South Central Railway : శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. అయ్యప్ప భక్తులు ఏమంటున్నారు? వీడియో..-what do ayyappa devotees say about special trains to sabarimala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  South Central Railway : శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. అయ్యప్ప భక్తులు ఏమంటున్నారు? వీడియో..

South Central Railway : శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. అయ్యప్ప భక్తులు ఏమంటున్నారు? వీడియో..

Basani Shiva Kumar HT Telugu
Nov 28, 2024 11:05 AM IST

South Central Railway : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు వెళ్తుంటారు. వారిలో ఎక్కువమంది రైళ్లలో ప్రయాణిస్తారు. అయ్యప్ప భక్తుల రద్దీకి తగ్గట్టు రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్ల గురించి అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమలకు ప్రత్యేక రైళ్లు

శబరిమలకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అనేకమంది భక్తులు చాలాసార్లు అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎక్కువమంది ట్రైన్లలో ప్రయాణించడానికి ప్రాధాన్యత ఇస్తారు. గతంలో కంటే ఎక్కువమంది శబరిమల వెళ్తుండటంతో.. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌పై అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'గతంలో కేవలం డిసెంబర్, జనవరి నెలలో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండేవి. అవికూడ పరిమిత సంఖ్యలో ఉండేవి. కొన్ని స్టేషన్ల నుంచి మాత్రమే నడిపేవారు. కానీ.. ఇప్పుడు చాలా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు. రైళ్లు కూడా శుభ్రంగా ఉంటున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నాము. సౌత్ సెంట్రల్ రైల్వేకు కృతజ్ఞతలు' అని ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 62 సర్వీసులను శబరిమలకు నడుపున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, కాచిగూడ, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లం, కొట్టాయంలకు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వెల్లడించింది.

శబరిమల యాత్రికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే 18 శబరిమల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

1. రైలు నెం. 07133 : కాచిగూడ నుంచి కొట్టాయం - డిసెంబర్ 5, 12, 19 & 26 తేదీల్లో

2. రైలు నెం. 07134 : కొట్టాయం నుంచి కాచిగూడ - డిసెంబర్ 6, 13, 20 & 27 తేదీల్లో

3. రైలు నెం.07135 : హైదరాబాద్ నుంచి కొట్టాయం - డిసెంబర్ 3, 10, 17, 24 & 31 తేదీల్లో

4. రైలు నెం.07136 : కొట్టాయం - హైదరాబాద్ - డిసెంబర్ 4, 11, 18 & 25, జనవరి 1వ తేదీలో

1. రైలు నం. 07133/07134 : కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ (08 సేవలు) :

ఈ ప్రత్యేక రైళ్లు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, పోడన్, తిరుప్పూర్‌, పోదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఎర్నాకులం స్టేషన్లలో రెండు మార్గాల్లో ఆగుతాయి.

2. రైలు నెం. 07135/07136 హైదరాబాద్ - కొట్టాయం - హైదరాబాద్ స్పెషల్స్ (10 సర్వీసులు):

ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, యాద్గీర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, జోలార్‌పేటలో ఆగుతాయి. తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో రెండు మార్గాల్లో ఆగుతాయి.

శబరిమల ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విశాఖపట్నం-కొల్లాం, శ్రీకాకుళం రోడ్ - కొల్లాం మధ్య 44 శబరిమల ప్రత్యేక రైళ్లు సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. -

1. 08539- విశాఖపట్నం నుంచి కొల్లాం - 04.12.2024 నుంచి 26.02.2025 వరకు ప్రతి బుధవారం

2. 08540-కొల్లాం నుంచి విశాఖపట్నం -05.12.2024 నుంచి 27.02.2025 వరకు ప్రతి గురువారం

3. 08553-శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం - 01.12.2024 నుంచి 26.01.2025 వరకు ప్రతి ఆదివారం

4. 08554-కొల్లాం నుంచి శ్రీకాకుళం రోడ్డు - 02.12.2024 నుంచి 27.01.2025 వరకు ప్రతి సోమవారం

1. రైలు నెం. 08539/08540 -విశాఖపట్నం - కొల్లాం - విశాఖపట్నం (26 సర్వీసులు):

ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు. నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూరు, పాలక్కాడ్. త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం రోడ్, కొట్టాయం, చెంగనచేరి, తిరువల్ల. చెంగన్నూరు, మావేలికెర కాయంకుళం స్టేషన్‌లలో ఇరువైపులా ఆగుతాయి.

2. రైలు నెం. 08553/08554 -శ్రీకాకుళం రోడ్ - కొల్లాం - శ్రీకాకుళం రోడ్ స్పెషల్స్ (18 సర్వీసులు):

ఈ ప్రత్యేక రైళ్లు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్ పోడన్, తిరుప్పూర్ పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనచేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావేలికెర, కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి.

Whats_app_banner