గుండెపోటు లక్షణాలు అందరిలోను ఒకేలా ఉండవు. గుండెపోటు తీవ్రంగా ఉంటుందనేది కూడా నిజం కాదు. నొప్పి స్వల్పంగా ఉన్నా గుండె తీవ్ర స్థాయిలో దెబ్బతిని ఉండొచ్చు. 

By Bolleddu Sarath Chandra
Dec 02, 2024

Hindustan Times
Telugu

పొగ త్రాగేవారిలో, మద్యం సేవించే వారిలోగుండెపోటు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

స్థూలకాయులు, మానసిక ఒత్తిడికి గురయ్యేవారు, సమీప బంధువుల్లో గుండెపోటుకు గురైన వారిలో గుండెపోటు సాధారణంగా కనిపిస్తుంది.

20ఏళ్ల వయసు దాటిన ప్రతివారిలో గుండె రక్తనాళాల్లో ఎంతోకొంత పూడిక ఉంటుంది. యాంజైనా సమస్య ఉన్నవారు, మధుమేహ‍ం, రక్తపోటు ఉన్న వారిలో ఆ తర్వాత గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. 

సైలంట్ హార్ట్‌ అటాక్‌లో గుండె పూర్తిగా దెబ్బతినే వరకు దానిని గుర్తించలేరు.  షుగర్ రోగుల్లో ఇలా ఎక్కువగా జరుగుతుంది. 

సైలెంట్‌ గుండెపోటులో రోగికి ఊపిరి ఆడకపోవడం, కాళ్లూ చేతులు చల్లబడటం, షాక్‌కు గురి కావడం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలకు గుండె ఎంత మేరకు దెబ్బతిందనేది తెలియదు. 

గుండె  పోటు, యాంజైనా నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. యాంజైనా నొప్పి రెండు మూడు నిమిషాలు ఉంటేచ గుండెనొప్పి ఎక్కువ సేపు ఉంటుంది. 

కొంతమందిలో రొమ్ము కుడి, ఎడమ భాగాల్లో నొప్పి, కొందరిలో దవడలో, కొందరిలో వీపులో నొప్పి కలగవచ్చు. వికారం, వాంతి, శ్వాస ఆడకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

గుండెపోటులో కండరాల బలహీనత ఏర్పడవచ్చు, కొందరిలో తెలియకుండానే మలమూత్ర విసర్జన జరగొచ్చు.  కొందరిలో స్పృహ తప్పడం కూడా కనిపిస్తుంది. 

గుండెపోటులో  కొన్ని కండరాలకు రక్తప్రసరణ లేకపోవడం వల్ల అవి కృశించి, గుండె రక్తాన్ని శరీరంలో ఇతర భాగాలకు సరఫరా చేయలేకపోవడం వల్ల  ఊపిరితిత్తులలో నీరు చేరి సరైన ఆక్సిజన్ అందక ఆయాసం వస్తుంది. 

గుండెపోటులో తీవ్రమైన నొప్పి, ఆయాసం వాటి వల్ల భయం, ఆందోళన, కంగారు పడటం, మానసిక ఒత్తిడికి గురవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

రక్తంలో కొవ్వు అధికంగా పేరుకుపోయిన వారిలో డయాబెటిస్ రోగుల్లో  గుండెపోటు అధికంగా వస్తుంది. 

గుండెపోటు వల్ల షాక్‌కు గురైనా గుండె బలహీనపడి పనిచేయకపోయినా శరీర భాగాలకు తగినంత రక్తం అందక కాళ్లు చేతులు చల్లబడటం, బలహీనంగా ఉన్నట్టు అనుభూతి చెందడం, కాళ్లు చేతులు కదపలేని పరిస్థితి రావొచ్చు. 

 శీతాకాలంలో శరీరం చల్లబడితే, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. కాబట్టి, చలి నుండి రక్షించుకోండి.

Pexel