Vivo Y35 । తమ Yసిరీస్‌ను మరింత విస్తరిస్తున్న వివో, కొత్తగా మరొక స్మార్ట్‌ఫోన్!
మొబైల్ తయారీదారు Vivo తమ Y-సిరీస్‌ను ఇంకా విస్తరిస్తోంది. ఈ ఏడాదంతా ఎక్కువగా ఇదే సిరీస్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది. కొత్తగా ఈ సిరీస్ నుంచి Vivo Y35 అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకోంది.
పాపులర్ చైనీస్ మొబైల్ తయారీదారు Vivo తమ బ్రాండ్ నుంచి Y-సిరీస్‌లో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇప్పుడు Vivo Y35 పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. మిడ్- బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా Vivo Y35ను నిశబ్దంగా ఇండోనేషియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో వస్తుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
Vivo Y35లో దృఢమైన 5000mAh బ్యాటరీ, మెరుగైన ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కలిగిన ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. అయితే ఇందులో అల్ట్రావైడ్ కెమెరా ఉండదు.
సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వచ్చిన ఈ ఫోన్ అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. Vivo ఈ ఫోన్‌ను ఈ ఏడాది చివర్లో భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఈ కింద గమనించండి.
Vivo Y35 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
- 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+2MP+2MP కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఛార్జర్
ప్రస్తుతం ఇండోనేషియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర IDR 33,99,000/- గా ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 18,500/-.
ఇప్పటికే BIS సర్టిఫికేషన్ పొందినందున అతి త్వరలో ఇది భారతీయ మార్కెట్లోనూ అందుబాటులోకి వస్తుంది. అయితే ఇక్కడ ధర ఇంకా తక్కువగానే ఉండవచ్చునని అంచనా.
సంబంధిత కథనం