మొబైల్ మేకర్ Vivo కొన్ని రోజుల క్రితం ఇండోనేషయన్ మార్కెట్లో లాంచ్ చేసిన తమ Vivo Y35 స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్లోనూ విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి Y-సిరీస్‌లో విడుదలైన మధ్య-శ్రేణి ఫోన్. ఇది ఏకైక స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.
భారత మార్కెట్లో సరికొత్త Vivo Y35 స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 18,499/- గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా సెప్టెంబర్ 30, 2022 లోపు ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు వివో కంపెనీ క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ICICI బ్యాంక్, SBI, Kotak అలాగే OneCardని ఉపయోగించి చేసే ప్రతీ Vivo Y35 కొనుగోలుపై రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఆసక్తి కలవారు వివో ఇండియా ఇ-స్టోర్‌లో, అలాగే ఇతర రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
మరి రూ. 18 వేల ధరకు ఈ ఫోన్ కొనుగోలు చేయడం బెటర్ ఆప్షన్ అవుతుందా? ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి ఇక్కడ చెక్ చేయండి.
మరిన్ని అంశాలను పరిశీలిస్తే ఈ ఫోన్ ఫ్రాస్టెడ్ యాంటీ గ్లేర్ (AG) కోటింగ్‌తో వస్తుంది, ఇది సాఫ్ట్ సున్నితమైన టచ్‌ని అందిస్తుంది. గీతలు, వేలిముద్రలు పడకుండా నిరోధకతను కలిగిఉంటుంది. ఇది ఫేస్ వేక్ ఫీచర్‌తో , సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకు విస్తరించుకోవచ్చు. ర్యామ్ కూడా పెంచుకోవచ్చు. ఫీచర్ల పరంగా ఈ ఫోన్ Realme 9 5G, Xiaomi Redmi Note 11 Pro, Vivo T1 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. అయితే Vivo Y35 ఫోన్ 5Gకి సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ ధరలో మరిన్ని మంచి మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం