తెలుగు న్యూస్ / ఫోటో /
Filmfare OTT Awards: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024లో తళుక్కుమన్న సెలబ్రిటీలు.. లైగర్ బ్యూటి నుంచి తమన్నా లవర్ వరకు!
Filmfare OTT Awards 2024 Celebrities: ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024లో బాలీవుడ్ సెలబ్రిటీలు అనన్య పాండే, సోనాక్షి సిన్హా, అలయా ఎఫ్, తమన్నా లవర్ విజయ్ వర్మ పాల్గొన్నారు. స్టైలిష్ దుస్తుల్లో ఫిల్మ్‌ఫేర్ రెడ్ కార్పెట్‌తో ఎంతో అందంగా ఆకట్టుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం.
(1 / 10)
ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024 5వ ఎడిషన్‌లో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కరీనా కపూర్, అనన్య పాండే, వేదంగ్ రైనా, అలయా ఎఫ్, సోనాక్షి సిన్హా, రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా, హ్యూమా ఖురేషి తదితరులు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఎవరెవరు ఏం ధరించారో ఓ లుక్కేద్దాం.
(2 / 10)
తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్డ్ ప్యాంట్ సూట్, బ్లాక్ షర్ట్, పింక్ ప్రింటెడ్ టై ధరించాడు. అతని మెరిసే జుట్టు, క్లీన్ షేవ్ లుక్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
(3 / 10)
రెడ్ కార్పెట్‌పై నలుపు రంగు ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ అలయా ఎఫ్.
(4 / 10)
లైగర్ బ్యూటి అనన్య పాండే అద్భుతమైన గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన గౌనులో మెరిసింది, స్లీవ్‌లెస్ డ్రెస్‌లో అందమైన నెక్లైన్‌తో సిల్వర్ షిమ్మర్ డిటైలింగ్, ఫిగర్-హగ్గింగ్ బాడీకాన్ ఫిట్‌తో హాట్‌గా దర్శనం ఇచ్చింది అనన్య పాండే.
(5 / 10)
సోనాక్షి సిన్హా బ్లాక్ టాప్‌లో బోల్డ్ పవర్ షోల్డర్స్, టై-ఆన్ డిటైలింగ్‌తో పవర్ డ్రస్సింగ్ చేసింది. దానికి సరిపోయే పెన్సిల్ స్కర్ట్‌తో జత చేసి తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతో స్టైలిష్‌గా ప్రదర్శించింది.
(6 / 10)
గోధుమ రంగు చారల బ్లేజర్ ధరించి, తెల్లటి చొక్కా, పసుపు రంగు టై, లేత గోధుమ రంగు ప్యాంట్‌తో షార్ప్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు బాలీవుడ్ పాపులర్ యాక్టర్ రాజ్ కుమార్ రావు.
(7 / 10)
అలియా భట్ జిగ్రా మూవీలో నటించిన యాక్టర్ వేదాంగ్ రైనా బ్లాక్ బ్లేజర్, వెయిస్ట్ కోట్‌కు పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసిన ప్యాంట్ ధరించి సాఫ్ట్ బాయ్ వైబ్‌ను మెయింటైన్ చేశాడు.
(8 / 10)
ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024లో దంగల్ బ్యూటి సన్యా మల్హోత్రా ఫుల్ స్లీవ్స్, శాటిన్ బ్లాక్ బ్లేజర్‌లో ఆకర్షణగా కనిపించింది. దానికి సరిపోయే ప్యాంటు, క్లచ్ బ్యాగ్ జత చేసి అందాలు ఆరబోసింది.
(9 / 10)
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి గోల్డ్ కలర్ గౌనులో హాట్‌గా దర్శనం ఇచ్చింది. కార్సెట్ బాడీ, బోల్డ్ థైస్ సైడ్ స్లిట్ టైప్ డ్రెస్సులో ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024 రెడ్ కార్పెట్‌పై గ్లామర్ జోడించింది.
ఇతర గ్యాలరీలు