస్తాను అని అప్పు అంటుంది. ఇంతలో కల్యాణ్ లాయర్ లేచి.. వాళ్లకు సంబంధం లేదని అనామికే ఒప్పుకున్నట్లు సాక్ష్యం ఉంది అని వీడియో చూపిస్తాడు కల్యాణ్ లాయర్. దాన్ని స్క్రీన్‌పై చూపించమంటాడు జడ్జ్.

అందులో అప్పుతో అనామిక కావాలని ప్లాన్ చేసినట్లు మాట్లాడింది ఉంటుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. కట్ చేస్తే అదంతా బంటి వీడియో తీసింది చూపిస్తారు. మిలాడ్ ఇప్పటికైనా అనామిక ఉద్దేశం ఏంటో అర్థమైంది కదా అని లాయర్ అంటాడు. మరి ఈ విషయంలో అనామిక చిత్రహింసలకు గురి కావడం మాటేంటీ అని అనామిక లాయర్ అంటుంది. బాణాలు తెచ్చి విల్లు మర్చిపోతామా మేడమ్. ఈ కేసులో బలమైన సాక్ష్యం సేకరించిన ఒక ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నా. ఆ సాక్షి పేరు కావ్య అని లాయర్ అంటాడు.

అనామిక ఉద్దేశం

జడ్జ్ పర్మిషన్ ఇవ్వడంతో కావ్య వచ్చి కోర్టు బోనులో నిల్చుంటుంది. మీరెం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని కావ్యను జడ్జ్ అడుగుతాడు. ఆయన నా మరిదిగారు. తల్లి తర్వాత తల్లిగా నన్ను భావిస్తాడు. ఆయన భావకుడు. కవిత్వం తప్పా ఏం తెలియదు. అలాంటి అతని ప్రపంచంలోకి కేవలం ఆస్తి కోసమే వచ్చింది ఆ అనామిక. ఆ విషయం నాకు నిన్న రాత్రే తెలిసింది. వీళ్లిద్దరికి సంధి చేద్దామని నిన్న అనామికను కలిశాను. ఆమె ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని కలవడానికే వెళ్లాను అని కావ్య చెబుతుంది.

నేను కలిపేందుకు వెళ్లినా.. దాడి చేసేందుకు వచ్చినట్లు ఆరోపిస్తుందని.. ముందు జాగ్రత్తగా నేను ఒక పని చేశాను. నేను అనామిక మాట్లాడినదంతా ఆమెకు తెలియకుండా రికార్డ్ చేయించాను అని కావ్య చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అందంతా పూర్తిగా రికార్డ్ అయిందని ఆ వీడియో జడ్జ్‌కు ఇస్తాడు లాయర్. నిన్నటిదాకా అనామిక కల్యాణ్ కాపురం నిలబెట్టాలని ప్రయత్నించాను. కానీ, నిన్న రాత్రే ఆమె అసలు స్వరూపం తెలిసింది. ఇక ఇలాంటి మనిషి నా మరిది జీవితంలో ఉండకూడదనే అభిప్రాయం వచ్చింది అని కావ్య అంటుంది.

ఐ లవ్యూ చెప్పిన రాజ్

ఎందుకు ఇలా అంటున్నానో అందకరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మరోసారి మా మరిది తన సంస్కారం చాటుకోవాల్సిన పరిస్థితి ఉందని కావ్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య బట్టలు సర్దిపెడుతుంటే రాజ్ రొమాంటిక్‌గా చూస్తాడు. తర్వాత కావ్యను ఎత్తుకుని ఐ లవ్ యూ కళావతి అని చెబుతాడు. దాంతో సంతోషంతో ఆశ్చర్యపోతుంది కావ్య.

Whats_app_banner