Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పక్కాగా ఉండాల్సిన విషయాలు!-know these factors should be considered while buying health insurance policy details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పక్కాగా ఉండాల్సిన విషయాలు!

Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పక్కాగా ఉండాల్సిన విషయాలు!

Anand Sai HT Telugu
Dec 02, 2024 02:00 PM IST

Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గమనించాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఆసుపత్రుల ఖర్చులను భరించడం కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య బీమా మీకు సాయపడుతుంది.

హెల్త్​ ఇన్సూరెన్స్
హెల్త్​ ఇన్సూరెన్స్

ఆరోగ్య బీమా అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆధునిక యుగంలో ఏ రోగం ఎప్పుడైనా రావచ్చు. అలాంటి సమయంలో డబ్బులు చాలా మెుత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య బీమా ఉంటే ఇలాంటి పరిస్థితులను సులభంగా ఎదుర్కోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను అనుసరించాలి.

భారతదేశంలో వైద్య ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ఖర్చులు ఏటా 10 శాతం ఎక్కువ అవుతున్నాయి. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వైద్య బీమా పాలసీని కలిగి ఉండటం చాలా అవసరం. కానీ మనం బీమా పాలసీ కోసం సెర్చ్ చేసినప్పుడు పాలసీలో అందించే ప్రయోజనాలు, ఏది ఎంచుకోవాలి అనే విషయంలో గందరగోళం మొదలవుతుంది. ఈ సమయంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

వైద్య ఖర్చులు ఏటా 10-12 శాతం పెరుగుతున్నాయి. అందువల్ల నేటి పాలసీ పెరుగుతున్న ఖర్చులను కవర్ చేయదు. ద్రవ్యోల్బణం, ఊహించని వైద్య అత్యవసర పరిస్థితుల నుండి మమ్మల్ని రక్షించడానికి కనీసం 10-15 లక్షల రూపాయల విలువ చేసే బీమా చేయించుకోవాలి. ఎల్లప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కూడా కొంత మెయింటెన్ చేయాలి.

టాప్-అప్ ప్లాన్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్‌లను చూడండి. నిర్దిష్ట పరిమితి తర్వాత ఆసుపత్రి ఖర్చులను కవర్ చేయడం ద్వారా మీ ప్రాథమిక పాలసీని భర్తీ చేస్తుంది. ప్రీమియం పెంచకుండానే మీ కుటుంబ ఆరోగ్య కవరేజీని పెంచడానికి ఇది ఒక మార్గం.

ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ముందుగా ఉన్న వ్యాధులను సరిగ్గా పేర్కొనాలి. ఈ విధంగా మీకు ఏది అవసరమో తెలుస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితులను బహిర్గతం చేయకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. మీరు సమర్పించిన వివరాలన్నీ సరైనవని నిర్ధారించుకోవడానికి మీ దరఖాస్తును జాగ్రత్తగా చదవాలి. మీ అప్లికేషన్‌లో ఎన్ని అంశాలు కవర్ అయ్యాయో చూసుకోవాలి.

సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపులు దీనికి బోనస్. కానీ పన్ను ఆదాను పెంచుకునే బదులు కుటుంబానికి సేఫ్టీగా ఉండే ఇన్సూరెన్స్‌లు తీసుకోవాలి.

ఏదైనా ఆరోగ్య బీమా ప్లాన్‌ని కొనుగోలు చేసే సమయంలో సంబంధిత పత్రాలు చాలా అవసరం. ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు వయస్సు రుజువును సమర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా పాలసీలకు నిర్దిష్ట ప్రవేశ వయస్సు ఉంటుంది. ఎంచుకున్న ఆరోగ్య బీమా పాలసీ కింద బీమా చేయాల్సిన సభ్యులందరి వయస్సుకు సంబంధించిన రుజువును కూడా మీరు అందించాలి.

దరఖాస్తుదారుడి వయస్సు రుజువు కోసం మీరు కింది పత్రాలలో దేనినైనా సమర్పించవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, 10వ లేదా 12వ మార్కుల షీట్ ఇవ్వవచ్చు.

ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంచుకున్న ఆరోగ్య బీమా కంపెనీ మీ పోస్టల్ చిరునామాకు వివిధ పత్రాలను పంపుతుంది. చిరునామా చాలా ముఖ్యమైనది. బీమాదారు రికార్డుల కోసం దరఖాస్తుదారు, బీమా స్కీమ్ సభ్యుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు కూడా అవసరం. కొన్ని బీమా సంస్థలు దరఖాస్తుదారులు, సభ్యులను మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారు. అవి కూడా ముఖ్యమైనవి.

Whats_app_banner

సంబంధిత కథనం