వావ్ అనిపించే pOLED డిస్‌ప్లే ఫీచర్‌తో Moto G52 స్మార్ట్‌ఫోన్ లాంచ్!
మోటోరోలా నుంచి Moto G52 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది. దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి..
మోటోరోలా కంపెనీ G-సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Moto G52 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉండటంతో పాటు సరసమైన ధరలోనే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను pOLED డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. దృశ్యం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్‌లో Moto G52 స్మార్ట్‌ఫోన్ అత్యంత సన్నని, సొగసైన డిజైన్ కలిగింది, ఎంతో తేలికైనది అని కంపెనీ పేర్కొంది. ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
ఈ సరికొత్త Moto G52లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Moto G52 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.61 అంగుళాల pOLED FHD+ డిస్‌ప్లే
- 4GB/6GB RAM, 64GB/ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
- వెనకవైపు 50 మెగా పిక్సెల్ + 8MP + 2MP క్వాడ్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్
4GB RAM +64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499/-
రెండవ వేరియంట్ 6GB RAM+128GB స్టోరేజ్ ధర రూ.16,499/-
Moto G52 పోర్సిలైన్ వైట్, చార్‌కోల్ గ్రే అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తోంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మే 3 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం