Saturn Venus Conjunction: శుక్రుడు శని గ్రహాల కలయిక, ఈ రాశుల వారిపై కాసుల వర్షం
Saturn Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, శుక్రుడు స్నేహపూర్వకమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు శుభాన్ని సూచిస్తాయి.శని భగవానుడు కర్మ ఫలితాలను అందించగా, శుక్రుడు సంపదనిచ్చే దేవుడు. ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
వేదాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు, శని అతి ముఖ్యమైన,స్నేహపూర్వకమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు శుభాన్ని, సానుకూలతనూ సూచిస్తాయి. శని భగవానుడు కర్మఫలితాలను అంటే వ్యక్తి చేసిన పనులను బట్టి వారికి ప్రతిఫలాన్ని సంపదను ఇస్తాడు. అలాగే శుక్రుడు అందం, విలాసం, సంపద, ప్రేమ, అదృష్టాన్నిచ్చే గ్రహం. శుక్రుడు సంచరిస్తున్న రాశుల వారికి ఆ రోజుల్లో కచ్చితంగా శుభమే కలుగుతుంది. అతాగనే శని వ్యక్తుల మంచి ఆలోచనలకు ప్రతిబింబంగా నిలుస్తాడు. ఈ రెండు శుభ గ్రహాల కలయిక అన్ని రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పంచాంగం ప్రకారం ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 28న కలవబోతున్నాయి.ఈ కలయిక సమయంలో కొన్ని రాశుల వారిపై కాసుల వర్షం కచ్చితంగా కురుస్తుంది.

మేష రాశి:
శని శుక్ర గ్రహాల కలయిక సమయంలో మేష రాశి వారికి శుక్రుడు 10వస్థానంలో, శని 11వ స్థానంలో ఉంటారు. ఇది వీరికి చాలా లాభదాయకమైన సమయం. ఈ సమయంలో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని రంగాల్లో విజయాన్ని చూస్తారు. అనుకున్న దానికంటే సులువుగా డబ్బు దొరుకుతుంది. వ్యాపారాలు మరింత లాభదాయకంగా నడుస్తాయి. అప్పుల బాధ తీరుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
కన్యా రాశి:
శని, శుక్ర గ్రహాల కలయిక సమయంలో కన్యా రాశి వారికి శుక్రుడు 5వ స్థానంలో, శని 6వ స్థానంలో ఉంటారు. ఇది ఈ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా తీరే సమయం ఇది. ఉద్యోగార్థులు ఆశించిన లాభాలు పొందుతారు. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఈ సమయంలో నెరవేరతాయి. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మకర రాశి:
శని, శుక్రుడి కలయిక సమయంలో మకర రాశి వారికి శుక్రుడు 1వ స్థానంలో, శని 2వ స్థానంలోనూ ఉంటారు. ఇది ఈ రాశుల వారికి శుభ సమయం. కొన్ని రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ పర్యటనలు మీకు బాగా కలిసి వస్తాయి. ఉపాధి, ఉద్యోగాలు కూడా లాభసాటిగా సాగుతాయి. పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి కుదురుతుంది. శుభ వార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.