Realme Narzo N55 launch: రియల్‍మీ నార్జో ఎన్55 లాంచ్ నేడే.. ఆకర్షణీయమైన డిజైన్‍తో!-realme narzo n55 will launch today check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Narzo N55 Launch: రియల్‍మీ నార్జో ఎన్55 లాంచ్ నేడే.. ఆకర్షణీయమైన డిజైన్‍తో!

Realme Narzo N55 launch: రియల్‍మీ నార్జో ఎన్55 లాంచ్ నేడే.. ఆకర్షణీయమైన డిజైన్‍తో!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 12, 2023 06:00 AM IST

Realme Narzo N55 launch: రియల్‍మీ నార్జో ఎన్55 మొబైల్ నేడు (ఏప్రిల్ 12) విడుదల కానుంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్‍తో అడుగుపెట్టనుంది.

Realme Narzo N55 launch: రియల్‍మీ నార్జో ఎన్55 లాంచ్ నేడే.. (Photo: Realme)
Realme Narzo N55 launch: రియల్‍మీ నార్జో ఎన్55 లాంచ్ నేడే.. (Photo: Realme)

Realme Narzo N55 launch: రియల్‍మీ నార్జో లైనప్‍లో కొత్త సీరిస్ వచ్చేస్తోంది. రియల్‍మీ నార్జో ఎన్55 ఫోన్‍ను నేడు (ఏప్రిల్ 12) రియల్‍మీ లాంచ్ చేయనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో టీజర్లు, ఫొటోల ద్వారా ఈ 4జీ మొబైల్‍కు సంబంధించిన కొన్ని వివరాలను రియల్‍మీ వెల్లడించింది. ముఖ్యంగా డిజైన్‍ను రియల్‍మీ హైలైట్ చేస్తోంది. నార్జో ఎన్55 మొబైల్ స్లిమ్‍గా, ఆకర్షణీయంగా ఉంటుందని టీజ్ చేస్తోంది. కాగా, ఈ ఫోన్ లాంచ్ టైమ్, ఇప్పటి వరకు బయటికి వచ్చిన వివరాలు, అంచనా ధర ఎలా ఉందో ఇక్కడ చూడండి.

రియల్‍మీ నార్జో ఎన్55 లాంచ్ వివరాలు

Realme Narzo N55 launch: రియల్‍మీ నార్జో ఎన్55 మొబైల్ నేటి (ఏప్రిల్ 12) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. సీ55 లాంచ్ చేసిన రెండు వారాలకే ఈ ఫోన్‍ను రియల్‍మీ తీసుకొస్తోంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్‍కు సంబంధించిన కొన్ని వివరాలు బయటికి వచ్చాయి.

Realme Narzo N55 launch: బడ్జెట్ సెగ్మెంట్‍లో థిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్‍గా నార్జో ఎన్55 మొబైల్‍ను తీసుకొస్తున్నట్టు రియల్‍మీ వెల్లడించింది. సీ యాంగిల్ డిజైన్‍ ఉండడం వల్ల మొబైల్‍ను చేతిలో పట్టుకోవడం చాలా కంఫర్ట్‌గా ఉంటుందని, గ్లిటర్ టెక్చర్‌తో ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఉంటుందని వెల్లడించింది.

Realme Narzo N55 launch: 6.72 ఇంచుల ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో రియల్‍మీ నార్జో ఎన్55 వస్తుంది తెలుస్తోంది. ఈ మొబైల్‍లో మీడియాటెక్ హీలియో జీ88 4జీ ప్రాసెసర్ ఉండనుంది. వెనుక రెండు కెమెరాల సెటప్‍తో ఈ ఫోన్ రానుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉండనున్నాయి. 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రావొచ్చు.

రియల్‍మీ సీ55 ఫోన్ లాగే.. ఈ నార్జో ఎన్55 కూడా మినీ క్యాప్సుల్ ఫీచర్‌ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మొబైళ్లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్ లాగానే ఈ మినీ క్యాప్సుల్ ఉంటుంది. ఇక ఈ నార్జో ఎన్55 ఫోన్‍ 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 5,000mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇక డ్యుయల్ సిమ్ 4జీకి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

Realme Narzo N55 Price: రియల్‍మీ నార్జో సీ55 మొబైల్ ప్రారంభ ధర రూ.15వేలలోపే ఉండనుంది. ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర రూ.12వేల దరిదాపుల్లో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మూడు వేరియంట్లలో అందుబాటులోకి రావొచ్చు. ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ రానుంది. నేడు (ఏప్రిల్ 12) లాంచ్ ఈవెంట్‍లో రియల్‍మీ నార్జో ఎన్55కు సంబంధించిన అధికారిక ధర, స్పెసిఫికేషన్లు, సేల్ సహా అన్ని వివరాలను రియల్‍మీ వెల్లడించనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం