NNS 27th November Episode: అమర్​ని చంపేందుకు ఉగ్రవాదుల కుట్ర.. అంజుపై ప్రిన్సిపల్​ పంతం.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​!-zee telugu serial nindu noorella saavasam today 27th november episode nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 27th November Episode: అమర్​ని చంపేందుకు ఉగ్రవాదుల కుట్ర.. అంజుపై ప్రిన్సిపల్​ పంతం.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​!

NNS 27th November Episode: అమర్​ని చంపేందుకు ఉగ్రవాదుల కుట్ర.. అంజుపై ప్రిన్సిపల్​ పంతం.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​!

Hari Prasad S HT Telugu
Nov 27, 2024 01:51 PM IST

NNS 27thNovember Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (నవంబర్ 27) ఎపిసోడ్లో అమర్ ని చంపడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తుంటారు. పిల్లలను కిడ్నాప్ చేయడానికి స్కూల్ కు వెళ్తారు. తర్వాత ఏం జరిగిందంటే..

అమర్​ని చంపేందుకు ఉగ్రవాదుల కుట్ర.. అంజుపై ప్రిన్సిపల్​ పంతం.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​!
అమర్​ని చంపేందుకు ఉగ్రవాదుల కుట్ర.. అంజుపై ప్రిన్సిపల్​ పంతం.. మనోహరి కొత్త ప్లాన్​​​​​​!

NNS 27th November Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (నవంబర్ 27) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమ్ముతో మాట్లాడాలని తన రూమ్​కి రమ్మంటుంది ప్రిన్సిపల్​. ప్రిన్సిపల్‌ రూంలోకి వెళ్లిన అమ్ము కోసం పిల్లలు బయట ఎదురు చూస్తుంటారు. ఇంతలో రామ్మూర్తి వచ్చి ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతాడు. అమ్ము కోసం అని చెప్తారు.

టెన్షన్‌లో అంజు

అయితే అంజు పాప ఏంటి అలా తిరుగుతుంది అని అడుగుతాడు. ఎందుకు టెన్షన్‌ పడుతుంది అని అడగ్గానే.. అంజు చేసిన తప్పులను చెప్పడానికి అమ్మును మేడం పిలిచిందని అంటారు. అంజు పాప అంత పెద్ద తప్పులు చేయదని అంటాడు రామ్మూర్తి. దీంతో ఆనంద్‌, ఆకాష్‌ నవ్వుతూ అంజు నువ్వు ఉదయం నుంచి చేసిన తప్పులు చేయ్‌ అని చెప్పగానే అంజు ఆరోజు చేసిన తప్పులు మొత్తం చెప్తుంటే రామ్మూర్తి షాక్‌ అవుతాడు.

ఒక్కరోజు ఇన్ని తప్పులు చేశావా..? అంటాడు. ఇంతలో అమ్ము వస్తుంది. అంజు కంగారుగా అమ్ము మేడం ఎవరిని తీసుకురమ్మంది. మిస్సమ్మనా..? డాడీనా చెప్పు అంటుంది. ఎవరినీ కాదు. ఎక్స్‌ కర్షన్‌ కు వెళ్లాలట అదే చెప్పడానికి పిలిచింది అని చెప్తుంది అమ్ము. దీంతో పిల్లలు అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

అమర్‌పై దాడికి ఉగ్రవాదుల ప్లాన్

గార్డెన్‌ లో కోపంగా ఆరు అటూ ఇటూ తిరుగుతుంది. గుప్త వచ్చి ఏమిటి బాలిక నువ్వు ఇంకా ఆ సాంబ్రాణి దూపం వద్దే ఆగితివా..? అని అడుగుతాడు. ఆరు కోపంగా చూస్తుంది. ఇంతలో రాథోడ్‌ ఏదో ఫైల్‌ తీసుకుని వస్తాడు. గుప్త గారు.. రాథోడ్‌ అంత కంగారుగా ఫైల్‌ తీసుకుని వెళ్తున్నాడేంటి చూద్దాం రండి అంటుంది ఆరు. అ చూద్దాం ఎవరు ఏ పని చేస్తున్నారో ఎక్కడ ఏమీ జరుగుతుందో వీక్షించడం తప్పా మాకేమీ పని లేదనుకుంటివా..? అంటాడు గుప్త. మరోవైపు లోపలికి వెళ్లిన రాథోడ్‌ ఫైల్‌ అమర్‌కు ఇస్తాడు. ఫైల్‌ చూసిన అమర్‌ సీరియస్‌గా రాథోడ్‌ మన వాళ్లతో మాట్లాడాలి అంటాడు. అందరినీ హాల్లోకి పిలుస్తాడు. ఆరు గుమ్మం దగ్గరకు వచ్చి వింటుంది.

ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని మీరెవ్వరూ కంగారు పడరని చెప్తున్నాను అంటాడు అమర్‌. అసలు విషయం ఏంటో చెప్పు అమర్‌ అని అడుగుతాడు శివరాం. దీంతో స్కూల్‌ లో పిల్లల మీద అటాక్‌ జరిగిన విషయం మీకు తెలుసు కదా..? వాళ్లే ఇప్పుడు మన మీద అటాక్‌ చేయబోతున్నారని సమాచారం వచ్చింది. దీంతో నిర్మల భయంగా అయ్యో భగవంతుడా.. వినాయక చవితి రోజు గండం నుంచి బయటపడ్డామని ఆనంద పడే లోపే మళ్లీ ఇంకొక గండమా అంటుంది. దీంతో శివరాం కోపంగా ఏయ్‌ నోర్మూయ్‌.. అమర్‌ ఇప్పుడే చెప్పాడు కదా భయపడొద్దని. చూడండి మనలో ఎవరు భయపడినా అమర్‌ ధైర్యం కోల్పోయేలా చేసి శత్రవుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అంటాడు.

దీంతో మా గురించి మాకు ఏ భయం లేదు మామయ్యా. నా భయం ఆయన గురించే.. మమ్మల్ని కాపాడుతూ వాళ్లను ఎదుర్కొంటే ఆయనకు ఏమైనా అవుతుందేమోనన్న భయం. ఆయనకు ఏమైనా అయితే ఈ ఇంట్లో ఆయన కాపాడిన ఏ ఒక్కప్రాణం నిలవదు మామయ్యా అంటూ ఎమోషనల్‌ అవుతుంది మిస్సమ్మ. దీంతో నాకేం కాదు మిస్సమ్మ.. రాథోడ్‌ స్కూల్‌ కు వెళ్లి పిల్లలను తీసుకునిరా..? సెక్యూరిటీ టీం వచ్చే వరకు ఎవ్వరూ బయటకు వెళ్లొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు అమర్‌.

పిల్లల కోసం స్కూల్‌కు తీవ్రవాదులు

అంతా విన్న ఆరు గుప్త దగ్గరకు పరుగెత్తుకెళ్లి మాయ పేటిక ఇవ్వమని అడుగుతుంది. అది ఇస్తే ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో కనిపెడతానని అడుగుతుంది. దీంతో గుప్త ఇరిటేటింగ్‌ గా ఫీలవుతూ తనలో తాను మాట్లాడుకుంటాడు. ప్రభూ మీకిప్పుడు సంతోషంగా ఉన్నదా..? రోజు రోజుకు నా శిరోభారము పెరిగిపోతున్నది ప్రభు. మరికొన్ని రోజులు నేను ఇచ్చటనే ఉన్నచో మతిస్థిమితం కోల్పోయెదను అంటాడు. ఆరు పిలిచినా పలకకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తీవ్రవాదులు స్కూల్‌ దగ్గరకు వచ్చి అమర్‌ పిల్లలను కిడ్నాప్‌ చేయడానికి వెళ్తారు. స్కూల్‌ బయట కారులో కూర్చుని ఉన్న అంజును మాత్రమే ఎత్తుకెళ్లాలని డిసైడ్‌ అవుతారు. ఒకణ్ని పంపించి సెకండ్‌ క్లాస్‌ లో ఉన్న అమర్‌ చిన్న కూతురును తీసుకురాపో అని చెప్తాడు. సరేనని అతను వెళ్తాడు. గేటు దగ్గర ఉన్న రామ్మూర్తి ఆపి.. మీకు ఎవరు కావాలో చెప్పండి నేనే వెళ్లి అమ్మాయిని తీసుకొస్తాను అంటాడు. ఆ వ్యక్తి రామ్మూర్తిని తిట్టి లోపలికి వెళ్తాడు. లోపల ప్రిన్సిపాల్‌ అమ్మును ఎక్స్‌ కర్షన్‌ లో ఎలా ఇరికించాలని ఆలోచిస్తుంది. ఇంతలో అంజు ప్రిన్సిపాల్ దగ్గరకు వస్తుంది. ఎక్స్‌ కర్షన్‌ కు తమను ఎందుకు తీసుకెళ్లడం లేదని అడుగుతుంది. ప్రిన్సిపాల్‌ అంజును తిట్టి పంపిచేస్తుంది.

స్కూల్‌ లోపలికి వచ్చిన తీవ్రవాది అంజును చూసి బాస్‌కు ఫోన్‌ చేసి పాప కనిపించిందని చెప్తాడు. ఒకతను వచ్చి సిక్త్‌ క్లాస్‌ రూం అడ్రస్‌ అడగ్గానే అతనికి అడ్రస్‌ చెప్తుండగానే అంజు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అమర్‌ ఇంటికి సెక్యూరిటీ వస్తుంది. పొజిషన్‌ తీసుకుంటారు. అమర్​ ఉగ్రవాదుల దాడిని అడ్డుకుంటాడా? పిల్లల్ని అమర్​ టీమ్​ ఎలా కాపాడుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు నవంబర్​ 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner