NNS December 2 Episode: తీవ్రవాదులను చితక్కొట్టిన భాగీ- నరకంలోనూ లేని విధంగా శిక్ష- మనోహరి షాక్- మిస్సమ్మ డబుల్ యాక్షన్!-nindu noorella saavasam serial december 2nd episode bhagi beats terrorists saves all zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns December 2 Episode: తీవ్రవాదులను చితక్కొట్టిన భాగీ- నరకంలోనూ లేని విధంగా శిక్ష- మనోహరి షాక్- మిస్సమ్మ డబుల్ యాక్షన్!

NNS December 2 Episode: తీవ్రవాదులను చితక్కొట్టిన భాగీ- నరకంలోనూ లేని విధంగా శిక్ష- మనోహరి షాక్- మిస్సమ్మ డబుల్ యాక్షన్!

Sanjiv Kumar HT Telugu
Dec 02, 2024 06:28 AM IST

Nindu Noorella Saavasam December 2nd Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 2 ఎపిసోడ్‌‌లో ఇంటి లోపల హాల్లో చైర్ వేసుకుని హీరోలా శివరామ్ గన్ పట్టుకుని కూర్చుంటాడు. కానీ, తీవ్రవాదులకు బుల్లెట్ ప్రూఫ్ ఉండటంతో ఏం కాదు. శివరామ్‌ను తన్ని పక్కన పెడతారు. దాంతో మిస్సమ్మ వచ్చి తీవ్రవాదులను చితక్కొడుతుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 2 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 2 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 2nd December Episode)లో అమర్​పై పగ తీర్చుకునేందుకు వచ్చిన తీవ్రవాదులు ఇంటి తలుపు కొడుతుంటారు. శివరామ్‌కు అమర్‌ ఫోన్‌ చేసి నేను వచ్చే వరకు వాళ్లను ఎలాగైనా డైవర్ట్‌ చేయండి అని చెప్తాడు.

చైర్ వేసుకుని శివరామ్

సరేనని మనోహరిని, నిర్మలను లోపలికి పంపిస్తాడు శివరామ్. తన పాత గన్‌ తీసుకుని డోర్‌కు ఎదురుగా చైర్‌ వేసుకుని కూర్చుని ఉంటాడు శివరామ్. తీవ్రవాదులు డోర్‌ పగులగొట్టి లోపలికి వస్తుంటే శివరామ్ కాలుస్తాడు. బుల్లెట్‌ ప్రూప్‌ ఉండటంతో వాళ్లకు ఏం కాదు. లోపలికి వచ్చిన తీవ్రవాదులు శివరామ్‌ను తన్ని కింద పడేసి పిల్లల కోసం లోపలికి వెళ్తుంటారు.

అప్పుడే మిస్సమ్మ వచ్చి వాళ్లను కొడుతుంది. లోపల జరగుతుంది కిటికీలోంచి చూస్తున్న అరుంధతి షాక్‌ అవుతుంది. మీరు కూర్చోండి మామయ్యా అని మిస్సమ్మ అంటుంది. అరుంధతి ఆశ్చర్యంగా గుప్తగారు ఇక్కడ ఏం జరగుతుంది అని అడుగుతుంది. గుప్త చూసి షాక్‌ అవుతాడు. తీవ్రవాదులను మిస్సమ్మ కొడుతుంటే పిల్లలు, మనోహరి, నిర్మల బయటకు వచ్చి చూసి షాక్‌ అవుతారు.

హగ్ చేసుకున్న పిల్లలు

మిస్సమ్మ దెబ్బలకు తీవ్రవాదులు పారిపోతారు. పిల్లలందరూ వచ్చి మిస్సమ్మను హగ్‌ చేసుకుంటారు. ఆరు హమ్మయ్యా థాంక్యూ దేవుడా..? అని ఊపిరి పీల్చుకుంటుంది. చాలా భయం వేసింది మిస్సమ్మ అంటుంది అమ్ము. ఏవండి మీకేం కాలేదుగా.. మిస్సమ్మ నువ్వు కనక లేకుంటే ఇవాళ పిల్లలు, ఆయన, మేమంతా బతికి ఉండేవాళ్లం కాదు మిస్సమ్మ అంటూ దండం పెడుతుంది నిర్మల.

ఇంతలో అమర్‌ వస్తాడు. పిల్లలందరూ అమర్‌ దగ్గరకు వెళ్తారు. అమర్‌ ఈ కుటుంబాన్ని కాపాడే క్రమంలో నేను విఫలం అయ్యాను. సమయానికి మిస్సమ్మ వచ్చి మమ్మల్ని అందర్ని కాపాడింది. ఒకవేళ మిస్సమ్మే సమయానికి రాకుంటే ఈ పిల్లలు మేము అందరం శవాలుగా మారిపోయి ఉండే వాళ్లం అంటాడు శివరామ్. దీంతో అమర్ ఏమోషనల్‌‌గా వెళ్లి మిస్సమ్మను హగ్‌ చేసుకుంటాడు. మనోహరి షాక్‌ అవుతుంది.

నరకమున కూడా అలా శిక్షలు ఉండవు

థాంక్స్‌ మిస్సమ్మ.. థాంక్యూ సో మచ్‌ అని అమర్‌ చెప్పగానే మిస్సమ్మ థాంక్యూ అంటుంది. గార్డెన్‌‌లో కూర్చున్న ఆరు మిస్సమ్మ తీవ్రవాదులను కొట్టింది గుర్తు చేసుకుంటుంది. అబ్బబ్బా అసలు మిస్సమ్మ ఒక్కొక్కరిని ఏం కొట్టింది గుప్త గారు అంటుంది ఆరు. మా నరకం నందు కూడా అటుల శిక్షించరు. యమపురి వాసులం నరకమున ఎన్నో శిక్షలను స్వయముగా వీక్షించిన ఈ చిత్ర విచిత్రగుప్తుడినే భయ బ్రాంతులకు గురి చేసింది అటుల శిక్షించినది అంటాడు గుప్త.

అసలు మిస్సమ్మలో ఈ యాంగిల్‌ ఉందని ఎప్పుడు గెస్‌ చేయలేదు గుప్తగారు అంటుంది ఆరు. ఆ ప్లేస్‌‌లో నేను ఉన్నా కూడా నేను నా పిల్లలను కాపాడుకోలేకపోయేదాన్ని గుప్త గారు. నా ప్రాణం పోయే వరకు పోరాడేదాన్నేమో కానీ వాళ్ల ప్రాణాలు కాపాడేదాన్ని కాదు. పిల్లలకు తల్లిగా ఇంటికి కోడలుగా మిస్సమ్మే కరెక్టు అనిపిస్తుంది గుప్త గారు అంటుంది అరుంధతి.

నిన్నటి వరకు ఆ బాలిక నీ పతి దేవునకు దగ్గర అవుతున్నదని బాధపడ్డావు. నేడు ఆ బాలికే గొప్పదని అంటున్నావు అని గుప్త అనగానే నా కథ ముగిసిపోయిందని తెలిసినా.. ఆయన జీవితంలో మిస్సమ్మ ఉందనడానికి కొంచెం టైం పడుతుంది గుప్త గారు అంటుంది ఆరు. మిస్సమ్మ అంత మందిని కొట్టింది కదా.. రేపు ఎప్పుడైనా ఆయన మీద కోపం వచ్చి ఆయన్ని కూడా కొడితే ఏంటీ పరిస్థితి అంటూ భయపడుతుంది అరుంధతి.

మిస్సమ్మ డబుల్ యాక్షన్

సరియైన అనుమానమే వచ్చింది అంటాడు గుప్త. మరోవైపు మిస్సమ్మ ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తుంటే.. పిల్లలు కిందకు వస్తారు. అంజు, మిస్సమ్మను చూస్తూ.. భయపడుతుంది. అంజు ఎందుకు అంత భయపడుతున్నావు అని అమ్ము అడిగితే.. నేను మిస్సమ్మను ఇంతకు ముందు తిట్టింది గుర్తుకు వస్తుంది. నిన్న రౌడీలను కొట్టింది గుర్తుకు వచ్చింది అందుకే భయపడుతున్నాను అంటుంది.

చూశారా అమ్ము ఏమీ తెలియనట్టు మిస్సమ్మ డబుల్‌ యాక్షన్‌ చేస్తుంది అని అంజు అంటుంది. ఇంతలో మిస్సమ్మ వచ్చి పిల్లలు ఎందుకు ఇంత త్వరగా లేచారు ఇవాళ లీవ్‌ కదా.. అంటుంది.

ఇవాళ్టీ నుంచి అన్ని రూల్స్‌ ప్రకారమే జరుగుతాయి అంటుంది అంజు. ఇంతలో రాథోడ్ వచ్చి అవును మిస్సమ్మ నిన్న వాళ్లను కొట్టడం కొంచెం ఆపేసి.. మేము వచ్చాక కొట్టి ఉంటే బాగుండు కదా..? నీ కొట్టుడు గురించి అందరూ కథలు కథలుగా చెప్తున్నారు. మేము వచ్చాక కొడితే మేము చూసేవాల్లం కదా..? అంటాడు.

సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని

అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు సార్‌‌కు చెప్తాను నువ్వు కూడా ఆర్మీలో జాయిన్‌ అవ్వు అంటాడు రాథోడ్. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మిస్సమ్మ దగ్గరకు ఆరు వచ్చి నిన్న వాళ్లను ఎలా కొట్టావు అని అడుగుతుంది. అవసరం నేర్పించింది అక్కా అంటూ పిల్లల కోసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకున్నాను అని మిస్సమ్మ చెబుతుంది.

అరుంధతి అక్క అప్పగించిన పిల్లల బాధ్యతను ఆయన నాకు ఇచ్చారు. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకున్నాను అక్కా అంటూ మిస్సమ్మ చెప్తుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner