Pushpa 2 advance booking: రిలీజ్‌కి ముందు రికార్డుల్ని తిరగరాస్తున్న పుష్ప 2.. బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు కూడా ఉఫ్!
Pushpa 2 release Date: మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాగా ఉన్న పుష్ప 2.. రిలీజ్‌కి ముందు పాన్ ఇండియా సినిమాల రికార్డుల్ని బద్ధలు కొట్టేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో గంటల వ్యవధిలోనే సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ విడుదలకి ముందే రికార్డుల మోత మోగించేస్తోంది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 : ది రూల్ విడుదలకి సిద్ధమవుతుండగా.. 12,000 స్క్రీన్లలో మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

గంటల వ్యవధిలోనే రికార్డ్
థియేటర్లలో మూవీ విడుదలకి నాలుగు రోజుల ముందే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ఉన్న పుష్ప 2.. గంటల వ్యవధిలోనే పఠాన్, కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డుల్ని బ్రేక్ చేసేసింది.
పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన మొదటి రోజే 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అయ్యింది.
పఠాన్, కేజీఎఫ్ రికార్డ్స్ కనుమరుగు
2023, జనవరిలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో 2 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోగా.. పుష్ప 2 ఈ రికార్డ్‌ని బద్ధలు కొట్టేసింది. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ చాప్టర్ 2ను కూడా పుష్ప 2 దాటేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన 12 గంటల్లోనే హిందీ డబ్బింగ్ వెర్షన్‌కి సంబంధించి 1.25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆదివారం (డిసెంబర్ 1) మధ్యాహ్నానికల్లా హిందీలో 1.8 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
10 లక్షల టికెట్లు
అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 12 గంటల్లోనే అల్లు అర్జున్ పుష్ప 2కి హిందీలో రూ.5.5 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇంకా రిలీజ్‌కి నాలుగు రోజుల సమయం ఉండగా.. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా అడ్వాన్స్ బుకింగ్స్‌లో 10 లక్షల టికెట్లు అమ్ముడు పోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.
బాహుబలి 2 రికార్డ్‌పై కన్ను
కరోనా మహమ్మారి అనంతరం కేజీఎఫ్ చాప్టర్ 2 అడ్వాన్స్ బుకింగ్ టాప్‌లో ఉంది. యశ్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ- సేల్‌తో రూ.80 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ కంటే ముందు ఈ రికార్డ్‌ను 2017లో రూ.90 కోట్లతో ‘బాహుబలి 2’ క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 రూ.100 కోట్లతో ఈ రెండు సినిమాల రికార్డుల్ని కూడా బద్ధలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.