Bajaj Chetak EV Discount : ఇక లేట్ చేయెుద్దు బ్రో.. ఇలా కొన్నారంటే బజాజ్ చేతక్ ఈవీపై డిస్కౌంట్ పొందొచ్చు!-you can get discount offer on bajaj chetak 3202 variant electric scooter know available price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Chetak Ev Discount : ఇక లేట్ చేయెుద్దు బ్రో.. ఇలా కొన్నారంటే బజాజ్ చేతక్ ఈవీపై డిస్కౌంట్ పొందొచ్చు!

Bajaj Chetak EV Discount : ఇక లేట్ చేయెుద్దు బ్రో.. ఇలా కొన్నారంటే బజాజ్ చేతక్ ఈవీపై డిస్కౌంట్ పొందొచ్చు!

Anand Sai HT Telugu
Dec 02, 2024 09:15 AM IST

Bajaj Chetak EV Discount : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మంచి డిస్కౌంప్ పొందవచ్చు. ఇప్పటికే ఈ టూ వీలర్ మంచి అమ్మకాలను పొందుతోంది. బజాజ్ చేతక్ 3202 వేరియంట్ మీద వేలల్లో తగ్గింపు ఉంది.

బజాజ్ చేతక్ ఈవీ
బజాజ్ చేతక్ ఈవీ

బజాజ్ ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. రెట్రో లుక్‌లో వచ్చిన బజాజ్ చేతక్ ఈవీకి మంచి క్రేజ్ ఉంది. మెుదట్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు మెట్రో నగరాలపై దృష్టి పెట్టాయి. కొత్త వేరియంట్‌లను పరిచయం చేయడం ద్వారా మార్కెట్‌లో మిగతా వాటికి పోటీగా నిలుస్తోంది. చేతక్ ఈవీని కొనుగోలు చేయాలనుకునే వారికి సువర్ణావకాశం వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గొప్ప ఆఫర్‌లతో లభిస్తాయి.

yearly horoscope entry point

బజాజ్ చేతక్ 3202 వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 7,000 వరకు తగ్గింపును పొందవచ్చు. రూ.1,15,018 ఎక్స్-షోరూమ్ ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌‌పై ఇలా డిస్కౌంట్ పొందవచ్చు. బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో చేతక్ 3202 వేరియంట్‌పై తగ్గింపు ఆఫర్‌లను ఎలా పొందవచ్చో తెలుసుకోండి. మీరు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి ధరను చూస్తే డిస్కౌంట్ లేనట్లు కనిపిస్తోంది. కానీ మీరు కార్ట్, చెల్లింపు ఆప్షన్ చేరుకున్నప్పుడు ప్రయోజనాలను చూడవచ్చు. బ్యాంకును బట్టి క్రెడిట్ కార్డ్ చెల్లింపులతో ప్రారంభంలో 6,000 ఆఫర్ ఉంటుంది.

మీరు డెబిట్ కార్డ్ చెల్లింపు చేయాలనుకుంటే రూ. 2,000 వరకు ఆఫర్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 3,000 తగ్గింపును పొందుతుంది. ఒకేసారి చెల్లింపు అవసరం లేకుంటే 3 సంవత్సరాల వరకు ఉన్న ఫ్లెక్సిబుల్ ఈఎంఐ స్కీమ్‌ను కూడా పొందవచ్చు. ఈ అన్ని ఆప్షన్స్ కలిపి చేతక్ 3202ని దాదాపు రూ. 1,06,417కి పొందవచ్చు.

రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్ అసలు ధర కలిగిన ఈ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 137 కి.మీల వరకు ప్రయాణించగలదు. చేతక్ 3202 మోడల్ 3.2 kWh బ్యాటరీ ప్యాక్, ఇది 5.6 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 35 నిమిషాలు పడుతుంది. చేతక్ 3202 వేరియంట్ ఎకో అనే ఒక రైడ్ మోడ్‌తో వస్తుంది. కంపెనీ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఆల్-మెటల్ బాడీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, సాఫ్ట్ క్లోజ్ సీట్, రివర్స్ ఫంక్షన్, స్మార్ట్ కీ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో TecPaని ఎంచుకుంటే వినియోగదారులు హిల్ హోల్డ్, రోల్-ఓవర్ డిటెక్షన్ వంటి అదనపు ఫీచర్‌లను కూడా పొందవచ్చు. డిజైన్‌ను పరిశీలిస్తే ఇది ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఉంటుంది. బజాజ్ చేతక్ ఈవీని ఇతర మోడళ్ల నుండి వేరుగా ఉంచేది ఎల్ఈడీ డీఆర్ఎల్. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఛాన్స్.

గమనిక : ఈ డిస్కౌంట్ ఆఫర్లు మారుతూ ఉండవచ్చు. దయచేసి పూర్తి వివరాలను తెలుసుకుని కొనండి. పైన చెప్పిన కంటెంట్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.

Whats_app_banner