Karthika Deeapam Today December 2: దాసు చెప్పిన నిజంతో హడలిపోయిన జ్యోత్స్న.. కాళ్లు పట్టుకొని.. చస్తానంటూ బెదిరింపు-karthika deeapam 2 today episode december 2 dasu tells truth about deepa to jyothsna she begged him ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deeapam Today December 2: దాసు చెప్పిన నిజంతో హడలిపోయిన జ్యోత్స్న.. కాళ్లు పట్టుకొని.. చస్తానంటూ బెదిరింపు

Karthika Deeapam Today December 2: దాసు చెప్పిన నిజంతో హడలిపోయిన జ్యోత్స్న.. కాళ్లు పట్టుకొని.. చస్తానంటూ బెదిరింపు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 02, 2024 07:44 AM IST

Karthika Deeapam 2 Today Episode December 2: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపే అసలు వారసురాలు అని జ్యోత్స్నకు దాసు చెప్పేశాడు. దీంతో ఆమె హడలిపోయింది. దాసును బతిమాలింది. ఇద్దరి మధ్య వాదన నడిచింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deeapam Today December 2: దాసు చెప్పిన నిజంతో హడలిపోయిన జ్యోత్స్న.. కాళ్లు పట్టుకొని.. చస్తానంటూ బెదిరింపు (Photo: Hotstar)
Karthika Deeapam Today December 2: దాసు చెప్పిన నిజంతో హడలిపోయిన జ్యోత్స్న.. కాళ్లు పట్టుకొని.. చస్తానంటూ బెదిరింపు (Photo: Hotstar)

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 2) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శివన్నారాయణ బయటికి వెళ్లు అని దాసుతో అంటాడు. దీంతో అలాగే అంటూ వెళ్లిపోతాడు దాసు. ఇంట్లో నుంచి వెెళ్లిపోతున్న దాసుతో జ్యోత్స్న బయట మాట్లాడుతుంది. “మా మమ్మీడాడీతో నీకేంటి పని. దీప తండ్రి డ్రాయింగ్ ఎందుకు ఉందంటే సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కుబేర్ వాళ్ల అక్క అనసూయను కలిసి డ్రాయింగ్ గురించి మాట్లాడుతున్నావ్. ఇప్పుడు మా ఇంటికి వచ్చావ్. ఏం చేస్తున్నావ్ నువ్వు. మా మమ్మీ డాడీతో ఏం మాట్లాడడానికి వచ్చావ్” అని తన సొంత తండ్రి దాసును ప్రశ్నిస్తుంది జ్యోత్స్న.

వారసురాలు దొరికింది.. జ్యోత్స్న షాక్

“నువ్వేదో చేస్తున్నావ్.. ఏదో చెప్పాలనుకుంటున్నావ్.. ఏదో సాధించానన్న ఆనందం నీ కళ్లలో కనిపిస్తుంది.. ఏంటది. నువ్వు ఏం చెప్పాలని మా ఇంటికి వచ్చావ్” అని జ్యోత్స్న అడుగుతుంది. దీంతో నిజం చెప్పాలని వచ్చానంటాడు దాసు. వారసురాలు దిరికేసిందని దాసు చెబుతాడు. ఈ ఇంటి అసలైన వారసురాలు ఏవరో తెలిసింది అంటాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

ఆ అమ్మాయిని ఎప్పటికైనా కలుస్తా

తనను చిన్నతనంలో నీటిలో మునిగిపోకుండా కాపాడిన పాపకు సంబంధించిన చైన్ చూస్తాడు కార్తీక్. జ్యోత్స్నకు దీపతోనే కాదు నీతోనూ పోలిక లేదు అంటూ ఆ పాపను తలచుకుంటాడు. రుణం తీర్చుకునే అవకాశం రాకపోదా.. ఎక్కడున్నావ్ నువ్వు అని అనుకుంటాడు. చిన్నప్పుడు కార్తీక్‍ను కాపాడింది దీపే. కానీ ఆ విషయం కార్తీక్‍కు తెలియదు. ఎవరో అనుకుంటాడు. అందుకే ఎక్కడున్నావంటూ ఆలోచిస్తుంటాడు. ఇంతలోనే దీప వస్తే ఆ చైన్ దాచేస్తాడు. చేతిలో ఏంటది అన్నా కూడా చూపించడు. ఎవరినైనా కలవాలనుకుంటే త్వరగా కలవాలని, ఆ తర్వాత అవకాశం రాకపోవచ్చని దీప అంటుంది. ఆ మనిషి ఎక్కడుందో తెలిస్తేనే కదా దీప అని కార్తీక్ అనుకుంటాడు. లాకెట్ గురించి చెప్తే జ్యోత్స్న చిన్నప్పటి బుద్ధి గురించి చెప్పాలని, అందుకే చెప్పలేదని అనుకుంటాడు. ఆ అమ్మాయిని ఏదో రోజు కలిసి నీ ముందు నిలబెడతా దీప అని అనుకుంటాడు.

దీపే వారసురాలు.. హడలిన జ్యోత్స్న

వారసురాలు ఎవరు అని దాసును గట్టిగా అడుగుతుంది జ్యోత్స్న. తాను చెెప్పనని, తన అన్నావదినలు దశరథ్, సుమిత్రకే చెబుతానని అంటాడు. దీంతో అసలు నీకే వారసురాలు ఏవరో తెలియదని, అబద్ధం చెబుతున్నావంటూ జ్యోత్స్న వాదిస్తుంది. అబద్ధం, నిజం అంటూ ఇద్దరూ మధ్య వాదన సాగుతుంది. నిజం తెలిస్తే ధైర్యంగా చెప్పు, నీకు తెలియదు కదా, షాడిస్ట్ అంటూ రెచ్చగొడుతుంది జ్యోత్స్న. అసలైన వారసురాలు ఎప్పుడో చచ్చిపోయిందని అంటుంది. కాసేపటి వాదన తర్వాత దాసు అసలు నిజం చెప్పేస్తాడు.

దీపే ఈ ఇంటి అసలైన వారసురాలు అని జ్యోత్స్నకు నిజం చెబుతాడు దాసు. “వారసురాలు బతికే ఉంది. అది ఎవరో కాదు. ఆ కుబేర్ కూతురు దీప. శివన్నరాయణ మనవరాలు. సుమిత్ర, దశరథ్‍ల కూతులు, వారి యావత్ ఆస్తులకు అసలైన వారసురాలు ఎవరో కాదు దీప” అని జ్యోత్స్నతో దాసు చెబుతాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అబద్ధం అని జ్యోత్స్న అంటే.. ఇదే నిజం అని వివరాలు చెబుతాడు దాసు.

కన్న బిడ్డ కాదు.. పెంచిన కూతురు

దీప.. కుబేర్ సొంత కూతురు కాదని, అతడికి బస్టాండ్‍లో దొరికిందని ఆ విషయం తాను చూశానని దాసు చెబుతాడు. చిన్నప్పుడు దీపను చంపేయాలని సైదులుకు తన తల్లి పారిజాతం చెప్పిందని దాసు అంటాడు. అందుకు మనసు రాక సైదులు.. దీపను బస్టాండ్‍లో వదిలి వెళితే.. కుబేర్ తీసుకెళ్లడం తాను కళ్లారా చూశానని అంటాడు. దీప.. కుబేర్ కన్న బిడ్డం కాదు.. పెంచిన కూతురు అని జ్యోత్స్నతో దాసు చెప్పేస్తాడు. దీపను సైదులు చంపేశాడనుకొని.. అతడిని తన తల్లి పారిజాతం హత్య చేయించిందని గుర్తు చేసుకుంటాడు.

అన్ని సాక్ష్యాలు ఉన్నాయి

ఐశ్వర్యంలో పెరగాల్సిన బిడ్డ.. చావు నుంచి బయటపడి పేదింటికి చేరి కుబేర్‌కు కూతురు అయిందని దాసు చెబుతాడు. ఈ దాసు కూతురిగా పేదింట్లో పెరగాల్సిన నువ్వు.. ఆ ఇంటికి చేరి సుమిత్ర కూతురు అయ్యావ్ అని జ్యోత్స్నతో దాసు అంటాడు. దీపే ఆ ఇంటి వారసురాలు అని నిరూపించేందుకు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెబుతాడు. ఈ నిజాలన్నీ చెప్పి మా అమ్మ చెప్పిన పాపాలు ప్రక్షాళన చేస్తానని అంటాడు.

నిన్ను గెంటేస్తారు

దీప అసలైన వారసురాలా అని షాక్ అవుతుంది జ్యోత్స్న. నీ స్థానంలో దీప ఉందని అనుకున్నావ్.. కానీ దీప ప్లేస్‍లోనే నువ్వు ఉన్నావని జ్యోత్స్నతో దాసు అంటాడు. “నీ కూతురిని నా కొడుకు భార్య చేయాలని.. దశరథ్ అన్నయ్య దగ్గర కాంచన మాట తీసుకుంది. ఆ మాట ఎంత బలమైందంటే నీతో కార్తీక్‍కు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కార్తీక్‍తో దీప మెడలో దేవుడు తాళి కట్టించాడు” దాసు అంటాడు. దీంతో జ్యోత్స్న మైండ్‍బ్లాక్ అవుతుంది. ఈ నిజం తెలిస్తే రెండు కుటుంబాలు కలిసి పండగ చేసుకుంటారని అంటాడు. నువ్వు అసలైన వారసురాలు కాదని తెలిస్తే శివన్నారాయణ నిన్ను మెడపట్టుకొని బయటికి గెెంటేస్తారని అంటాడు. దాసు కూతురివి కాబట్టి బయటికి పంపేస్తారు అని అంటాడు.

కాళ్ల మీద పడిన జ్యోత్స్న.. చస్తానంటూ బెదిరింపు

దీప వారసురాలేంటి.. ఇప్పుడు నేనేం చేయాలని అనుకుంటూ కంగారు పడుతుంది జ్యోత్స్న. నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి.. ముందు ఇతడిని ఆపాలని అనుకుంది. నేను నీ కన్న కూతురిని.. నిజం తెలిస్తే నాకు అన్యాయం జరుగుతుందంటూ దాసుతో సెంటిమెంట్ డ్రామా మొదలుపెడుతుంది జ్యోత్స్న. నిజం చెప్పొద్దని దాసును వేడుకుంటుంది. అయితే, నీ కోసం నా అన్న కూతురు దీపకు అన్యాయం చేయలేనని దాసు అంటాడు. దీంతో దాసు కాళ్లపై పడుతుంది జ్యోత్స్న.

దీపే అసలు వారసురాలు అని ఇంట్లో చెబితే తాను చచ్చిపోతానని బెదిరిస్తుంది జ్యోత్స్న. నీ కూతురిగా నేను ఆ బతుకు బతకలేనని అంటుంది. చచ్చిపోతానని అంటుంది. ఏడుస్తుంది. అయినా దాసు మాట వినడు. దీప వారసురాలని దశరథ్‍కు చెప్పేస్తానంటాడు. కార్తీక్‍ను పెళ్లి చేసుకొని దీపకు న్యాయం జరిగిందని జ్యోత్స్న అంటుంది. అయితే, ఈ న్యాయం సరిపోదని, తాను నిజం చెప్పేస్తానని పట్టుబడతాడు దాసు. బావ దూరమయ్యాడని ఇప్పటికే రోజూ ఏడుస్తూ బతుకుతున్నానని, ఇప్పుడు అమ్మానాన్నని కూడా దూరం చేస్తానంటే ఎలా బతకమంటావ్ అంటూ కాళ్లపై పడి జ్యోత్స్న ఏడుస్తుంది. చిన్నప్పుడు గ్రానీ నన్ను మార్చింది.. అది నా తప్పా అంటూ ప్రశ్నిస్తుంది. నిజం ఎవరికీ చెప్పొద్దంటుంది. అయినా నిజం చెబుతానంటాడు దాసు.

తనను చంపాలంటూ గొంతపై దాసు చేతులను పెట్టుకుంటుంది జ్యోత్స్న. నిజం చెబితే తాను కచ్చితంగా చస్తానంటుంది. అయినా సరే దాసు వినడు. నిజం చెప్పనని మాటిస్తావా.. చావమంటావా అని జ్యోత్స్న అడుగుతుంది. అయినా మాట ఇవ్వనంటాడు. అయితే నేను యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోతానని మళ్లీ అంటుంది జ్యోత్స్న.

తల్లి సెంటిమెంట్‍ వాడిన జ్యోత్స్న.. వెనక్కి తగ్గిన దాసు

చనిపోయిన తన తల్లిని గుర్తు చేసి దాసును సెంటిమెంట్‍తో కొడుతుంది జ్యోత్స్న. “మాటివ్వు నాన్న. లేదంటే నా చావుకు మా అమ్మ నిన్ను క్షమించదు” అని జ్యోత్స్న అంటుంది. దీంతో అప్పట్లో తన భార్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు దాసు. దీంతో మాటిస్తావా.. చావమంటావా అని జ్యోత్స్న అడుగుతుంది. దీంతో దాసు వెనక్కి తగ్గుతాడు.

మాట ఇవ్వను.. నిజం చెప్పను

దీపే వారసురాలు అని చెప్పనని మాట ఇవ్వలేనని దాసు అంటాడు. అయితే, తన నోటితో ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పనని జ్యోత్స్నతో అంటాడు. “మాట ఇవ్వలేను కానీ.. ఒక్కటి మాత్రం చెబుతా. నా నోటితో ఈ నిజం ఎప్పటికీ ఎవవ్వరికీ చెప్పను. ఈ ఇంటి వారసురాలికి కూడా అన్యాయం చేయను” అని దాసు అంటాడు.

చెప్పను అన్నది బాగానే ఉంది.. దీపకు అన్యాయం చేయను అంటే అర్థమేంటి అని జ్యోత్స్న అనుకుంటుంది. గందరగోళంలో పడుతుంది. అంతలోనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాసు. దీంతో కార్తీక దీపం 2 నేటి డిసెంబర్ 2 ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner

సంబంధిత కథనం