vivo Phone Discount : వివో ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈ బెస్ట్ కెమెరా ఫోన్ మీద మంచి డిస్కౌంట్!
vivo T3 Pro 5G : వివో టీ3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం. ఎందుకంటే ఈ ఫోన్ డిస్కౌంత్‌తో లభిస్తుంది. ఆ వివరాలేంటో ఓసారి చూసేయండి.
వివో కంపెనీ ఫోన్ కొనేందుకు ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్ నడుస్తోంది. బిగ్ బచత్ డేస్ సేల్‌లో భాగంగా డిస్కౌండ్ పొందవచ్చు. ఈ ప్రత్యేక సేల్‌లో కొన్ని ఎంపిక చేసిన ఫోన్‌లపై భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లను ఆకర్షించేందుకు అన్ని కంపెనీల మొబైల్స్ కూడా భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి వివో టీ3 ప్రో 5జీ. ఈ ఫోన్ తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఉంది.
వివో టీ3 ప్రో 5జీ మొబైల్ ఫోన్ ఈ కామర్స్ సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 16 శాతం ప్రత్యక్ష తగ్గింపుతో వస్తుంది. ఈ మొబైల్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. నిజానికి ఈ ఫోన్ అసలు ధర రూ.29999. కానీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఇతర ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లు కూడా కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ప్లస్, 128జీబీ, 8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు 5500mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్‌లో ఎలాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయో చూద్దాం..
వివో టీ3 ప్రో 5జీ ఫోన్ 2400×1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల 3D కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కూడా కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది.
వివో టీ3 ప్రో 5జీ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దాని మొదటి కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్ కెపాసిటీలో ఉంది. ఈ ఫోన్ సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. దీని సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఉంటుంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కూడా పొందుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-C, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ను తక్కువ ధరలో కొనాలి అనుకుంటే ఇప్పుడే సరైన సమయం.
గమనిక : స్మార్ట్‌ఫోన్ల డిస్కౌంట్ ఆఫర్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న ఆఫర్ ఆధారంగా కథనం ఇచ్చాం. భవిష్యత్తులో మార్పులు ఉండవచ్చు. పైన ఇచ్చిన కంటెంట్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.