Pradeep Maddali About Vikatakavi 2: తెలుగులో వస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రామ్ తాళ్లూరి నిర్మించారు.
బ్లాక్ బస్టర్ ఓటీటీ వెబ్‌సిరీస్ ‘సర్వం శక్తిమయం’ను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి వికటకవి సిరీస్‌కు దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
- ప్రశాంత్ వర్మ గారితో అ!, కల్కి సినిమాలకు వర్క్ చేసిన రైటర్ తేజ దేశ్‌రాజ్ రాసుకున్న కథ. తను నాకు మంచి స్నేహితుడు. జీ5 వారికి కథను వినిపించి సిరీస్‌ను చేయటానికి ఒప్పించి అన్నీ సిద్ధం చేసుకున్నారాయన. సిరీస్‌ను రూపొందించటానికి జీ5 టీమ్ హీరోలను, దర్శకులను కొంతమందితో చర్చలు జరుపుతున్నారు.
ఆ సమయంలో తేజ, నేను ఓసారి కలుసుకున్నప్పుడు వికటకవి సిరీస్ గురించి చెప్పి.. నువ్వు డైరెక్ట్ చేస్తావా! అని అడిగారు. నేను కథ విన్నాను. నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ రామ్ తాళ్లూరి గారు, జీ5 టీమ్ ఓ బడ్జెట్ చెప్పి అందులోనే కంప్లీట్ చేయగలవా? అన్నారు. నేను అంగీకరించాను. అక్కడి నుంచి వికటకవితో నా ప్రయాణం ప్రారంభమైంది.
- వికటకవి తరహా పీరియాడిక్ సిరీస్ చేయటం డైరెక్టర్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. నాతో పాటు నా టీమ్‌కి కూడా వర్క్ పరంగా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన కంటెంట్ ఇది. ఎందుకంటే కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. కథంతా 1940, 1970 కాలాల్లో జరుగుతుంది. అలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేసి తెరకెక్కించటం అనేది ఓ కిక్ ఇచ్చింది.
- 1940, 1970 కాలాలకు సంబంధించిన సెటప్స్, బట్టలు, అప్పటి ప్రజలు మాట్లాడే భాష, లుక్స్, లైటింగ్, వర్కింగ్ మూడ్ ఇలా అన్నీ టీమ్‌కి చాలెంజింగ్‌గా అనిపించింది. సిరీస్‌ను కంటెంట్ ప్రకారం ఓ రాయల్ లుక్‌తో చూపిస్తూనే కథానుగుణంగా మంచి థ్రిల్లర్ ఎలిమెంట్‌తో తెరకెక్కించాను.
- పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సిరీస్ లేదా సినిమాను తెరకెక్కించటం అనేది ప్రతీ టెక్నీషియన్‌కి ఎంతో ఛాలెంజింగ్ విషయం. ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కంటెంట్‌ను ఎలా తెరకెక్కించాలనుకుంటున్నామో దాన్ని తెరపైకి తీసుకు రావటం అనేది పెద్ద ఛాలెంజింగ్ విషయం.
- దీని కోసం దర్శకుడి ఆలోచనకు ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, కెమెరామెన్ ఆలోచనలు సరిగ్గా సరిపోవాలి. అదృష్టం కొద్ది మంచి టీమ్ కుదిరింది. ప్రతీ ఒక్కరూ తమ సొంత ప్రాజెక్ట్‌గా భావించి, నిరూపించుకోవాలని తపనతో అందరూ వర్క్ చేశారు.
- ఉంటుందండి.. రైటర్ తేజ ఇప్పటికే దాని మీద వర్క్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఇంకా పెద్ద స్కేల్ (భారీ స్థాయి)లో వికటకవి 2 ఉండబోతుంది.