Pushpa 2 Advance Booking: అడ్వాన్స్ బుకింగ్‌లోనే రూ.100 కోట్లపై పుష్ప 2 కన్ను.. 24 గంటల్లోనే టికెట్ల సేల్ ఎంతంటే?
Pushpa 2 release date: పుష్ప 2 సినిమా మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఐదు భాషల్లో 12 వేల స్క్రీన్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ.. రిలీజ్‌కి ముందు అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు బద్ధలు కొడుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ విడుదలకి ముందే కోట్లు కొల్లగొడుతోంది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మూవీ థియేటర్లలోకి రాబోతోంది. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మూవీపై అంచనాల్ని పెంచేయగా.. దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్‌తో అల్లు అర్జున్, రష్మిక మంధాన ఆ హైప్‌ను మరింత రెట్టింపు చేస్తున్నారు.
తెలుగులో కంటే హిందీలోనే క్రేజ్
పుష్ప 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటి వరకూ 6.6 లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. ఇందులో హిందీ వెర్షన్ కోసమే ఎక్కువ టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. టికెట్ల అమ్మకాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే నార్త్‌లోనే ఎక్కుగా జరిగినట్లు తెలుస్తోంది. నార్త్‌లో ఇప్పటి వరకూ 3,48,892 టికెట్లు అమ్ముడుపోగా.. తెలుగు వెర్షన్ కోసం 2,73,519 టికెట్లు సేల్ అయ్యాయి. ఓవరాల్‌గా ఈ సంఖ్య 6 లక్షలు దాటిపోయింది.
కల్కి రికార్డ్‌పై పుష్ప 2 కన్ను
అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2989AD తొలి రోజు రూ.61 కోట్లు గ్రాస్ రాబట్టగా.. రిలీజ్ టైమ్‌కి ఆ సంఖ్య రూ.95.3 కోట్లకి చేరింది. అయితే.. పుష్ప 2 మూవీ రూ.100 కోట్లతో ఆ రికార్డ్‌ని బద్ధలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలానే ముంబయి, ఢిల్లీలో ఇప్పటికే రూ.1500 నుంచి 1700 వరకూ పుష్ప 2 మూవీ టికెట్ రేట్లు పలుకుతున్నాయి.
ఆరు భాషల్లో పుష్ప 2
పుష్ప 2 మూవీ.. డిసెంబరు 5న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలి, హిందీ భాషల్లో రిలీజ్‌కాబోతోంది. ఈ మూవీ రూ.1000 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టే అవకాశం ఉండగ.. ఈ ఏడాది కల్కి మాత్రమే రూ.1000 కోట్ల మార్క్‌ని అందుకున్న విషయం తెలిసిందే.
పుష్ఫ 2 లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు.