Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- 6 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్-today ott release movies telugu on netflix zee5 aha etv win movie ka lucky bhaskar sandeham vikatakavi ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- 6 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- 6 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్

Sanjiv Kumar HT Telugu
Nov 28, 2024 03:13 PM IST

Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఆరు తెలుగులో స్ట్రీమింగ్ కానుండగా.. అందులో చూడాల్సినవిగా 6 సినిమాలు తెలుగులో ఉన్నాయి. అందులో వంద కోట్ల క్రైమ్ థ్రిల్లర్, డిటెక్టివ్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఉన్నాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- 6 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- 6 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఒక్కోటి ఒక్కో జోనర్

Today OTT Movies In Telugu: ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 28) ఒక్కరోజే 11 సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఏకంగా ఆరు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో వంద కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్‌తోపాటు ఫాంటసీ అడ్వెంచర్ మూవీ, డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. మరి ఆ మూవీస్, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా)- నవంబర్ 28

ది మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 28

ఫైండ్ మీ ఇన్ పారిస్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 28

జీ5 ఓటీటీ

వికటకవి (తెలుగు వెబ్ సిరీస్)- నవంబర్ 28

డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 29

ఈటీవీ విన్ ఓటీటీ

క మూవీ (తెలుగు చిత్రం)- నవంబర్ 28

సందేహం (తెలుగు సినిమా)- నవంబర్ 28

ఆహా ఓటీటీ

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి (తెలుగు మూవీ)- నవంబర్ 28

నారదన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా)- నవంబర్ 29

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మై స్టార్ బ్రైడ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 28

సేవింగ్ గ్రేస్ (ఫిలిపినో వెబ్ సిరీస్)- నవంబర్ 28

బార్డర్‌ల్యాండ్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ)- నవంబర్ 28

చెస్ట్‌నట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- నవంబర్ 28

హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29

తెలుగులో 6 స్ట్రీమింగ్

ఇలా ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటన్నింటిలో ఆరు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన కిరణ్ అబ్బవరం పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ క మూవీ, దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన రూ. 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన బ్యాంక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

అది ఆప్షనల్

అలాగే, తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి, తెలుగులో వచ్చిన చిన్న చిత్రాలు సందేహం, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి సినిమాలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అందుబాటులో ఉన్నాయి.

ఇక తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్ మై స్టార్ బ్రైడ్ ఓటీటీ లవర్స్ ఆప్షన్ అనుకోవచ్చు. అయితే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన పదకొండింటిలో ఆరు తెలుగులో స్ట్రీమింగ్ కానుండగా.. వాటిలో ఐదు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

Whats_app_banner