Ambani Laddu: అంబానీ లడ్డూ గురించి తెలుసా? తిన్నారంటే ఎంతో బలం, వైరల్ అయిన రెసిపీ-do you know about ambani laddu a very powerful and viral recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ambani Laddu: అంబానీ లడ్డూ గురించి తెలుసా? తిన్నారంటే ఎంతో బలం, వైరల్ అయిన రెసిపీ

Ambani Laddu: అంబానీ లడ్డూ గురించి తెలుసా? తిన్నారంటే ఎంతో బలం, వైరల్ అయిన రెసిపీ

Haritha Chappa HT Telugu
Nov 28, 2024 11:30 AM IST

Ambani Laddu: అంబానీ లడ్డూ రెసిపీ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇప్పుడు ఈ రెసిపీని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.

అంబానీ లడ్డూ రెసిపీ
అంబానీ లడ్డూ రెసిపీ (Instagram/@tastebyishikha)

మీకు లడ్డూ అంటే ఇష్టమా? ఇక్కడ మీకు కొత్త లడ్డూ రెసిపీ ఇచ్చాము. దీని పేరు అంబానీ లడ్డూ. దీనిలో వాడేవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడే డ్రై ఫ్రూట్స్ మనకు ఎలాంటి పోషకాహార లోపాన్ని రాకుండా అడ్డుకుంటాయి. ఇషికా సాహు అనే మహిళ "అంబానీ లడ్డూ" అని పిలిచే ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ క్లిప్ క్షణాల్లో వైరల్ గా మారి 33 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆమె దీన్ని ఎలా తయారు చేస్తుందో ఇక్కడ చూడండి. ఆ రెసిపీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూడండి. మీ అందరికీ ఎంతో నచ్చడం ఖాయం.

అంబానీ లడ్డూ కావల్సినవి

బాదం పప్పులు - అరకప్పు

జీడిపప్పు - అరకప్పు

పిస్తాపప్పు - పావుకప్పు

సీడ్ లెస్ ఖర్జూరం - ఒక కప్పు

ఎండు అప్రికాట్లు - అర కప్పు

అంజీర్ - అర కప్పు

పొద్దుతిరుగుడు గింజలు - రెండు స్పూన్లు

నువ్వులు - రెండు స్పూన్లు

అంబానీ లడ్డూ

  1. స్టవ్ మీద కళాయి పెట్టి బాదం, జీడిపప్పులను మీడియం మంట మీద వేయించాలి. సువాసన వచ్చే వరకు వేయించాలి.
  2. పిస్తాపప్పు కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేసి వేయించాలి. తరువాత తీసి పక్కన పెట్టాలి.

3. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గోరువెచ్చని పాన్ మీద ఖర్జూరం, ఎండబెట్టిన నేరేడు పండ్లు, అంజీర్ పండ్లను వేయాలి.

4. అన్ని పదార్థాలను పూర్తిగా చల్లబరచండి.

5. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అంజీర్లు, ఆప్రికాట్లు, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

6. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాల్లో దాచుకోవాలి. రోజుకో లడ్డూను తింటే ఆరోగ్యానికి మంచిది.

నెటిజన్లు ఎలా రియాక్ట్ అయ్యారు

ఈ అంబానీ లడ్డూ వీడియోల ఇలా పెట్టగానే అలా వైరల్ అయిపోయింది. దీనికి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీక్షకుల నుంచి అనేక సరదా రియాక్షన్స్ వచ్చాయి. 'అక్కా, మీరు ఈ రెసిపీకి బంగారం జోడించడం మర్చిపోయారు' అని ఒక నెటిజన్ చమత్కరించారు. మరో నెటిజన్ 'దీన్ని చేయడానికి మీకు ఎంత అప్పు కావాలి?' అని ప్రశ్నించండి. ఓ నెటిజన్ సరదాగా అడగ్గా, 'నా యాక్టివాకు బదులుగా నాకు ఒక లడ్డూ దొరుకుతుందా?' అని మరొకరు ప్రశ్నించారు.

Whats_app_banner