NNS November 28th Episode: మనోహరికి అమర్ వార్నింగ్​- స్కూల్‌లో అంజు కిడ్నాప్​- కాపాడిన రామ్మూర్తి- కీడు శంకించిన గుప్త!-nindu noorella saavasam serial november 28th episode amar warns manohari anju kidnap zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns November 28th Episode: మనోహరికి అమర్ వార్నింగ్​- స్కూల్‌లో అంజు కిడ్నాప్​- కాపాడిన రామ్మూర్తి- కీడు శంకించిన గుప్త!

NNS November 28th Episode: మనోహరికి అమర్ వార్నింగ్​- స్కూల్‌లో అంజు కిడ్నాప్​- కాపాడిన రామ్మూర్తి- కీడు శంకించిన గుప్త!

Sanjiv Kumar HT Telugu
Nov 28, 2024 11:43 AM IST

Nindu Noorella Saavasam November 28th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 28 ఎపిసోడ్‌‌లో ఆర్మీ సెక్యురిటీ అంతా అమర్ ఇంటికి రక్షణగా ఉంటారు. తనవాళ్లందరిని ఇంట్లో ఉండమని సెక్యూరిటీ చెప్పగానే మిస్సమ్మ తల్లిదండ్రులను కూడా పిలవమని చెబుతాడు. మరోవైపు అంజును అరవింద్ మనిషి వినోద్ కిడ్నాప్ చేస్తాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 28 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 28 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 28th November Episode)లో అమర్​కి ప్రాణాపాయం ఉందనే సమాచారం రాగానే సెక్యూరిటీ వాళ్లు అమర్‌ ఇంటికి వచ్చి అందరూ పొజిషన్‌ తీసుకుంటారు. మీ పిల్లలను మీకు కావాల్సిన వాళ్లను ఇక్కడికే పిలిపించండి సార్‌ అని చెప్తారు. సరే అంటాడు అమర్‌.

ఇంతలో మనోహరి ఇంత మంది సెక్యూరిటీగా వచ్చారంటే థ్రెట్‌ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది అంటుంది. ఇంతలో మా గురించి ఆలోచించకండి మేం బాగానే ఉన్నాము. మీ ఫోకస్‌ అంతా వాళ్లను పట్టుకోవడం మీద పెట్టండి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన వాళ్లకు శిక్ష పడాలి. ఆ పని మీరు మాత్రమే చేయగలరు అంటుంది మిస్సమ్మ. ఒక్కప్పుడు అమర్‌ ధైర్యం అరుంధతి. ఇప్పుడు నువ్వే మిస్సమ్మ అంటుంది నిర్మల.

ఈ ముసలివాళ్లను చంపేస్తే బాగుండు

చెట్టు చాటు నుంచి చూస్తున్న అరుంధతి, గుప్త హ్యాపీగా ఫీలవుతారు. ఆ వచ్చే టెర్రరిస్టులు ఈ ముసలివాళ్లను చంపేస్తే బాగుండు. దీన్ని దాంతో పోల్చి అమర్‌ మనసులో ప్రేమ పుట్టేలా చేసేలా ఉన్నారు అని మనోహరి మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ మీ నాన్న వాళ్లకు కాల్‌ చేసి వెంటనే ఇంటికి రమ్మను అని అమర్‌ అంటాడు.

దాంతో ఆ స్లమ్‌‌లో ఉన్నవాళ్లు మనకు కావాల్సిన వాళ్లు అని అస్సలు నమ్మరు. ఇలాంటప్పుడు అలాంటి వాళ్లను ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు..? అంటుంది మనోహరి. దానికి అమర్ కోపంగా అలాంటి వాళ్లు అంటే ఎలాంటి వాళ్లు మనోహరి. వాళ్లు నా వాళ్లు. ఆయన నా మామయ్య, ఆవిడ ఆయన భార్య. వాళ్లు ఎక్కడున్నా ఎలా ఉన్నా..? నా వాళ్లే అంటాడు అమర్‌.

నువ్వు తప్పుగా అనుకున్నావు అమర్‌‌ అంటుంది మనోహరి. ఎలా అనుకున్నా ఇంకోసారి వాళ్లను తక్కువ చేసి మాట్లాడకు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు అమర్‌. ఆరు పరుగెత్తుకుంటూ గుప్త దగ్గరకు వచ్చి జరిగేది చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. నాకోసం ఒక్కసారి మాయా పేటికను తెరవండి అని రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో గుప్త జరిగేది విధి లిఖితం. అది ముందే తెలుసుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఇంకోసారి ఆ మాయా పేటిక గురించి నాతో మళ్లీ మాట్లాడొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు గుప్తా.

వెంటనే రండి నాన్నా

మిస్సమ్మ, రామ్మూర్తికి ఫోన్‌ చేసి మీరు, పిన్ని అర్జెంట్‌‌గా ఇంటికి రండి అని చెప్తుంది. దీంతో రామ్మూర్తి ఏంటమ్మా.. ఏమైంది ఏదైనా సమస్యా అని అడుగుతాడు. నాన్నకు విషయం చెబితే కంగారు పడతారు అని మనసులో అనుకుని ఏం లేదు నాన్నా.. వెంటనే మీరు ఇంటికి రండి అంటుంది భాగీ. వెంటనే అంటే సాయంత్రం రావొచ్చా అమ్మా అంటూ రామ్మూర్తి అడగ్గానే లేదు నాన్నా వెంటనే రండి అని చెప్తుంది. రామ్మూర్తి సరే అంటాడు.

అమ్మాయి వెంటనే రమ్మంటుంది. ఈ ప్రిన్సిపాల్‌ గారు పర్మిషన్‌ ఇస్తారో లేదోనని అనుకుంటూ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తాడు రామ్మూర్తి. స్కూల్‌ లోపలికి వెళ్లిన అరవింద్‌ మనిషి అంజు కోసం వెతుకుంటాడు. రామ్మూర్తి ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్లి అర్జెంట్‌‌గా పని పడింది. వెంటనే ఇంటికి వెళ్లాలి. రేపు వచ్చి అన్ని పనులు చేస్తాను అని అడుగుతాడు. దీంతో ప్రిన్సిపాల్‌ తిడుతూ.. ఎన్నిసార్లు చెప్పాలి మీరు ఇలా అడగొద్దని అంటుంది.

ఎంతో అవసరం ఉంటేనే కదా మేడమ్ అడిగేది అంటాడు రామ్మూర్తి. సరే అయితే వెళ్లండి. పర్మినెంట్‌‌గా వెళ్లిపోండి. ఉద్యోగంలోంచి తీసేస్తాను అంటుంది ప్రిన్సిపాల్. దీంతో రామ్మూర్తి సరేలే మేడమ్ ఏమీ వద్దు అంటూ గేటు దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు రామ్మూర్తి. మరోవైపు అంజలి క్లాస్‌ రూం దగ్గరకు వెళ్లిన అరవింద్ మనిషి టీచర్‌‌ను అడిగి అంజలిని అమరేంద్ర సార్‌ తీసుకురమ్మన్నారు అని చెబుతాడు.

డాడీకి కంప్లైంట్ ఇచ్చిందేమో

దాంతో అంజలిని తీసుకుని వెళ్తాడు అరవింద్ మనిషి. అంజలి కూడా ఆ వ్యక్తితో వెళ్తుంది. నేను డాడీతో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అంకుల్‌ అని అడుగుతుంది. దీంతో అతను నేను రీసెంట్‌‌గా జాయిన్‌ అయ్యాను అని చెప్తాడు. ఇంతలో అంజు డౌటుగా మా రాక్షసి ప్రిన్సిపాల్‌ డాడీకి కంప్లైంట్‌ ఇచ్చేందేమో అందుకే తీసుకురమ్మాన్నారేమో అనుకుని ఆగిపోతుంది.

మరోవైపు స్కూల్‌ దగ్గరకు వచ్చిన రాథోడ్‌, రామ్మూర్తిని చూసి సార్‌ ఏంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటాడు. దగ్గరకు వెళ్లి ఏంటి సార్‌ మీరు ఇక్కడ ఉన్నారు అని రాథోడ్ అడగ్గానే రామ్మూర్తి కంగారుగా ఈ విషయం ఎవరితో చెప్పొద్దని రిక్వెస్ట్‌ చేస్తాడు. అయినా ఈ టైంలో నువ్వు స్కూల్‌‌కు వచ్చావేంటి..? అని అడుగుతాడు. పిల్లల్ని అర్జెంట్‌‌గా తీసుకెళ్లడానికి వచ్చానని రాథోడ్ చెప్పగానే అవును అమ్మాయి నన్ను కూడా అర్జెంట్‌‌గా ఇంటికి రమ్మని చెప్పింది.

ఎందుకు అని అడగ్గానే ఏమీ లేదు సార్‌ అంటూ లోపలికి వెళ్తాడు రాథోడ్. ముగ్గురు పిల్లలను తీసుకుని అంజు క్లాస్‌ రూం దగ్గరకు వెళ్లగానే టీచర్‌ ఇప్పుడే ఒకతను వచ్చి తీసుకెళ్లాడని చెప్తుంది. దాంతో రాథోడ్‌ అంజు కోసం వెతుకుతుంటాడు. అంజును తీసుకుని వెళ్తున్న వినోద్‌ను చూసిన రామ్మూర్తి వెళ్లి వాణ్ని పట్టుకుంటాడు. ఇంతలో రాథోడ్‌ వస్తాడు. అందరూ కలిసి వినోద్‌‌ను కొడుతుంటే పారిపోతాడు.

కీడును శంకించిన గుప్తా

మరోవైపు గుప్త ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. మనసు ఏదో కీడును శంకించుచున్నది ఏదో జరగబోవుచున్నది సమయమునకు ఈ బాలిక కూడా లేదు. ఇదే మంచి సమయము. మాయా దర్పణమున వీక్షించి ఏం జరగుతుందో తెలుసుకోవలెను అనుకుంటాడు గుప్త. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner