Zee Telugu: బుల్లితెర ప్రేక్షకులకు ఇవాళ జీ తెలుగు సర్‌ప్రైజ్.. సీరియల్ హీరో హీరోయిన్స్ మీ ఇంటికి వచ్చే ఆఫర్.. ఎలా అంటే?-zee telugu pelli sandadi mega event selfie contest host by anchor ravi rithu chowdary in jaggaiahpet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu: బుల్లితెర ప్రేక్షకులకు ఇవాళ జీ తెలుగు సర్‌ప్రైజ్.. సీరియల్ హీరో హీరోయిన్స్ మీ ఇంటికి వచ్చే ఆఫర్.. ఎలా అంటే?

Zee Telugu: బుల్లితెర ప్రేక్షకులకు ఇవాళ జీ తెలుగు సర్‌ప్రైజ్.. సీరియల్ హీరో హీరోయిన్స్ మీ ఇంటికి వచ్చే ఆఫర్.. ఎలా అంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 30, 2024 01:29 PM IST

Zee Telugu Pelli Sandadi Mega Event Selfie Contest: బుల్లితెర ప్రేక్షకులకు జీ తెలుగు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇవాళ అభిమాన సీరియల్ హీరో హీరోయిన్స్‌ను తమ ఇంట్లోకి వచ్చే అవకాశాన్ని జీ తెలుగు అందిస్తోంది. జగ్గయ్యపేటలో జీ తెలుగు పెళ్లి సందడి మెగా ఈవెంట్‌ జరగనుంది.

బుల్లితెర ప్రేక్షకులకు ఇవాళ జీ తెలుగు సర్‌ప్రైజ్.. సీరియల్ హీరో హీరోయిన్స్ మీ ఇంటికి వచ్చే ఆఫర్.. ఎలా అంటే?
బుల్లితెర ప్రేక్షకులకు ఇవాళ జీ తెలుగు సర్‌ప్రైజ్.. సీరియల్ హీరో హీరోయిన్స్ మీ ఇంటికి వచ్చే ఆఫర్.. ఎలా అంటే?

Zee Telugu Pelli Sandadi Mega Event Selfie Contest: నిత్యం వినోదాత్మక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు బుల్లితెర అభిమానులకు అరుదైన కానుక అందిస్తోంది. తమ అభిమాన సీరియల్​ తారలను ప్రత్యక్షంగా కలిసే అద్భుత అవకాశం కల్పిస్తోంది.

సీరియల్ నటీనటులతోపాటు

ఆరంభం నుంచే ఆసక్తికరమైన కథ, ఆకట్టుకునే మలుపులతో కొనసాగుతున్న జీ తెలుగు సీరియల్స్ చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి , కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్​ నటీనటులతోపాటు ఇతర నటీనటులు ఈ నెల 30న అంటే ఇవాళ (శనివారం) జగ్గయ్యపేట​లో నిర్వహించనున్న జీ తెలుగువారి పెళ్లి సందడి.. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాబోతున్నారు.

జగ్గయ్యపేటలోని కాలేజ్ గ్రౌండ్

ఇక ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్​ యాంకర్లు రవి, రీతూ చౌదరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్​, పల్సర్​ బైక్​ రమణ, పలువురు జీ తెలుగు నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. జగ్గయ్యపేటలోని శ్రీమతి గంటల శకుంతలమ్మ కాలేజ్​ గ్రౌండ్​​ వేదికగా శనివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి జీ తెలుగువారి పెళ్లిసందడి పేరున ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరగనుంది.

జీ తెలుగు మరో సర్‌ప్రైజ్

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట ప్రేక్షకులకు జీ తెలుగు మరో సర్​ప్రైజ్​ని అందించనుంది. ఇందులో భాగంగా మీ టీవీలో 'జీ తెలుగు' ఛానల్​ చూస్తూ సెల్ఫీతీసి 7032904615 నెంబర్‌కు వాట్సాప్ చేస్తే మీ అభిమాన తారలు నేరుగా మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీ తెలుగు తారలు తమ అభిమానులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సెల్ఫీ తీసుకుని పంపించి

అనంతరం సెల్ఫీ తీసుకుని పంపించిన కొందరు అభిమానుల ఇళ్లను సందర్శించి వారితో ముచ్చటించి సాయంత్రం ఐదు గంటలకు వేదిక వద్దకు ఊరేగింపుగా బయలుదేరుతారు. అభిమానుల కోలాహలంతో సందడిగా సాగనున్న ఈ కార్యక్రమంలో చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి సీరియల్​ నుంచి లక్ష్మీ (మాహి గౌతమి), మిత్ర (రఘు) , కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్​ నుంచి కనకమహాలక్ష్మి (యుక్త మల్నాడ్​), విష్ణు విహారి (జైధనుష్​)తో పాటు ఇతర నటీనటులు పాల్గొని సందడి చేయనున్నారు.

నేరుగా పలకరించే అవకాశం

అంతేకాదు, ఈ వేదిక నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్​, సింగర్​ పల్సర్​ బైక్​ రమణ, డ్రామా జూనియర్స్​ ప్రేక్షకులను అలరించనున్నారు. బుల్లితెరపై నటనతో అలరిస్తున్న జీ తెలుగు తారలు తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చేస్తున్నారు. మరి మీరూ జీ తెలుగు నిర్వహిస్తున్న మెగా ఈవెంట్​ జీ తెలుగువారి పెళ్లిసందడి కార్యక్రమంలో పాల్గొని మీ అభిమాన తారలను నేరుగా పలకరించే అవకాశం పొందండి.

Whats_app_banner