South Central Railway : రైల్వే స్టేషన్లలో.. విమానాశ్రయాల మాదిరిగా.. రూ.100 కోట్లతో నిర్మాణ పనులు-construction of footbridge at railway stations like at airports ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  South Central Railway : రైల్వే స్టేషన్లలో.. విమానాశ్రయాల మాదిరిగా.. రూ.100 కోట్లతో నిర్మాణ పనులు

South Central Railway : రైల్వే స్టేషన్లలో.. విమానాశ్రయాల మాదిరిగా.. రూ.100 కోట్లతో నిర్మాణ పనులు

Published Dec 02, 2024 01:48 PM IST Basani Shiva Kumar
Published Dec 02, 2024 01:48 PM IST

  • South Central Railway : రైల్వే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు.. సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపట్టింది. గుంటూరు రైల్వేస్టేషన్‌ సహా డివిజన్‌ పరిధిలోని పలు స్టేషన్లలో మెరుగైన సదుపాయాల కల్పనపై రైల్వే అధికారులు ఫోకస్ పెట్టారు. రూ.100 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు.

గుంటూరు రైల్వేస్టేషన్‌, డివిజన్‌ పరిధిలోని పలు స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పనపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం తయారు చేసిన డీపీఆర్‌లకు ఆమోదం లభించింది. దీంతో రూ. 100 కోట్లతో ఫుట్ బ్రిడ్జ్‌లు నిర్మించనున్నారు. 

(1 / 5)

(istockphoto)

ఇప్పటివరకు రైల్వే స్టేషన్లలో మూడు, ఆరు మీటర్ల వెడల్పుతో ఫుట్ బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నారు. కానీ.. భవిష్యత్తులో పెరగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 12 మీటర్ల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

(2 / 5)

విమానాశ్రయాల్లో అందించే సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఈ ఫుట్ బ్రిడ్జ్‌లను ఉపయోగించనున్నారు. వీటిని చాలా వెడల్పుగా నిర్మిస్తున్నందునా.. మాల్స్‌‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రయాణికులు ఒకసారి స్టేషన్లోకి వచ్చాక.. ఏ అవసరం వచ్చినా బయటకు వెళ్లక్కర్లేకుండానే అందుబాటులోకి తెస్తున్నారు.

(3 / 5)

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో గుంటూరు, రేపల్లె, నరసరావుపేట, పిడుగురాళ్ల, మార్కాపురం, దొనకొండ, నంద్యాల, నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 

(4 / 5)

వీటి నిర్మాణాల కోసం స్థలాల ఎంపిక పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు