Vijayawada Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.100 కోట్లతో అభివృద్ధి.. 10 ముఖ్యాంశాలు-10 important points regarding the vijayawada kanaka durga temple master plan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.100 కోట్లతో అభివృద్ధి.. 10 ముఖ్యాంశాలు

Vijayawada Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.100 కోట్లతో అభివృద్ధి.. 10 ముఖ్యాంశాలు

Basani Shiva Kumar HT Telugu
Dec 02, 2024 06:11 AM IST

Vijayawada Kanaka Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.

విజయవాడ ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రి

బెజవాడ దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌరక్యాలు కల్పించాలని నిర్ణయించింది. పర్యాటక శాఖతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. తాజాగా దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన 10 కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

1.రాబోయే శతాబ్దం అవసరాలకు తగ్గట్లు రూ.100 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేపట్టేందుకు.. మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు.

2.పర్యాటక శాఖతో సమన్వయం చేసుకొని.. దుర్గగుడిని అభివృద్ధి చేయనున్నారు.

3.గత పొరపాట్లను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించారు.

4.కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న పనుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రదర్శన ద్వారా అధికారులు మంత్రికి వివరించారు.

5.మంత్రి ఆనం, ఎంపీ కేశినేని చిన్నీ అధికారులకు పలు సూచనలు చేశారు. దుర్గగుడి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకం ద్వారా నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

6.తిరుమల తరహాలో భక్తులకు విశ్రాంతి గదులు, కాటేజీలు లాంటివి నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

7.కనకదుర్గ ఆలయం అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు.

8.డీపీఆర్‌ను సీఎం చంద్రబాబుకు చూపించి.. సలహాలు, సూచనలతో చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం, ఎంపీ కేశినేని చిన్నీ వెల్లడించారు.

9.దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ సమగ్రంగా లేదని.. మంత్రి ఆనం, ఎంపీ చిన్ని అభిప్రాయపడ్డారు.

10.ప్రసాద పథకం నుంచి నిధులు తీసుకొచ్చి ఆలయానికి అవసరమైన కాటేజీలు, కేశఖండన శాల, ప్రసాదాల పోటు, అన్నప్రసాద కేంద్రం శాశ్వతంగా ఉండిపోయేలా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Whats_app_banner