Digital detox: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారా? ఇలా ఆ వ్యసనానికి దూరం అవ్వండి..-do you need a digital detox here are a few tips to follow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Digital Detox: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారా? ఇలా ఆ వ్యసనానికి దూరం అవ్వండి..

Digital detox: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారా? ఇలా ఆ వ్యసనానికి దూరం అవ్వండి..

May 17, 2024, 09:15 PM IST HT Telugu Desk
May 17, 2024, 09:14 PM , IST

స్మార్ట్ ఫోన్ నిత్యావసరమైంది. ఒకప్పుడు కమ్యూనికేషన్ సాధనంగా మాత్రమే ఉన్న ఫోన్ ఇప్పుడు అల్ ఇన్ వన్ గా మారింది. సోషల్ మీడియా విస్తృతితో ఫోన్ తో గడిపే సమయం కూడా చాలా ఎక్కువైంది. ఇది మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అందువల్ల, ఫోన్ పై ఎక్కువ సమయం గడపకుండా డిజిటల్ డీటాక్స్ చేసుకోవడం అవసరం.

సోషల్ మీడియా అప్డేట్స్ స్క్రోల్ చేయడం, గంటల తరబడి రీల్స్ చూడటం, నోటిఫికేషన్లను తక్షణమే చెక్ చేయడం, ఎల్లప్పుడూ ఫోన్లో ఉండటం మనకు డోపామైన్ రష్ ఇస్తుంది, కానీ ఇది కూడా ఒకరకమైన వ్యసనం వంటిదే. డిజిటల్ వ్యసనాన్ని ఎదుర్కోవటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి కొంతకాలం డిజిటల్ డిటాక్స్ కావడం. మీ డిజిటల్ డిటాక్స్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి థెరపిస్ట్ రెబెకా బల్లాగ్ పంచుకున్న కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

(1 / 6)

సోషల్ మీడియా అప్డేట్స్ స్క్రోల్ చేయడం, గంటల తరబడి రీల్స్ చూడటం, నోటిఫికేషన్లను తక్షణమే చెక్ చేయడం, ఎల్లప్పుడూ ఫోన్లో ఉండటం మనకు డోపామైన్ రష్ ఇస్తుంది, కానీ ఇది కూడా ఒకరకమైన వ్యసనం వంటిదే. డిజిటల్ వ్యసనాన్ని ఎదుర్కోవటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి కొంతకాలం డిజిటల్ డిటాక్స్ కావడం. మీ డిజిటల్ డిటాక్స్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి థెరపిస్ట్ రెబెకా బల్లాగ్ పంచుకున్న కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.(Flickr)

హోమ్ స్క్రీన్ పై సోషల్ మీడియా యాప్స్ ఉండటం వల్ల మనకు మరింత యాక్సెస్ లభిస్తుంది. వాటిని హోం స్క్రీన్ నుంచి వేరే ఒక ఫోల్డర్ కు, మరొక స్క్రీన్ కు మార్చండి. తద్వారా ఫోన్ ఓపెన్ చేయగానే ఆ సోషల్ మీడియా యాప్స్ కనిపించి, మిమ్మల్ని టెంప్ట్ చేయవు.  

(2 / 6)

హోమ్ స్క్రీన్ పై సోషల్ మీడియా యాప్స్ ఉండటం వల్ల మనకు మరింత యాక్సెస్ లభిస్తుంది. వాటిని హోం స్క్రీన్ నుంచి వేరే ఒక ఫోల్డర్ కు, మరొక స్క్రీన్ కు మార్చండి. తద్వారా ఫోన్ ఓపెన్ చేయగానే ఆ సోషల్ మీడియా యాప్స్ కనిపించి, మిమ్మల్ని టెంప్ట్ చేయవు.  (Shutterstock)

సోషల్ మీడియా యాప్స్ ను, ఫోన్ ను ఎంత సమయం ఉపయోగించాలో నిర్ణయించుకోండి. ఆ మేరకు టైమర్లను సెట్ చేసుకోండి. అందుకు వీలు కల్పించే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోండి. ఆ టైమర్లకు మనం కట్టుబడి ఉండాలి.

(3 / 6)

సోషల్ మీడియా యాప్స్ ను, ఫోన్ ను ఎంత సమయం ఉపయోగించాలో నిర్ణయించుకోండి. ఆ మేరకు టైమర్లను సెట్ చేసుకోండి. అందుకు వీలు కల్పించే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోండి. ఆ టైమర్లకు మనం కట్టుబడి ఉండాలి.(iStock)

అవసరం లేని యాప్స్ ను, సమయాన్ని వ్యర్థం చేసే యాప్స్ ను డిలీట్ చేయడం డిజిటల్ డిటాక్స్ కు అత్యంత ఎక్కువగా ఉపయోగపడే టిప్.

(4 / 6)

అవసరం లేని యాప్స్ ను, సమయాన్ని వ్యర్థం చేసే యాప్స్ ను డిలీట్ చేయడం డిజిటల్ డిటాక్స్ కు అత్యంత ఎక్కువగా ఉపయోగపడే టిప్.

ఇంట్లో ఫోన్-ఫ్రీ జోన్స్ ను లేదా ఫోన్-ఫ్రీ టైమింగ్స్ ను ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఫోన్ ను విడిచి ఉండడానికి, మన కుటుంబంతో మరింత కనెక్ట్ కావడానికి ఎక్కువ వీలు లభిస్తుంది.

(5 / 6)

ఇంట్లో ఫోన్-ఫ్రీ జోన్స్ ను లేదా ఫోన్-ఫ్రీ టైమింగ్స్ ను ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఫోన్ ను విడిచి ఉండడానికి, మన కుటుంబంతో మరింత కనెక్ట్ కావడానికి ఎక్కువ వీలు లభిస్తుంది.(Getty images)

ఫోన్ వల్ల ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఏకాగ్రతతో వర్క్ చేస్తున్నప్పుడో, విద్యార్థులైతే చదువుకుంటున్నప్పుడో ఫోన్ పక్కనే ఉంటే, ఫోన్ ను చూడడానికి టెంప్ట్ అయ్యే అవకాశముంది. అందువల్ల అలాంటి సమయాల్లో ఫోన్ ను సైలంట్ లో పెట్టి, దూరంగా, వీలైతే, వేరే రూమ్ లో పెట్టడం మంచిది.

(6 / 6)

ఫోన్ వల్ల ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఏకాగ్రతతో వర్క్ చేస్తున్నప్పుడో, విద్యార్థులైతే చదువుకుంటున్నప్పుడో ఫోన్ పక్కనే ఉంటే, ఫోన్ ను చూడడానికి టెంప్ట్ అయ్యే అవకాశముంది. అందువల్ల అలాంటి సమయాల్లో ఫోన్ ను సైలంట్ లో పెట్టి, దూరంగా, వీలైతే, వేరే రూమ్ లో పెట్టడం మంచిది.(istock, shutterstock; for representational purpose only)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు