వేరుశెనగ అన్ని సీజన్లలో తింటారు. కానీ శీతాకాలంలో తింటే మరికొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటో ఇక్కడ చూసేద్దాం..

Unsplash

By Anand Sai
Dec 02, 2024

Hindustan Times
Telugu

వేరుశెనగ శీతాకాలపు ఆహారం కాబట్టి.. చలికాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Unsplash

మీరు రోజుకు 100 గ్రాముల వేరుశెనగ తింటే, మీ శరీరానికి రోజూ కావాల్సిన పోషకాలు చాలా వరకు ఇందులో లభిస్తాయి. అందుకే దీన్ని పేదవాడి బాదం అంటారు.

Unsplash

చల్లని వాతావరణంలో ఎముకల ఆరోగ్యం కొద్దిగా ప్రభావితమవుతుంది. వేరుశెనగ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, శీతాకాలంలో ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Unsplash

వేరుశెనగను మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. వేరుశెనగ బరువు నియంత్రణకు, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.

Unsplash

చలికాలంలో చర్మం పొడిబారుతుంది. వేరుశెనగలోని కొవ్వు పదార్థం చర్మాన్ని అంతర్గతంగా పోషించి చర్మ కాంతిని పెంచుతుంది.

Unsplash

ప్రతిరోజూ వేరుశెనగ తినడం మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు చాలా చురుకుగా మారుతుంది.

Unsplash

వేరుశనగలోని పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఉడికించిన వేరుశెనగ వారికి ఇవ్వండి.

Unsplash

రోజూ పాలను మరిగించి చల్లార్చిన తర్వాత వచ్చే మీగడను తీసి పాత్రలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

Photo Source From unsplash