Kids Teeth: బాటిల్‌తో పాలు తాగే పిల్లలకు భవిష్యత్తులో ఆ వ్యాధులు వచ్చే అవకాశం పెరిగిపోతుందట
Kids Teeth: నోటి అనారోగ్యం వల్ల దంత క్షయం, చిగుళ్ళ వ్యాధులు వంటివి వస్తాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి రోగులతో ముడిపడి ఉంటుంది. అయితే చిన్నప్పుడు బాటిల్ పాలు తాగే పిల్లల్లో పెద్దయ్యాక ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరిగిపోతోంది.
పెద్దలకే కాదు పిల్లలకు కూడా నోటి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కానీ చిన్నపిల్లల నోటి ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు పట్టించుకోరు. ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రెండు మూడేళ్ల వయసు వచ్చిన పిల్లలు మిల్క్ బాటిల్ తో పాలు తాగుతూ ఉంటారు. ఇలా పాల బాటిల్ వాడే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల అప్పుడప్పుడే వచ్చే పాల దంతాలు కూడా పాడయ్యే అవకాశం ఉంది. వారిలో దంత క్షయం, చిగుళ్ళ వ్యాధికి దారితీస్తుంది. ఇలా వదిలేస్తే అవి భవిష్యత్తులో పిల్లల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులతో ముడిపడి ఉంటుంది. పాల డబ్బాలతో పాలు తాగే పిల్లల్లో బేబీ బాటిల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.
బేబీ బాటిల్ సిండ్రోమ్ అంటే
బేబీ బాటిల్ సిండ్రోమ్ నే నర్సింగ్ బాటిల్ సిండ్రోమ్ అని కూడా అంటారు. మిల్క్ బాటిల్ తో పాలు తాగడం వల్ల దంత క్షయం వస్తుంది. దీన్నే బేబీ బాటిల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. పిల్లల నోటి ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడం వల్ల పాల బాటిల్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు పిల్లల చిగుళ్లపై నల్లని గీతలు పడతాయి. మొదటిసారి తెల్లని మచ్చలు కనిపిస్తాయి. కుళ్లిపోయే కొద్దీ మచ్చలు గోధుమ రంగులోకి మారతాయి.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న పిల్లలు రోజుకు చాలాసార్లు బాటిల్ తో పాలు తాగుతారు. చాలాసార్లు రాత్రిపూట కూడా పాల బాటిల్ వారి నోట్లోనే ఉంటుంది. వారు తాగే పాలలో పంచదారను కలిపి తాగిపిస్తారు తల్లిదండ్రులు. తీయని పాలనే ఎక్కువ మంది పిల్లలు తాగేందుకు ఇష్టపడతారు. వారు తాగే పాలలో ఉన్న చక్కెర చాలా వరకు వారి దంతాలకు అతుక్కునే ఉంటుంది. చిన్న పిల్లలు బ్రష్ చేయరు కాబట్టి, ఈ చక్కెర దంతాలకు అతుక్కునే ఉంటుంది. దీని వల్లే మిల్క్ బాటిల్ సిండ్రోమ్ వస్తుంది.
మీ పిల్లవాడు ఆహారం తినేంత వయసుకు వస్తే అతనికి పాల సీసాను ఇవ్వడం మానేయండి. రాత్రి పాలు తాగుతూ పడుకునే అలవాటును మానిపించండి. ఇలా చేయడం వల్ల పిల్లల దంతాలపై చక్కెర పేరుకుపోయి దంతాలను పాడుచేసే బ్యాక్టీరియా పేరుకుపోయి దంతక్షయం, చిగుళ్ల వ్యాధికి కారణమవుతుంది.
దంతాలను శుభ్రం చేసుకోండి
చిన్నపిల్లల పళ్ళు తోముకోరు. వారి లేత దంతాలను బ్రష్ తో రుద్దడం మంచిది కాదు. అటువంటి పరిస్థితిలో, దంతాలపై చిక్కుకున్న చక్కెరను శుభ్రపరచడానికి, బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత, శుభ్రమైన, మృదువైన , పలుచని వస్త్రంతో రోజుకు దంతాలను, చిగుళ్ళను తుడవాలి. దీని వల్ల చక్కెర దంతాలకు అంటుకోదు. కాబట్టి వారికి దంతక్షయం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
సిప్పర్ ఉపయోగించండి
పిల్లవాడు ఒక ఏడాది వయసు దాటిన తరువాత బాటిల్ ఫీడింగ్ కు బదులుగా సిప్పీ కప్పు లేదా గ్లాసును ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు.
టాపిక్