Andhra Pradesh News Live December 2, 2024: Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 02 Dec 202405:20 PM IST
Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4వ తేదీన రెండు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. బెనిఫిట్ షోలకు టికెట్ ధర రూ.800లుగా నిర్ణయించింది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
Mon, 02 Dec 202404:49 PM IST
AP Civil Assistant Surgeon Notification : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ పరిధిలోని మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
Mon, 02 Dec 202404:18 PM IST
Visakha Vijayawada Metro Projects : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులలో కీలక అడుగుపడింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల ఫేజ్-1 డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ఫేజ్-1 లో 46.23 కి.మీ మేర మూడు కారిడార్లు నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో ఫేజ్-1 లో 38.4 కి.మీ మేర నిర్మించనున్నారు.
Mon, 02 Dec 202402:22 PM IST
Sachivalaya Staff Biometric : సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులంతా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Mon, 02 Dec 202411:27 AM IST
- Shocking Electricity Bills: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులపై కొత్త సర్దుబాటు భారం మొదలైంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.6వేల కోట్ల సర్దుబాటు ఛార్జీల వసూలు మొదలైంది. వచ్చే నెలలో మరో సర్దుబాటు భారం మొదలు కానుంది. పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం పిలుపునిచ్చింది.
Mon, 02 Dec 202410:41 AM IST
YS Sharmila : ప్రపంచానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేస్ ను రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇది జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
Mon, 02 Dec 202410:10 AM IST
- AP Excise Rules: మద్యం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్ట్‌షాపులకు సరఫరాలపై భారీ జరిమానాలు విధించింది. ఈ మేరకు ఎక్సైజ్ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Mon, 02 Dec 202410:05 AM IST
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Mon, 02 Dec 202409:04 AM IST
- Pawan Meets CBN: ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది.
Mon, 02 Dec 202408:58 AM IST
YS Jagan Assets Case : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యమవుతోందని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది.
Mon, 02 Dec 202407:00 AM IST
- YSRCP : పథకాల అమలు, ప్రజల అభిప్రాయంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్కీమ్స్ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. దీనిపై వైఎస్సార్సీపీ సెటైర్లు వేసింది. నేతి బీరకాయలో నెయ్యి వుండదు.. అలాగే చంద్రబాబు పాలనలో ఉత్తుత్తి పేర్లే తప్ప పథకాలు ఉండవని ఎద్దేవా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon, 02 Dec 202405:46 AM IST
- Tirumala Darshan Tickets: తిరుపతి, రేణిగుంట వాసుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తొలి విడతగా డిసెంబర్ నెల కోటాను విడుదల చేశారు.
Mon, 02 Dec 202404:40 AM IST
- AP Ration Mafia: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు అసలు కారణాలను అన్వేషించకుండా రాజకీయం సాగుతోంది. ఓట్ల వేటలో ఇబ్బడిముబ్బడిగా రేషన్ కార్డులు జారీ చేయడమే ఈ సమస్యకు మూల కారణం. జనం ఆహారంగా వినియోగించని దొడ్డు బియ్యంతో దళారులు కోట్లు కొల్లగొడుతున్నా ప్రభుత్వం కళ్లు ముసుకుంటోంది.
Mon, 02 Dec 202404:19 AM IST
- Tirumala : ఫెంగల్ తుపాను ఏపీ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. అటు తిరుమల కొండపైనా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Mon, 02 Dec 202403:52 AM IST
- APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ మాసంలో 4 రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
Mon, 02 Dec 202402:19 AM IST
- Rajahmundry to Mumbai Flight : రాజమండ్రి నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఇక్కడి నుంచి ముంబయికి ఎయిర్ బస్ స్టార్ట్ అయ్యింది. అటు రేణిగుంట- ముంబయి మధ్య కూడా డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం అయ్యింది. దీనిపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Mon, 02 Dec 202412:41 AM IST
- Vijayawada Kanaka Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
Mon, 02 Dec 202411:45 PM IST
- Vijayawada : విజయవాడలో ఘోరమైన ఘటన జరిగింది. పదో తరగతి బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేశాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని బాలిక తల్లి నిలదీసింది. అప్పటి నుంచి సవతి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.