CNG Car Mileage : సీఎన్జీ కారును ఇలా చూసుకుంటే మైలేజీతో సమస్య ఉండదు!
CNG Car Mileage : సీఎన్జీ కార్లపై కూడా చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్, డిజీల్ కార్లతో పోల్చుకుంటే దీనికి అయ్యే ఖర్చు తక్కువ. మైలేజీ పరంగా చూస్తే బెటర్. అయితే సీఎన్జీ కారును కూడా సరిగా మెయింటెన్ చేయకుంటే మైలేజీ మీద ప్రభావం చూపిస్తుంది.
సీఎన్జీ కార్లకు భారత మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది వీటివైపు వెళ్తున్నారు. అయితే తాము కొనుగోలు చేసిన కారు కంపెనీ క్లెయిమ్ చేసినంత మైలేజీని ఇవ్వడం లేదని చాలా మంది ఫిర్యాదు కూడా చేస్తున్నారు. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. మీ సీఎన్జీ కారు ఎక్కువ మైలేజీ ఇచ్చేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చిన్న పనులు చేస్తే సరిపోతుంది. సీఎన్జీ కారు మైలేజీని పెంచడానికి కొన్ని సులభమైన టిప్స్ తెలుసుకుందాం.
ఇతర వాహనాల మాదిరిగానే ఇంజన్ పూర్తిగా యాక్టివ్‌గా ఉండేలా సీఎన్జీ కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించడం అవసరం. ఇది కాకుండా ఇంజిన్ సరైన పరిస్థితి, ఎయిర్ ఫిల్టర్, ఇగ్నిషన్ సిస్టమ్ మైలేజీని మెరుగ్గా ఉంచుతుంది. ఇంజిన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చడం కూడా చాలా ముఖ్యం. ఇంజిన్ ఆయిల్ లేదా లూబ్రికెంట్ తక్కువగా ఉంటే మైలేజీ కూడా ప్రభావితమవుతుంది.
వాహనానికి సరైన టైర్ ఒత్తిడిని నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. మితిమీరిన లేదా తక్కువ పీడనం టైర్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది మైలేజీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టైర్ ఒత్తిడిని క్రమం తప్పకుండా చెక్ చేయండి. కంపెనీ పేర్కొన్న ప్రమాణాల ప్రకారం టైరులో గాలి ఒత్తిడిని చూసుకోవాలి. ఇది కాకుండా మెకానిక్‌తో చెక్ చేయిస్తూ ఉండాలి.
మీ కారుకు వచ్చే మైలేజ్ అనేది మీ డ్రైవింగ్ పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు అవసరం లేనప్పుడు కూడా గేర్లు మార్చడంలాంటివి చేయకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు సరిగ్గా గేర్ మార్చండి. వేసవి కాకపోతే సీఎన్జీ, హీటర్ ఆఫ్‌లో ఉంచడం ద్వారా మైలేజీని పెంచుకోవచ్చు.
ఉత్తమ మైలేజీ కోసం ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, రిప్లేస్ చేయడం ముఖ్యం. మురికితో ఉన్న ఎయిర్ ఫిల్టర్ కారణంగా ఇంజిన్ సరైన మొత్తంలో గాలిని పొందదు. ఇది వాహనం మైలేజీని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
సీఎన్జీ కారులో తగిన స్పార్క్ ప్లగ్‌లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. సీఎన్జీ స్పార్క్ ప్లగ్‌లు ద్వారా కూడా ప్రభావం పడుతుంది. కారులో అధిక బరువు కూడా వేయకూడదు. దీనితో కారు మైలేజీ తగ్గుతుంది. అనవసరమైన వస్తువులను కారులో నుంచి తీసేయడమే మంచిది. లేదంటే ఇంధన సామర్థ్యంపై ప్రభావం పడుతుంది.
సీఎన్జీ కారులో గ్యాస్ సిస్టమ్ పరిస్థితి రెగ్యులర్‍గా చెక్ చేయాలి. లీక్స్, పనిచేయకపోవడంలాంటి సమస్యలను గమనిస్తే.. వెంటనే నిపుణులను సంప్రదించాలి.
టాపిక్