Priyanka Jain Video : తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో-చిక్కుల్లో ప్రియాంక జైన్ జంట-tirumala footpath way priyanka jain couple prank video on leopard attack ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Priyanka Jain Video : తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో-చిక్కుల్లో ప్రియాంక జైన్ జంట

Priyanka Jain Video : తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో-చిక్కుల్లో ప్రియాంక జైన్ జంట

Bandaru Satyaprasad HT Telugu
Nov 27, 2024 06:56 PM IST

Priyanka Jain Tirumala Prank Video : బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ జంట వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల నడక మార్గంలో చిరుత వచ్చిందంటూ ప్రాంక్ వీడియో చేశారు. ఈ ప్రాంక్ వీడియో వైరల్ అయ్యింది. తిరుమల లాంటి పవిత్ర ప్రదేశంలో ఇలాంటి వీడియోలు ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో-చిక్కుల్లో ప్రియాంక జైన్ జంట
తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో-చిక్కుల్లో ప్రియాంక జైన్ జంట

బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి ప్రియాంక జైన్ చిక్కుల్లో పడ్డారు. తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్ తో కలిసి ప్రియాంక తరచూ ప్రాంక్ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతుంటాయి. ఇలాంటి ఓ ప్రాంక్ వీడియోతో ఈ జంట వివాదంలో చిక్కుకుంది. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్ తో ఫేమస్ అయిన ప్రియాంక జైన్, బిగ్ బాస్ సీజన్-7 అడుగుపెట్టింది. తన ఆట తీరుతో మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ప్రియాంక జైన్, శివకుమార్ జంట ఇటీవల తిరుమల వెళ్లారు.

చిరుత వచ్చిందని ప్రాంక్ వీడియో

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో బయలుదేరిన ప్రియాంక జైన్, శివకుమార్...ఓ ప్రాంక్‌ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విమర్శలకు దారితీసింది. అలిపిరి మెట్ల మార్గంలో చిరుతలు సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వీరిద్దరూ ఓ ప్రాంక్ రీల్ చేశారు. చిరుత వస్తున్నట్లు ఫేక్‌ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియోను తిరుమల దారిలో చిరుత దాడి అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. చివరిగా చిరుత లేదు, ఇదంతా ప్రాంక్‌ అని నెటిజన్లను ఫూల్స్‌ని చేశారు. ఈ ప్రాంక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ వీడియో చూసిన తిరుమల శ్రీవారి భక్తులు ప్రియాంక జైన్‌ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల మార్గంలో ఇలాంటి వీడియోలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసం తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో... ప్రియాంక జైన్ జంటపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.

క్రిమినల్ కేసు నమోదు చేయాలి -భాను ప్రకాష్ రెడ్డి

ఈ వివాదంపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. రీల్స్ చేయడానికి ఒక హద్దు ఉంటుందన్నారు. అసలు మనిషి అనేవాళ్లు ఇలాంటి పనులు చేయరన్నారు. సెలబ్రిటీలు అయ్యి ఉండి, ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు. నిత్యం వేలాదిమంది భక్తులు వెళ్లే పవిత్రమైన నడకదారిలో పిచ్చి పిచ్చి రీల్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా టీటీడీ అధికారులతో మాట్లాడతానన్నారు. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తిరుమల ఓ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రమని, ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని నిర్ణయించామన్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, అంబటి రాంబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారన్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను కోరుతామన్నారు.

తిరుమల నడక మార్గంలో వన్యమృగాలు సంచరిస్తుంటాయి. ఇటీవల జరిగిన చిరుత దాడుల్లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో టీటీడీ నడకమార్గంలో పటిష్ట చర్యలు చేపట్టింది. భక్తులకు చేతికర్రలు ఇస్తుంది. ఇలాంటి సెన్సిటివ్ విషయంపై ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటిని నెటిజన్లు ప్రియాంక జైన్ పై మండిపడుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం