Margashira Pournami: మార్గశిర పౌర్ణమి ఎప్పుడు? లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఆ రోజు ఏం చేయాలి?
Margashira Pournami: ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ. ఈ పౌర్ణమి రోజున విష్ణువును, లక్ష్మీదేవిని, చంద్రదేవుడిని పూర్తి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సుఖసంతోషాలు, ధనధాన్యాలు చేకూరుతాయని విశ్వాసం.
పౌర్ణమి తిథి ప్రతి నెలా ఒకసారి వస్తుంది. కానీ ఆయా మాసాల ప్రకారం పౌర్ణమి తిథి విశిష్టత మరింత పెరుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రాముఖ్యత ఎక్కువ.హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాది చివర్లో వచ్చే పౌర్ణమి కనుక దీనకి ప్రాముఖ్యత ఎక్కువ అని నమ్ముతారు.మార్గశిర పౌర్ణమి లక్ష్మీదేవికి పూజకు అంకితం. ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణువు, చంద్ర భగవానులను పూర్తి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సుఖసంతోషాలు, ధనధాన్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వస్తుంది. తేదీ, ముహూర్తంతో పాటు పూజా విధానం గురించి తెలుసుకుందాం.
మార్గశిర పౌర్ణమి తిథి,శుభ ముహూర్తం:
పంచాంగం ప్రకారం..ఈ సారి మార్గశిర్ష మాసంలో పౌర్ణమి తిథి డిసెంబర్ 14 సాయంత్రం 04:58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 15 మధ్యాహ్నం 02:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు. కనుక ఉదయ తిథి ప్రకారం.. మార్గశిర పౌర్ణమి పండుగను డిసెంబర్ 15న జరుపుకుంటారు.
పౌర్ణమి రోజు పూజా విధి
ఈ పవిత్రమైన రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. పవిత్ర నదుల్లో స్నానమాచారించడం మంచిది. ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. ఉపవాసం చేస్తే చాలా మంచిది. గంగా జలంతో దేవతలందరికీ అభిషేకం చేయాలి.ఈ రోజు మహావిష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత కనుక విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించాలి. తులసి లేకుండా విష్ణు పూజ చేయకూడదు. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి సమర్పించాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిది. ఇంటి చుట్టుపక్కన ఆవు ఉంటే వాటికి ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల అనేక రకాల లోపాల నుంచి బయట పడొచ్చు.
పౌర్ణమి రోజున చేయవలసిన పరిహారాలు:
పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అమ్మవారి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురుకావు. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి సంపదకి అధిదేవత. ఆమె అనుగ్రహం పొందితే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. సంపద పెరుగుతుంది. ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. పౌర్ణమి రోజు ఇలా చేశారంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి
లక్ష్మీదేవి ఆరాధన:
పౌర్ణమి పర్వదినాన విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు వెదజల్లే ధూపం, గులాబీ పువ్వులు సమర్పించాలి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో డబ్బుకి సంబంధించి సమస్యలు రావు. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి ఖీర్ అంటే చాలా ఇష్టం.
గంగానదిలో స్నానం చేయడం:
మార్గశిర పౌర్ణమి రోజు పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా లోకానికి అధిపతి అయిన విష్ణుమూర్తి గంగానది నీటిలో నివసిస్తాడని ప్రతీతి. అందుకే మార్గశిర్ష పౌర్ణమి రోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మార్గశిర్ష పౌర్ణమి రోజున చంద్ర భగవానుడిని, లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం చేయాలని నియమం ఉంది. అందుకే మార్గశిర్ష పౌర్ణమి రోజున గంగా స్నానం చేస్తారు.