Indian Railways : మీరు ప్రయాణిస్తున్న రైలు ఆలస్యంగా నడుస్తుందా.. ఇలా నష్టపరిహారం పొందండి.. 9 ముఖ్యమైన అంశాలు
Indian Railways : రైలు ప్రయాణం కొన్నిసార్లు విసుగు పుట్టిస్తుంది. దానికి కారణం ఆలస్యంగా నడవటం. అవును.. ఈ సమస్య చాలామంది నిత్యం ఎదుర్కొంటారు. రైళ్ల ఆలస్యం కారణంగా ఎంతోమంది నష్టపోతున్నారు. అయితే.. ట్రైన్ లేట్ కారణంగా నష్టపోయిన వారు ఇలా చేస్తే తగిన పరిహారం పొందొచ్చు.
భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రైన్ లేట్ రన్నింగ్. రైళ్లు ఆలస్యంగా నడవటానికి కారణాలు ఏమైనా.. ఎంతోమంది నష్టపోతున్నారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నా.. పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు.
రైళ్లు ఆలస్యంగా నడవటం కారణంగా నష్టపోయిన వారికి పరిహారం వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియక గమ్మున ఉంటారు. ప్రయాణికులు వినియోగదారుల హక్కుల ఫోరంను ఆశ్రయించి.. తగిన కారణం చూపి రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం పొందొచ్చు. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి.
1. ప్రయాణికులు రిజర్వుడు బోగీలో టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణిస్తూ ఉండాలి. జనరల్ టికెట్‌తో ప్రయాణించేవారికి ఈ అవకాశం లేదు.
2.రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడిస్తేనే.. ప్రయాణికులు కేసు వేయడానికి అవకాశం ఉంది.
3.రైలు ఆలస్యానికి కారణాలను ప్రయాణికుడికి ముందుగా లేదా అదే సమయంలో రైల్వే శాఖ తెలియజేస్తే.. ఎలాంటి క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ ఉండదు.
4.వాతావరణంలో మార్పుల కారణంగా రైలు వేగం తగ్గి, ప్రయాణం ఆలస్యమవుతుంది. అప్పుడు ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
5.ఇలాంటి సమయంలో ప్రయాణికుడు వినియోగదారుల హక్కుల ఫోరంను ఆశ్రయించినా ఫలితం ఉండదు.
6.కారణం చెప్పకుంటే న్యాయవాది ద్వారా గానీ.. నేరుగా గానీ ఫోరంలో కేసు ఫైల్ చేయవచ్చు.
7.కేసు ఫైల్ చేసేటప్పుడు రైలు టికెట్‌ను సాక్ష్యంగా సమర్పించాలి.
8.రైలు ప్రమాదాలు, తుపాన్లు, ఇతర కారణాలతో రైలు ఆలస్యమైతే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, టికెట్ డబ్బు తిరిగి చెల్లిస్తారు. అలా చెల్లించకున్నా ఫోరంను ఆశ్రయించవచ్చు.
9.ఇటీవల ఓ ప్రయాణికుడు రిజర్వేషన్ బోగీలో ఢిల్లీ వెళ్తున్నారు. రైలు ఆలస్యం అయ్యింది. దీంతో ఆతను నష్టపోయారు. ఆ ప్రయాణికుడు వినియోగదారుల హక్కుల ఫోరాన్ని ఆశ్రయించారు. కేసు గెలిచాడు. అతనికి రైల్వేశాఖ 60 వేల రూపాయల పరిహారం చెల్లించింది.