LIVE UPDATES
Andhra Pradesh News Live November 28, 2024: Visakhapatnam Crime : బాలికలపై అసభ్యకర ప్రవర్తన - ఇద్దరు ఉపాధ్యాయులకు జైలు శిక్ష
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 28 Nov 202405:05 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam Crime : బాలికలపై అసభ్యకర ప్రవర్తన - ఇద్దరు ఉపాధ్యాయులకు జైలు శిక్ష
- బాలికలపై అసభ్యకర ప్రవర్తించిన కేసులో విశాఖపట్నం పొక్సో కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరు ఉపాధ్యాయులకు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.25 వేలు జరిమానా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసు 2019లో నమోదైంది.
Thu, 28 Nov 202412:41 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan Comments on Adani : అదానీని చాలాసార్లు కలిశా.. చంద్రబాబు నాకు సన్మానం చేయాలి: జగన్
- Jagan Comments on Adani : ఏపీలో అదానీ వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై జగన్ తొలిసారి స్పందించారు. అదానీని చాలాసార్లు కలిశానని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కేసులు వేస్తానని హెచ్చరించారు.
Thu, 28 Nov 202411:19 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలివే..!
- Tirumala Tirupati Devasthanam Updates : వచ్చే డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది. డిసెంబర్ 15వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరగనుంది.
Thu, 28 Nov 202410:56 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Police : ఒరేయ్ ఆజాము పరిగెత్త రోయ్.. పోలీస్ డ్రోన్లు వస్తున్నాయ్!
- AP Police : అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు డ్రోన్‌లను అస్త్రంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా అనంతపుం శివారులో పోలీస్ డ్రోన్లను చూసి పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Thu, 28 Nov 202406:54 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Indian Railways : మీరు ప్రయాణిస్తున్న రైలు ఆలస్యంగా నడుస్తుందా.. ఇలా నష్టపరిహారం పొందండి.. 9 ముఖ్యమైన అంశాలు
- Indian Railways : రైలు ప్రయాణం కొన్నిసార్లు విసుగు పుట్టిస్తుంది. దానికి కారణం ఆలస్యంగా నడవటం. అవును.. ఈ సమస్య చాలామంది నిత్యం ఎదుర్కొంటారు. రైళ్ల ఆలస్యం కారణంగా ఎంతోమంది నష్టపోతున్నారు. అయితే.. ట్రైన్ లేట్ కారణంగా నష్టపోయిన వారు ఇలా చేస్తే తగిన పరిహారం పొందొచ్చు.
Thu, 28 Nov 202406:51 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. సాయంత్రం 6 తర్వాత నో వర్క్..
- AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులు పనిచేయాల్సిన అవసరం లేదని, సాయంత్రం 6 తర్వాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
Thu, 28 Nov 202405:35 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: South Central Railway : శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. అయ్యప్ప భక్తులు ఏమంటున్నారు? వీడియో..
- South Central Railway : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు వెళ్తుంటారు. వారిలో ఎక్కువమంది రైళ్లలో ప్రయాణిస్తారు. అయ్యప్ప భక్తుల రద్దీకి తగ్గట్టు రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్ల గురించి అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Thu, 28 Nov 202405:02 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada GGH Doctors: హౌస్ సర్జన్ నిర్వాకం.. డయాలసిస్ రోగికి మరో గ్రూప్ రక్తం ఎక్కించడంతో మృతి చెందిన యువతి
- Kakinada GGH Doctors: హౌస్ సర్జన్ నిర్లక్ష్యం కాకినాడా జిజిహెచ్‌లో యువతి ప్రాణాలను బలి తీసుకుంది. కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉన్న యువతికి ఓ గ్రూపు బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయింది. యువతి ప్రాణాలకు ఖరీదు కట్టిన వైద్యులు రూ.3లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు.
Thu, 28 Nov 202403:58 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool Crime : కర్నూలు జిల్లాలో ఘోరం.. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పరారీలో నిందితుడు
- Kurnool Crime : కర్నూలు జిల్లాలో హోరమైన ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి భర్త హత్య చేశాడు. భార్య శారద (36)ను భర్త రామానాయుడు కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Thu, 28 Nov 202403:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Fengal Cyclone: నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం, దక్షిణకోస్తా, రాయలసీమలకు భారీవర్షాలు
- Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి నుంచి తమిళనాడు వరకు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తమిళనాడులో పరీక్షలు వాయిదా వేశారు. ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
Thu, 28 Nov 202402:16 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena Rajyasabha: రాజ్యసభ రేసులో నాగబాబు, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మంతనాలు, అభ్యర్ధిత్వం కొలిక్కి వచ్చినట్టే..
- Janasena Rajyasabha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలపై స్పష్టత వచ్చింది. నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ కొలిక్కి వచ్చింది. జనసేన తరపున పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది.
Thu, 28 Nov 202401:30 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Discount: హైదరాబాద్, బెంగుళూరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి భారీ డిస్కౌంట్, తగ్గిన ఓఆర్ ఎఫెక్ట్…
- APSRTC Discount: హైదరాబాద్, బెంగుళూరు బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గడంతో హైదరాబాద్, బెంగుళూరు బస్సుల్లో ప్రయాణానికి భారీ డిస్కౌంట్ ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 10 నుంచి 20శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.