ప్రియురాలిపై అత్యాచారం, శరీరాన్ని 40 ముక్కలు చేసి అడవిలో పడేసిన వ్యక్తి, కుక్క పట్టుకురావడంతో..-jharkhand man rapes kills girlfriend chops body in 40 pieces details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ప్రియురాలిపై అత్యాచారం, శరీరాన్ని 40 ముక్కలు చేసి అడవిలో పడేసిన వ్యక్తి, కుక్క పట్టుకురావడంతో..

ప్రియురాలిపై అత్యాచారం, శరీరాన్ని 40 ముక్కలు చేసి అడవిలో పడేసిన వ్యక్తి, కుక్క పట్టుకురావడంతో..

Anand Sai HT Telugu
Nov 28, 2024 11:07 AM IST

Crime News : జార్ఖండ్‌లో దారుణం జరిగింది. ప్రియురాలిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆపై 40 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. చేతిని కుక్క పట్టుకురావడంతో విషయం బయటకు వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో మహిళను ముక్కలు చేసిన ఘటన మరవకముందే జార్ఖండ్‌లో మరో దారుణం జరిగింది. ప్రియురాలిపై అత్యాచారం చేసి ముక్కలుమక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత ఎవరికీ దొరకకుండా ఉండేందుకు అడవిలోకి తీసుకెళ్లి పడేశాడు. శునకం చేతిని నోట్లో పట్టుకుని రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆరా తీయగా నిందితుడు దొరికాడు.

జార్ఖండ్‌కు చెందిన నరేష్ భేంగ్రా తమిళనాడులో పని చేస్తున్నాడు. అక్కడే 25 ఏళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డాడు. తర్వాత ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం జార్ఖండ్‌కు తిరిగి వచ్చిన నరేశ్ ప్రియురాలికి తెలియకుండా వివాహం చేసుకున్నాడు. అనంతరం కొన్ని రోజులకు తిరిగి మళ్లీ తమిళనాడు వెళ్లాడు. మరోవైపు భార్య ఇంటికి తిరిగిరావాలని నరేశ్‌ను ఒత్తిడి చేసింది. ఇంకోవైపు ప్రియురాలు కూడా కలుద్దామని చెప్పడంతో జార్ఖండ్ రమ్మన్నాడు.

పథకం ప్రకారం ప్రియురాలని తన ఇంటికి సమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి వేచి ఉండమని కోరాడు. ఆ తర్వాత పదునైన ఆయుధాలతో తిరిగి వచ్చాడు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత దుపట్టాతో గొంతు నులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని 40 నుంచి 50 ముక్కలుగా కోసి అడవిలో పడేశాడు. భార్యతో కలిసి ఉండేందుకు ఇంటికి వెళ్లిపోయాడు అని పోలీసులు తెలిపారు.

నిందితుడు నరేష్ భేంగ్రా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన పక్షం రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్దాగ్ గ్రామ సమీపంలో మానవ శరీర భాగాలతో వీధికుక్క కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నరేశ్ ఇంటి సమీపంలోని అడవిలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఖుంటి పోలీసు సూపరింటెండెంట్ అమన్ కుమార్ తెలిపారు.

శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న తర్వాత హత్యకు గురైన మహిళ ఆధార్ కార్డుతో సహా వస్తువులతో కూడిన బ్యాగ్ కూడా అడవిలో దొరికింది. మహిళ తల్లిని సంఘటనా స్థలానికి పిలిపించి తన కుమార్తె వస్తువులను గుర్తించమని అడగ్గా గుర్తించింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి నరేశ్ భేంగ్రా అని తల్లి అనుమానించగా నిందితుడు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికినట్లు నరేశ్ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

Whats_app_banner

టాపిక్