Brahmamudi November 8th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను బ్లాక్ మెయిల్ చేసిన కావ్య- కల్యాణ్ ఆటో బయోగ్రఫీ బట్టబయలు
Brahmamudi Serial November 8th Episode: బ్రహ్మముడి నవంబర్ 8 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో కంపెనీ ఉద్యోగులందరికీ కావ్య బోనస్‌లు ఇస్తుంది. అలాగే, మేనేజర్ అయిన రాజ్‌కు కూడా కావ్య బోనస్ ఇస్తుంది. అయితే, ఆ బోనస్‌ను తిప్పికొడుతూ కావ్యకే తిరిగి ఇస్తాడు రాజ్. తర్వాత రాజ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తుంది కావ్య.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో దీపావళి సందర్భంగా కంపెనీ ఎంప్లాయిస్ అందరికీ బోనస్ ఇవ్వమని సీతారామయ్య అంటాడు. దాంతో రాజ్ వైపు చూస్తుంది కావ్య. ఏంటీ నా వైపు చూస్తున్నావ్. ఏదో పర్మిషన్ అడిగినట్లు అని రాజ్ అంటాడు. తాతయ్య మీరందరూ నన్ను సీఈవో స్థానంలో కూర్చోబెట్టారు. నా వయసు చాలదు. అనుభవం చాలదు. కానీ, మీ మాట కాదనలేక కూర్చున్నాను అని కావ్య అంటుంది.
ఎలా కోడలు అవుతుంది
అదంతా ఆఫీస్ వరకే పరిమితం అయితే బాగుండేది. కానీ, ఇప్పుడు మీరందరూ ఉన్నారు. ఇందరిముందు నేనేందుకు తాతయ్య. నా చేతులమీదుగా బోనస్ ఇవ్వమంటున్నారు. ఆ అర్హత నాకు లేదు అని కావ్య అంటుంది. ఆఫీస్‌లో అర్హత స్థాయినిబట్టి ఉంటుంది. ఇంట్లో అయితే కోడలు అనే స్థాయి చాలు అని సీతారామయ్య అంటాడు. అదేలా నాన్నా.. భార్యగా రాజ్ ఒప్పుకోనప్పుడు ఎలా కోడలు అవుతుంది. వేలంపాటలో అనామికను అమాయకురాలని చేసి గెలిచినంత మాత్రనా అందలం ఎక్కిస్తారేంటీ అని రుద్రాణి అంటుంది.
రాజ్ కంపెనీని ఈ స్థాయిలో నిలబెట్టాడు. మీ తర్వాత ఆ అర్హత రాజ్‌కే ఉంది. వాడి ముందు కావ్యకు ఎలా ఇప్పిస్తారు అని రుద్రాణి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ కూడా ఇలాగే అంటుంది. దాంతో రుద్రాణి ప్రభావం నీమీద బాగానే పడింది. మనం ఇంటికి కోడళ్లుగా వచ్చినప్పుడు మనిద్దరితో బోనస్ ఇప్పించారు. అప్పుడు నువ్వు, నేను మనకు అర్హత లేదని అనలేదు. ఇప్పుడు నా కోడలిదాకా వచ్చేసరికి అనడానికి రుద్రాణి ఎవరు, నువ్వెవరు అని అపర్ణ కౌంటర్ ఇస్తుంది.
ఇది ఇంటి సమస్య. బోనస్‌లు ఇవ్వడం సీఈఓ బాధ్యత. దాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఛైర్మన్‌గా నా భర్త చెప్పినట్లు చేయాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది. రాజ్ హర్ట్ అవుతాడేమో అని రాహుల్ అంటే.. లేదు. బోనస్ ఇవ్వడం అనేది మన బాధ్యత. బోనస్ ఎవ్వరు ఇచ్చారని కాకుండా స్టాఫ్ అంతా దీపావళి జరుపుకోవడమే ముఖ్యం అని రాజ్ అంటాడు. దాంతో అంతా చప్పట్లు కొడతారు. మంచి మాట చెప్పావ్ రాజ్. నా మనవడు అనిపించావ్ అని సీతారామయ్య అంటాడు.
మాకెవరికి తెలియదు
దాంతో కావ్య వెళ్లి బోనస్‌లు ఇస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ ఓ కవర్‌లో మేనేజర్ రాజ్ పేరు ఉంటుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. అది గమనించిన సీతారామయ్య రాజ్‌ను ఇంకా ఏడిపిస్తున్నావా అని ఇందిరాదేవితో అంటాడు. ఆ కవర్ ఎవరిదో వారికి ఇచ్చేయ్ అని ఇందిరాదేవి అంటుంది. దాంతో రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి చెబుతుంది. దానికి తెగ ఫైర్ అవుతాడు రాజ్. ఎవరు ఈ కవర్ మీద నా పేరు రాశారు అని అంటాడు. మాకెవరికి తెలియదు అని అంతా అంటారు.
అందరికి తెలుసు. కావాలనే చేశారు అని రాజ్ అంటాడు. మేనేజర్ కూడా ఎంప్లాయే కదా. అతనికి కూడా ఇవ్వాలి అని ఇందిరాదేవి అంటుంది. దాంతో రాజ్‌కు కావ్య బోనస్ ఇస్తుంది. ఇదేంటీ, ఇదెక్కడ చూడలేదు. ఇంతకంటే అవమానం చూడలేదు. రాజ్ ఇంటి వారసుడు. రాజ్‌కు బోనస్ ఇవ్వడం ఏంటీ అని రుద్రాణి అంటుంది. ఇందులో అవమానం ఏముంది. మేనేజర్‌కు బోనస్ ఇవ్వకపోతే ఎలా అని సుభాష్ అంటాడు.
కరెక్టే డాడ్. సీఈఓ కూడా ఎంప్లాయ్‌లో ఒకరే కదా. ఎంప్లాయ్‌కు బోనస్ ఇవ్వకపోతే బాగుండదు కదా. అందుకని సీఈఓ గారికి ఛైర్మన్ గారి మనవడిగా, నా చేతులమీదుగా నేనే బోనస్ ఇస్తాను అని తనకు ఇచ్చిన బోనస్‌పైనే కావ్య పేరు రాసి ఇస్తాడు రాజ్. ఇలా కావ్య బోనస్‌ను తిప్పికొడతాడు రాజ్. స్వీట్స్ బాక్స్ తీసుకో.. దీపావళి గిఫ్ట్ అని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు. నా మనవడు ఎక్కడ తగ్గలేదు చిట్టి అని సీతారామయ్య అంటే.. అన్ని నీ బుద్ధులే అని ఇందిరాదేవి అంటుంది.
వెర్రిదానివి అయ్యావ్
మరోవైపు అనామికకు కాల్ చేసి పెట్టాల్సిన బాంబ్ గురించి అడుగుతుంది రుద్రాణి. రెండు పిశాచాలు ఫ్రీ అవుట్ గోయింగ్ ఫోన్‌లో పిచ్చాపాటి మాడ్లాడుకుంటున్నట్లు ఉందని అనామిక అంటుంది. ఎప్పుడు టెలీకాస్ట్ చేస్తున్నావ్ అని రుద్రాణి అంటే.. ఎప్పుడు చేయాలో నాకు తెలుసు అని అనామిక అంటుంది. ఈ బిల్డప్‌లకు తక్కువలేదు. వేలంపాటలో వెర్రిదానివి అయ్యావ్. అలా మరోసారి కాకుండా చూసుకో అని రుద్రాణి కాల్ కట్ చేస్తుంది. దాంతో కోపంగా చూస్తుంది అనామిక.
తినడం అయిందిగా ఇక వెళ్లు అని రాజ్ అంటాడు. నేను మీ నెత్తిమీద కూర్చున్నానా అని కావ్య అంటుంది. నీకు ఇచ్చింది సీఈఓ పదవి. ఇలా ఎవరు పిలిస్తే వచ్చి కూర్చోని తినరు. బిజీగా ఉన్నామని వెళ్లిపోతారు అని సీఈఓ గురించి అటు తిరిగి గొప్పగా చెబుతాడు రాజ్. కానీ, తీరా చూస్తే అక్కడ కావ్య ఉండదు. ఇదెక్కడికిపోయింది. నిజంగానే హర్ట్ అయి వెళ్లిపోయిందా ఏంటీ అని రాజ్ అనుకుని ఇల్లు మొత్తం చూస్తాడు రాజ్.
ఎవరి కోసం నాన్న అని ఇందిరాదేవి అడిగితే.. అది క అని చెప్పబోయి ఆగిపోతాడు రాజ్. కళావతి కోసమా అని అపర్ణ అంటే.. రాజ్ కవర్ చేస్తాడు. దాంతో అపర్ణ వాళ్లు రాజ్‌ను ఏడిపిస్తారు. సీఈఓ అని చెప్పుకునేవాడివి కావ్యతో పెట్టుకుని ఇప్పుడు మేనేజర్ అని చెప్పుకుంటున్నావ్. అందుకే ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి అని ఇందిరాదేవి అంటుంది. దాంతో వాళ్లపై అరిచి వెళ్లగొడతాడు రాజ్. కావ్య కోసం చూస్తుండగా కావ్య సడెన్‌గా పక్కనే కనిపిస్తుంది.
రొమాంటిక్‌గగా రాజ్ కావ్య
దాంతో పడిపోతాడు రాజ్. అప్పుడే రాజ్‌ను కావ్య పట్టుకుంటుంది. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. నేనేమైనా హీరోనా.. మీ నడుము పట్టుకుని ఇలాగే ఉండటానికి. నడుము పట్టేసేలా ఉంది లేవండి అని కావ్య అంటుంది. దాంతో రాజ్ నిల్చుంటాడు. తర్వాత ఇద్దరు వాదించుకుంటారు. తర్వాత కావ్య వెళ్తాను అని ఇందిరాదేవి వాళ్లతో చెబుతుంది. ఆటోలో వెళ్తుంది. లేకుంటే రాహుకాలం వచ్చేస్తుంది అని రాజ్ అంటాడు. రాహువు గురించి రాహువే చెబుతున్నాడు. కాసేపు ఉండు అని ఇందిరాదేవి అంటుంది.
ఇంకెందుకు ఉండటం అని రాజ్ అంటే.. ఇంకాసేపు ఉంటే మీ మనవడే గెంటేసేలా ఉన్నారని కావ్య అంటుంది. ఎవరు ఈ మేనేజర్ గాడా. సీఈఓనే గెంటేసే అంతా గొప్పోడు అయిపోయాడా. ఎక్కువ మాట్లాడితే ఆ మేనేజర్ గిరి పీకి పారేసి తోటమాలి పని చెబుతాను అని సీతారామయ్య అంటాడు. తోటమాలి రోజు రావట్లేదు అని ప్రకాశం అంటే.. సెక్యూరిటీ గార్డ్ కూడా నైట్ టైమ్ సరిగా డ్యూటీ చేయట్లేదు. అది కూడా ఇవ్వొచ్చు అని అపర్ణ అంటాడు.
ఇంట్లో ఇన్ని పోస్టులు ఉన్నాయా. ఇప్పటికే ప్యూన్ కూడా సరిగా చూడట్లేదు అని రాజ్ అంటాడు. అందుకే నీకు సంబంధం లేని విషయాల్లో దూరిపోకు అని సీతారామయ్య అంటాడు. తర్వాత ముగ్గురు ఇంటి కోడళ్లకు బహుమతులు ఇవ్వాలని అందరిని లైన్‌లో నిల్చోబెడతారు. ఒక్కొక్కరికి ఓ బాక్స్ ఇస్తారు. ఇది మాకా అని రాహుల్ అంటాడు. అది హారం. కావాలంటే వేసుకో అని ఇందిరాదేవి అంటుంది. ఇది నాకొద్దు. నేను వేయను. సీఈఓకు మేనేజర్ నెక్లెస్ వేయను. ఇంటి నుంచి వెళ్లిపోయినవాళ్లు ఇంటి కోడలు కాదు అని రాజ్ తిరిగి ఇచ్చి వెళ్లిపోతుంటాడు.
పులి భయపడదు
ఏవండి.. ఇటు రండి అని పక్కకు తీసుకెళ్తుంది కావ్య. నువ్ ఎంత చెప్పిన ఆ హారం వేయను అని రాజ్ అంటాడు. తర్వాత ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోవడం గురించి వాదించుకుంటారు. నాకు మీ సీక్రెట్స్ అన్ని తెలుసు కాబట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటున్నాను అని కావ్య అంటుంది. దాంతో నవ్విన రాజ్ పులికి సీక్రెట్స్ ఉండవు. ఎవరికి భయపడదు అని రాజ్ అంటాడు. పులి కాక్రోచ్‌కు భయపడుతుంది కదా. బొద్దింకకు భయపడి చంకనెక్కుతారు కదా అని కావ్య అంటుంది.
అలా చెబితే ఎవరు నమ్మరు అని రాజ్ అంటే.. నా దగ్గర సాక్ష్యం ఉందిగా అని వీడియో చూపిస్తుంది కావ్య. దాంతో రాజ్ షాక్ అవుతాడు. తర్వాత ఇంట్లో అంతా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ బాణాసంచా కాలుస్తుంటారు. అనంతరం బయట ఏం బాంబ్‌లు పేలుస్తారు కానీ.. ఇంట్లో టీవీలో పెద్ద బాంబ్ పేలుతుంది అని టీవీ ఆన్ చేస్తుంది రుద్రాణి. దాంతో కల్యాణ్ ఆటో నడపడం చూపిస్తారు. అది చూసి అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.