PM Modi : ప్రధాని మోదీ హత్యకు ప్లాన్.. ఆయుధాలు కూడా సిద్ధంగా ఉన్నాయని కాల్!-death threat to pm narendra modi mumbai police receive threat call and women arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : ప్రధాని మోదీ హత్యకు ప్లాన్.. ఆయుధాలు కూడా సిద్ధంగా ఉన్నాయని కాల్!

PM Modi : ప్రధాని మోదీ హత్యకు ప్లాన్.. ఆయుధాలు కూడా సిద్ధంగా ఉన్నాయని కాల్!

Anand Sai HT Telugu
Nov 28, 2024 01:19 PM IST

PM Modi : ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు వచ్చిన ఈ ఫోన్ కాల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (Hindustan Times)

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు వచ్చిన ఫోన్ కాల్‌పై దర్యాప్తు జరుగుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఫోన్ కాల్‌పై విచారణ చేస్తున్నారు పోలీసులు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ కాల్ వచ్చింది. అందులో ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే దానిపై మాట్లాడారు. ప్రధాని మోదీని హతమార్చేందుకు ప్లాన్ సిద్ధంగా ఉందని, ఆయుధాలు కూడా రెడీగా ఉన్నాయని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐర్ నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోదీకి హత్య బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో హర్యానాకు చెందిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అయింది. అందులో మోదీని కాల్చివేస్తానని బెదిరించాడు. వీడియోలో యువకుడు తనను తాను హర్యానాకు చెందిన వ్యక్తతిగా పేర్కొన్నాడు. సోనిపట్‌లోని మోహనా గ్రామ నివాసిగా తెలిపాడు. ప్రధాని మోదీ నా ముందుకు వస్తే కాల్చిపారేస్తానని ఆ వీడియోలో చెప్పాడు.

అదేవిధంగా 2022లో కూడా ప్రధాని మోదీకికి వ్యతిరేకంగా జేవియర్ అనే వ్యక్తి నుంచి కూడా ఇలాంటి బెదిరింపులు జరిగాయి. జేవియర్ కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌కు పంపిన లేఖలో మోదీని చంపేస్తానని రాశాడు. మోదీ పరిస్థితి రాజీవ్ గాంధీలా ఉంటుందని అన్నాడు.

దేశ ప్రధానమంత్రి భద్రత బాధ్యత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే SPGపై ఉంటుంది. ప్రధానమంత్రి చుట్టూ ఉన్న మొదటి భద్రతా వలయం ఎస్పీజీ చూసుకుంటుంది. ప్రధాని భద్రతలో నిమగ్నమైన ఈ టీం చాలా స్ట్రాంగ్. సీక్రెట్ సర్వీస్ మార్గదర్శకాల ప్రకారం శిక్షణ ఇస్తారు. వారి వద్ద MNF-2000 అసాల్ట్ రైఫిల్, ఆటోమేటిక్ గన్, 17M రివాల్వర్ వంటి ఆధునిక ఆయుధాలు ఉంటాయి.

Whats_app_banner