Brahmamudi August 6th Episode: బ్రహ్మముడి- నిజం తెలుసుకున్న కల్యాణ్- అప్పు పెళ్లి పెటాకులు- కుప్పకూలిన కృష్ణమూర్తి-brahmamudi serial august 6th episode kalyan learns anamika plan krishnamurthy fall down brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 6th Episode: బ్రహ్మముడి- నిజం తెలుసుకున్న కల్యాణ్- అప్పు పెళ్లి పెటాకులు- కుప్పకూలిన కృష్ణమూర్తి

Brahmamudi August 6th Episode: బ్రహ్మముడి- నిజం తెలుసుకున్న కల్యాణ్- అప్పు పెళ్లి పెటాకులు- కుప్పకూలిన కృష్ణమూర్తి

Sanjiv Kumar HT Telugu
Aug 06, 2024 10:54 AM IST

Brahmamudi Serial August 6th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌లో అప్పును అనామికే కిడ్నాప చేసిందని బంటి ద్వారా కల్యాణ్ తెలుసుకుంటాడు. మరోవైపు పెళ్లి కొడుకు వాళ్లు సంబంధం వద్దని వెళ్లిపోతారు. దాంతో కనకం, కృష్ణమూర్తి కుప్పకూలిపోతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పును అనామిక కిడ్నాప్ చేయిస్తుంది. నన్ను కిడ్నాప్ చేయించి ఏం సాధిస్తావే అని అప్పు అంటుంది. నీపై నేను వేసిన మచ్చ బలంగా ఉంటుంది కదా. ఇప్పుడు రుద్రాణి వాళ్లు నువ్ ఇష్టపడినవాళ్లతో లేచిపోయావ్ అని పుకార్లు పుట్టిస్తుంటారు అని అనామిక అంటుంది. అలాగే అప్పు లేచిపోయిందని మరోవైపు రుద్రాణి పెళ్లికి వచ్చినవాళ్లతో చెబుతుంది.

చెడిపోయినట్లు ముద్రపడితే

నన్ను జైలుకు పంపించిన కల్యాణ్, నీకు నాలాగే పెళ్లి పెటాకులు లేకుండా చేస్తానే. అది నాకు చాలు నువ్ ఎంత మగరాయుడిలా ఉన్న ఆడదానివే కదా. నీ శీలం మీద మచ్చపడితే ఇప్పటికీ హోటల్ బుక్ చేశాం రమ్మని ఓ బజారుదాన్ని పిలిచినట్లు రమ్మంటున్నారు. ఈ పెళ్లి నుంచి మాయమైపోతే దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్లు నీలాంటి చెడిపోయినట్లు ముద్రపడినదాన్ని ఎన్నటికీ లోపలికి అడుగు పెట్టనివ్వరు. నీకోసం నన్ను కాదనుకున్న కల్యాణ్ జీవితాంతం ఒంటరిగా ఉంటాడు అని అనామిక కోపంగా చెబుతుంది.

నీపై పడిన నిందలు భరించలేక కనిపించినవాళ్ల తలలు పగులగొడుతూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అని అనామిక అంటుంది. నువ్ ఇప్పటికే చాలా తప్పులు చేశావ్. ఇది ఇంకా పెద్ద తప్పు. నువ్ దొరికిపోతే చట్టం నిన్ను వదిలిపెట్టదు. అప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు అని అప్పు అంటుంది. నీ పెళ్లి ఆగిపోతే.. లేచిపోయినదానివి అని లోకం నిన్ను నీ ఫ్యామిలీని ఎలివేస్తే.. మీకు విషయం తాగి చావడమే నా టార్గెట్ అని అనామిక అంటుంది.

ఎలా మాట్లాడుతున్నారో చూశారుగా

మరోవైపు కల్యాణ్ కారులో వస్తుంటాడు. రాజ్ కావ్య అప్పుకోసం వెతుకుతుంటారు. రాజ్ ఎస్సైకి కాల్ చేసి అప్పు మిస్ అయిపోయిందని చెబుతాడు. తనంతట తాను వెళ్లే అవకాశం లేదు. ఎవరో తనను బలవంతంగా తీసుకెళ్లారు. మీరే తనను తీసుకురావాలి. లేకుంటే తన పెళ్లి ఆగిపోతుంది అని రాజ్ రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని ఎస్సై చెబుతాడు. వాళ్లు ఎప్పుడు పట్టుకుంటారండి.. మీ పిన్నిగారు ఎలా మాట్లాడుతున్నారో చూశారుగా అని కావ్య అంటుంది.

నా చెల్లి ఎక్కడున్నా నేనే వెతికి తీసుకొస్తాను అని కావ్య అంటుంది. ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతావ్. పోలీసులు ఇప్పుడే ఎంక్వైరీ మొదలుపెట్టారు. కాస్తా క్లూ దొరికినా మనం వెళ్దాం అని రాజ్ అంటాడు. ఆ కాస్తా టైమ్ కూడా ఆ రుద్రాణి ఇవ్వట్లేదు. అందరిముందే అన్నన్ని మాటలు అంటుంది. అన్ని తెలిసి పెళ్లికి ముందుకు వచ్చిన ఆ అబ్బాయి వాళ్ల ముందు మీ పిన్ని గారు అప్పు లేచిపోయిందని మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అని కావ్య అంటుంది.

షాక్ అయిన కల్యాణ్

నాకు కాస్తా టైమ్ ఇవ్వు. అప్పును తీసుకొచ్చి వాళ్ల నోళ్లు మూయిస్తాను అని రాజ్ అంటాడు. ఒక్క అవకాశం దొరికినా చాలు అప్పును నేను తీసుకొస్తా అని కావ్య అంటుంది. మరోవైపు కల్యాణ్ కారుకు అడ్డంగా ఓ బాబు వస్తే.. కారు ఆపేస్తాడు కల్యాణ్. ఇంతలో బాబు తల్లి వచ్చి ఏం కాలేదుగా బాబు అని కల్యాణ్‌కు దండం పెట్టి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి వెళ్తుండగా.. రోడ్ పక్కకు కిందపడి ఉన్న బంటి కల్యాణ్‌కు కనిపిస్తాడు. బంటిని చూసి కల్యాణ్ షాక్ అవుతాడు.

బంటిని కంగారుగా లేపుతాడు కల్యాణ్. ఏమైందిరా నీకు. ఇలా పడిపోయావేంటీ అని కల్యాణ్ అడుగుతాడు. అప్పు అక్కను కిడ్నాప్ చేశారు అని బంటి చెబుతాడు. ఏంటీ అని షాక్ అయిన కల్యాణ్ ఎవరు అని అడుగుతారు. అప్పుడు అప్పుకు మత్తు మందు ఇచ్చి రౌడీలు కిడ్నాప్ చేయడం గురించి బంటి చెబుతాడు. అప్పును రౌడీలు ఎత్తుకుని వెళ్తుండగా బంటి చూస్తాడు. కారులో అప్పుని పడేస్తారు. కారులో ఉన్న అనామికను బంటి చూసి షాక్ అవుతాడు.

ఎలాగైనా కాపాడు

అక్క అంటూ కారు వెనుక పరుగెత్తుతాడు బంటి. కారు వెనుక పరుగెత్తతుండగా అదుపుతప్పి పక్కన పడిపోతాడు బంటి. అదంతా కల్యాణ్‌కు చెబుతాడు బంటి. అనామిక అప్పును కిడ్నాప్‌ చేసిందా అని కల్యాణ్ షాకింగ్‌గా అడుగుతాడు. అవును, ఇప్పటికే పెళ్లిమండపంలో గొడవ జరుగుతూ ఉంటుంది. నువ్వే ఎలాగైనా అక్కను కాపాడాలని అని బంటి చేతులెత్తి మొక్కుతాడు. మరోవైపు రాజ్ కావ్య రావడంతో అప్పు దొరకలేదని అర్థం చేసుకుంటారు.

ఎక్కడ నీ చెల్లెలు అని రుద్రాణి, ధాన్యలక్ష్మీ సెటైర్లు వేస్తారు. నీ చెల్లి ఎక్కడ పెళ్లి చేయించి వస్తున్నారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అవును, కల్యాణ్ ఒప్పుకుంటుంటే పెళ్లి చేసి హనీమూన్‌కు పంపించేవాన్ని అని రాజ్ అంటాడు. రాజ్ అని ధాన్యలక్ష్మీ గట్టిగా అరుస్తాడు. షటప్ ధాన్యలక్ష్మీ. నా కొడుకుపై అరుస్తున్నావేంటీ అని అపర్ణ అంటుంది. నా కొడుగు గురించి ఆలోచిస్తున్నాను అక్క అని ధాన్యలక్ష్మీ అంటుంది. అలా ఆలోచించేదానివే అయితే.. ఆ పెళ్లి పెటాకులు అయ్యేదే కాదు. నీ మూలంగానే అనామిక మూర్ఖంగా తయారు అయిందని ప్రకాశం అంటాడు.

నా కర్మకాలితే

ఈవిడ ముందు బాగానే ఉండేది. మా అత్తతో మంతనాలు జరిపి ఇలా తయారైందని స్వప్న అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్లు వెతికితీసుకొస్తారు అని రాజ్ అంటాడు. కనకం ఏడుస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావ్ కనకం. నీ కూతురు బాగానే ఉంటుంది. నా కర్మకాలితే నా కొడుకును పెళ్లి చేసుకుని వస్తుందని, నా కొడుకు జీవితం సర్వనాశనం అయ్యేదాకా వదలదు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అలా అనుకుంటే అనామికతో విడాకులు ఇప్పించేది కాదని స్వప్న అంటుంది.

పెళ్లికి ఒప్పుకుని, అటు కల్యాణ్ ఇటు అప్పు ఒకేసారి ఎలా మాయమైపోతారు. మోసం చేసి లేచిపోయారనే కదా అని రుద్రాణి అంటుంది. మీరంతా కొంచెం ఆపుతారా అని పెళ్లి కొడుకు శ్రీరామ్ అరుస్తాడు. ఇంతసేపటి నుంచి మీ పాత చరిత్ర గురించి మాట్లాడుతున్నారే కానీ నా గురించి ఆలోచించారా. అప్పు గురించి ఎవరు ఎంత చెప్పిన వినలేదు. తీరా తాళి కట్టే సమయానికి అప్పు వెళ్లిపోయింది. ఆ వెళ్లిపోవడం వెనుక లేచిపోయిందని వినిపిస్తోంది. ఇంకా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా అంతా వెధవ ఎవడు ఉండడు అని శ్రీరామ్ అంటాడు.

మచ్చపడ్డ అమ్మాయి

ఈ పెళ్లి వద్దు. అమ్మాయి వద్దు అని శ్రీరామ్ అంటాడు. నా కూతురు అలాంటిది కాదని కనకం ఏడుస్తూ అంటుంది. ఈ సంబంధం తప్పిపోయిందే మంచిదైంది. లేకుంటే రోజుకొకడు వచ్చి నన్ను హోటల్ బుక్ చేయమనేవాడు. ఇక్కడున్న వారందరూ మీ అప్పు గురించి నీచంగా మాట్లాడుతున్నారు అని శ్రీరామ్ అంటాడు. ఇలా పుకార్లు తీసుకొచ్చే పిల్ల మాకొద్దు. ఇంత పెద్ద మచ్చ పడ్డ అమ్మాయి మాకొద్దు. లేచిపోయిన పిల్ల మళ్లీ వస్తుందని లేదు. ఇంతదరిద్రపు గొట్టు సంబంధం అనుకోలేదు. వీళ్ల గురించి దుగ్గిరాల కుటుంబమే కథలుగా చెబుతోంది అని పెళ్లి కొడుకు వాళ్లు వెళ్లిపోతారు.

పెళ్లికి వచ్చినవాళ్లంతా ఏదోకటి అనుకుంటూ వెళ్లిపోతారు. అటు కనకం ఇటు కృష్ణమూర్తి కుప్పకూలిపోతారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా. మీరు అసలు ఆడపుట్టుకే పుట్టారు. పచ్చని మండపంలో ఆడపిల్ల గురించి, వాళ్ల అక్కల గురించి ఇలా మాట్లాడారే. మీ మాటల వల్ల అంతా ఉన్నతంగా ఆలోచించే పెళ్లి కొడుకు కూడా వెళ్లిపోయాడు. కావ్యకు ముసుగేసింది రుద్రాణి కాదా. స్వప్న లేచిపోయిందంటున్నావ్. నీ కొడుకు చరిత్ర ఏంటనేది గుట్టు విప్పామంటావా అని ఇందిరాదేవి అంటుంది.

కల్యాణ్ ఎంట్రీ

ఎంతమంది ఆడపిల్లలను నాశనం చేశాడో నీలాగా చెప్పమంటావా. రాజ్ పెళ్లి చేసుకునే అమ్మాయికి మాయ మాటలు చెప్పి లేపుకెళ్లింది నీ కొడుకు కాదా అని ఇందిరాదేవి అందరినీ కడిగేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో పెళ్లి అలా చెడిపోయిందా అని అనామిక సంతోషిస్తుంది. మరోవైపు ఈపాటికి నీ కొడుకుకి అప్పుతో పెళ్లి అయిపోయి ఉంటుందని రుద్రాణి మాటలు అంటుంది. ఇంతలో స్టాప్ ఇట్ అంటూ కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు.