మార్గశిర మాసం విశిష్టత: బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారిచే
మార్గశిర మాసం విశిష్టత: బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారిచే
“మాసానాం మార్గశీర్షోహం” అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పేర్కొన్నారు. ఈ నెల విశిష్టతను గూర్చి చర్చిస్తే, అది కాలానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన విశేషతను తెలియజేస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
హిందూపురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైన, శ్రద్ధతో నిర్వహించే మాసాలలో ఒకటి మార్గశిర మాసం. సాధారణంగా ఈ మాసం ప్రతి ఏడాది నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో వస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాలు, వ్రతాలు, పూజలు వంటి భక్తి కార్యక్రమాలకు మార్గశిర మాసంలో ప్రాముఖ్యత ఎక్కువ. మార్గశిర మాసం విశిష్టతో పాటు ఈ మాసంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలో తెలుసుకుందాం.
మార్గశిర మాస విశిష్టత:
“మాసానాం మార్గశీర్షోహం” అని శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో పేర్కొన్నారు. ఈ నెల విశిష్టతను గూర్చి చర్చిస్తే, అది కాలానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన విశేషతను తెలియజేస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మార్గశిర మాసం శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం. ఈ నెలలో శ్రీకృష్ణ పరమాత్మ తన స్వరూపాన్ని ప్రతిపాదించి, మాసాలలో అగ్రగామిగా మార్గశిర మాసాన్ని పేర్కొన్నారు. ఈ మాసంలో పుష్యమాసం తరువాత ప్రారంభమయ్యే ఉత్తరాయణం ముందు భాగంగా ఇది బ్రాహ్మీ ముహూర్తానికి సమానం.
మార్గశిర మాసంలో చేయాల్సిన వ్రతాలు, పూజలు:
ఈ మాసంలో విశేషమైన పర్వదినాలు ఉంటాయి:
• మార్గశిర శుద్ధ తదియ: ఉమామహేశ్వర వ్రతం.
• మార్గశిర పంచమి: నాగపంచమి.
• మార్గశిర షష్ఠి: సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం.
• కాల భైరవాష్టమి: కాలభైరవుని ఆరాధన.
• మోక్షద ఏకాదశి: భగవద్గీత జన్మదినం, వైకుంఠద్వార ప్రవేశం విశేషం.
• దత్తజయంతి: దత్తాత్రేయుని అవతరణ.
లక్ష్మీ పూజ:
సాధారణంగా గురు వారం లక్ష్మీ పూజకు చాలా అనువైన రోజు. అయితే ఈ మాసంలోని వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి మరింత ప్రత్యేకమట. ఈ రోజుల్లో ఆమె ఆరాధన సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం.
ధనుర్మాసం ప్రాముఖ్యత:
విష్ణువు ప్రీతికరమైన ధనుర్మాసం ఈ మాసంలో ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున స్నానం చేసి, జపం, ధ్యానం చేయడం అనాది నుండి ఆచారంగా వస్తోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నందవ్రజ గోపికలు:
వారి ఆదర్శంతో మార్గశిర మాసంలో ఆచరించబడే వ్రతాలు భగవంతుడిని చేరుకోవడానికి మార్గదర్శకం.
మార్గశిర మాసం విశిష్టత:
ఈ మాసం సాక్షాత్ విష్ణుస్వరూపం. దీని ప్రత్యేకతలు సాంప్రదాయాల పరంగా మాత్రమే కాక, ఆధ్యాత్మికంగా కూడా చాలా గొప్పవి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కేశవ నామస్మరణతో ఆరాధన:
మార్గశిరంలో కేశవ నామంతో విష్ణుమూర్తిని ఆరాధించడమే ముఖ్య ధర్మం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.