Vivo Y16 । ఒకే డిజైన్‌తో మరొక స్మార్ట్‌ఫోన్, మరి ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!
వివో నుంచి మరొక Y సిరీస్ ఫోన్ Vivo Y16 విడుదలైంది. ఇది బడ్జెట్ ధరలో లభించే 4G స్మార్ట్‌ఫోన్. దీని ఫీచర్లు, ఇతర విశేషాలు తెలుసుకోండి.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తమ Y-సిరీస్‌లో వరుసగా కొత్త మోడళ్లను విడుదల చూస్తూ దూకుడు మీద ఉంది. అయితే వివిధ పేర్లతో ఈ ఫోన్లు విడుదలవుతున్నప్పటికీ కొన్నింటిలో డిజైన్ పరంగా, మరికొన్నింటిలో ఫీచర్స్ పరంగా ఒకే రకమైన అంశాలను కలిగి ఉండటం గమనార్హం. దాదాపు ఒకే రకమైన డిజైన్, ఫీచర్లను కలిగిన ఫోన్‌ను మరొక మార్కెట్లో మరొక పేరుతో విడుదల చేస్తూ వివో తన మార్కెట్ పెంచుకుంటోంది.
వివో బ్రాండ్ నుంచి తాజాగా Vivo Y16 పేరుతో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ హాంకాంగ్‌లో విడుదలైంది. ఈ Vivo Y16 స్మార్ట్‌ఫోన్ అచ్ఛంగా ఇటీవలే లాంచ్ అయిన Vivo Y35కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. వంపు తిరిగిన మూలలతో ఫ్లాట్ ఫ్రేమ్, వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ అలాగే ఉన్నాయి. అయితే ఇందులో ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.
సరికొత్త Vivo Y16 బడ్జెట్ ధరలో లభించే ఒక 4G స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఏకైక స్టోరేజ్ కాన్ఫిగరేషన్లో వచ్చింది. అయితే ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాలను అదనంగా విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి మొదలైన వివరాలు ఈ కింద చెక్ చేయండి.
Vivo Y16 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
- 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్
- వెనకవైపు 13MP+2MP కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
ఇది స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. త్వరలో భారత మార్కెట్లోను విడుదల కావొచ్చని భావిస్తున్నారు. అయితే ఫీచర్లను బట్టి చూస్తే ఈ ఫోన్ రూ. 10 లోపు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.
సంబంధిత కథనం