Brahmamudi November 28th Episode: బోల్తా కొట్టిన అపర్ణ ప్లాన్- వంటలక్కగా కావ్య, ఫుడ్ డెలివరీ- అనామికపై అప్పు రివేంజ్
Brahmamudi Serial November 28th Episode: బ్రహ్మముడి నవంబర్ 28 ఎపిసోడ్‌లో కావ్యకు కాల్ చేసి ఫైర్ అవుతాడు రాజ్. దాంతో దుగ్గిరాల ఇంటికి భోజనం క్యారేజ్‌లో పట్టుకుని డెలివరీ చేస్తుంది. కానీ, రాజ్ మాత్రం అవమానం చేస్తాడు. మరోవైపు అనామికపై కల్యాణ్‌ను తీసుకెళ్లి మరి రివేంజ్ తీర్చుకుంటుంది అప్పు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వంటింట్లో ఇందిరాదేవికి స్వప్న హెల్ప్ చేస్తుంది. కానీ, ఏది ఎలా ఉంటుందో స్వప్నకే ఇందిరాదేవి చెబుతుంది. ఏది స్వప్నకు తెలియకపోవడంతో నేనే చేసుకుంటాను అని ఇందిరాదేవి చెబుతుంది. ఇంతలో బౌల్‌లోని వేడి వల్ల ఇందిరాదేవికి చేయి కాలుతుంది. అదంతా రాజ్ చూసి కంగారుపడతాడు.
కడుపుతో ఉన్న స్వప్న
ఇందిరాదేవిని కూర్చోమని చెప్పి నువ్వెందుకు వండుతున్నావ్. బయట నుంచి తెప్పిస్తానని అన్నా కదా అని రాజ్ అంటే.. మీ తాతయ్య తినాలి కదా. బయట ఫుడ్ పడాలి కదా. అందుకే వండాల్సి వచ్చిందని ఇందిరాదేవి అంటుంది. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీపై కోప్పడతాడు రాజ్. ఇంతమంది ఉండి నానమ్మకు సహాయం చేయాలని అనిపించలేదా. కడుపుతో ఉన్న స్వప్న సహాయం చేస్తుందని రాజ్ అంటాడు.
నన్ను అంటావేంట్రా నాకు వంట రాదు. నేను కిచెన్ వైపు వెళ్లింది లేదని రుద్రాణి అంటుంది. నువ్వేంటీ పిన్ని నువ్వైనా సహాయం చేయాలి కదా. అంతలా ఎలా మారిపోయావ్ అని రాజ్ అంటాడు. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది రాజ్. నువ్ కొత్తగా మనుషులు మావత్వాల గురించి తెగ గుర్తుకువస్తున్నట్టున్నాయ్. ఒకప్పుడు ఈ పనులన్ని నేను చేసినదాన్నే అప్పుడు ఎవరు గుర్తించలేదు. నా కొడుకు కోసం ఆరాటపడుతుంటే గుర్తించట్లేదు. ఇన్నాళ్లు నేను ఒంటరిగానే బతుకుతున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నీకు ఇవాళే కష్టంగా కనిపిస్తుంది. ఓ నీకు నచ్చినవాళ్లు పడితేనే కష్టమా అని ధాన్యలక్ష్మీ అంటే.. నేను అందరిని ఒకేలా చూస్తాను అని రాజ్ అంటాడు. నీ తమ్ముడు కూడా నిన్ను అంతకుమించి చూశాడు. వాడికోసం ఆలోచించవా. నేను వాడి కోసం పోరాడుతుంటే నా వైపు నిలబడ్డావా. అవన్నీ వదిలేసి ఇవాళ మాత్రం అడుగుతున్నావ్. ఇప్పుడు నీకు మనసు లేదా, లేక మేము మనుషుల్లా కనిపించట్లేదా. నేను చెప్పనా ఇన్నాళ్లు మీ అమ్మ, కావ్య నీకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు వాళ్లు లేరు. అందుకే నీకు అన్ని కష్టాల్లా కనిపిస్తున్నాయి. మాకు చెప్పడం కాదు. నువ్ తెలుసుకో అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.
కావ్యకు రాజ్ ఫోన్
దాంతో చూశావా ఆడది లేని ఇల్లు ఎలా అవుతుందో. ఇప్పటికైనా అపర్ణ, కావ్యను ఇంటికి తీసుకురా అని సుభాష్ అంటాడు. అదేంటీ ఈ ముసలిదాన్ని చూసి వదినని రాజ్ తీసుకొస్తాడనుకుంటే మా అన్నయ్య కావ్యను కూడా తీసుకురమ్మంటున్నాడు అని ఆలోచిస్తుంది రుద్రాణి. తర్వాత కావ్యకు రాజ్ కాల్ చేస్తాడు. కావ్య ఆశ్చర్యపడుతుంటే అపర్ణ ఏమైందని అడుగుతుంది. మీ అబ్బాయే కాల్ చేస్తున్నాడని ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పెడుతుంది కావ్య. తిన్నావా అని రాజ్ అడిగితే కావ్య ఆశ్చర్యంగా అడుగుతుంది.
అందరం తిన్నామని కావ్య చెబుతుంది. దాంతో రాజ్ కోప్పడుతాడు. కోట్ల ఆస్తి ఉండి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాం. పుట్టింటికి వెళ్తూ వెళ్లావ్. అలా కాకుండా మా అమ్మను కూడా తీసుకెళ్లావ్. తాతయ్య, నానమ్మను చూసుకునేవాళ్లు లేకుండా పోయారు. అందరికి టైమ్‌కు పెట్టి నీవైపు తిప్పుకున్నావ్. పనిమనిషి వెళ్లిపోయింది. అమ్మమ్మ చేయి కాల్చుకుంది అని రాజ్ అంటాడు. అయ్యయ్యో అమ్మమ్మకు ఎలా ఉందని కావ్య అడుగుతుంది.
అంత నటించకు, నీకు ఏమాత్రం వాళ్లమీద ప్రేమ ఉంటే మా అమ్మను ఇంటికి పంపించు అని రాజ్ అంటాడు. ఇంతలో అపర్ణ ఫోన్ తీసుకుని ఏదో భార్యపై హక్కున్నవాడిలా అరుస్తున్నావ్. కావ్యను అంటే నిన్ను నేను కొడతాను. అక్కడ అలా పరిస్థితి రావడానికి కారణం నువ్వు. నువ్ నీ భార్యను ప్రేమగా చూసుకోకపోవడం వల్లే, అర్థం చేసుకోకపోవడం వల్లే అని అపర్ణ అంటుంది. నానమ్మ చేయి కాల్చుకుంది. మన పంతాలు పట్టింపులు పెద్దవాళ్లపైనా చూపించాలా అని రాజ్ అంటాడు.
కల్యాణ్‌ను తీసుకెళ్లి మరి
ఆ మాట నేను నీకు చెప్పాలి. నీకు పెద్దవాళ్లపై ఏమాత్రం ప్రేమ ఉంటే నీ పంతం పక్కన పెట్టి కావ్యను తీసుకెళ్లు. లేకుంటే ఇంకోసారి వాళ్ల ఆకలి వీళ్ల ఆకలి అంటూ ఫోన్ చేయకు అని కాల్ కట్ చేస్తుంది అపర్ణ. వాడి మాటలకు పడిపోకు అని అపర్ణ వెళ్లిపోతుంది. అయ్యే అమ్మమ్మ, తాతయ్య అంతలా ఇబ్బంది పడుతున్నారా అని కావ్య ఫీల్ అవుతుంది. మరోవైపు అనామిక దగ్గరికి కల్యాణ్‌ను అప్పు తీసుకెళ్తుంది. మిమ్మల్ని ఎవరు పంపించారు అని అనామిక అంటుంది.
కంగారుపడకు అనామకురాలా అని అప్పు అంటుంది. మీరిద్దరు అనామకుల్లా బతుకుతున్నారు అది చాలదా అని అనామిక అంటుంది. నీకు ఎవేవో కలలు ఉన్నట్లున్నాయి. కానీ, అవేం జరగవు. నీకు ఇప్పుడు ఒకటి చూపిస్తే కళ్లు కుళ్లుకుంటాయి అని పదివేల బ్లాంక్ చెక్ చూపిస్తుంది అప్పు. ఏంటీ పదివేలు అని చూపిస్తున్నావా. నీలా అడ్డదారుల్లో సంపాదించిన డబ్బు అని తనకు రైటర్‌గా అవకాశాలు వస్తున్నాయని, నా మొగుడికి నచ్చినపనే చేస్తున్నాడని, సక్సెస్ వస్తుందని అప్పు అంటుంది.
నీలాంటి కోటీశ్వరులు చాలా మంది ఉంటారు. కానీ, జనాల మనసులు గెలుచుకోవడం అంత ఈజీ కాదు. పదేళ్లు కష్టపడితే కోటీశ్వరులు కావొచ్చు. కానీ, నువ్ పది జన్మలు ఎత్తిన కవిలా రాయలేవు అని ఇదివరకు మాటలు అన్న అనామికపై రివేంజ్ తీసుకుని వెళ్లిపోతారు అప్పు, కల్యాణ్. ఏంటీది వచ్చి వాగి వెళ్తుంది ఇది కల నిజమా. అసలు ఈ కల్యాణ్ గాడికి అంత సీన్ ఉందా అని అనామిక అనుకుంటుంది. మరోవైపు కావ్య లంచ్ కారియర్ సర్దుతుంది.
అల్లుడు గారు ఎలా మారుతారు
అక్కడ ఎవరు వండటానికి లేరని, అమ్మమ్మ తాతయ్యకు. అక్కడ ఎవరు తిన్న నాకు అభ్యంతరం లేదు అని కావ్య అంటుంది. నీకు బుద్ధుందా. నేనేందుకు వచ్చినట్లు. ఇలా చేస్తే వాడికి నీ అవసరం ఎలా తెలుస్తుంది అని అపర్ణ అంటుంది. మన అవసరం తెలియాలని అవకాశం చూసుకుని అంటే ఎలా. మీకున్న పెద్ద మనసు మీ అబ్బాయికి లేదు. నా మీద ప్రేమే లేదు. మీరు ఇంతపెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయనేమో విడిపోవాలని అనుకుంటున్నారు అని కావ్య అంటుంది.
నువ్ మధ్యలోనే వెళితే సమస్యలు తీరిపోతే అల్లుడు గారు ఎలా మారతారు. అమ్మ, భార్య కనిపించకపోతేనాగా తెలిసేది అని కనకం అంటుంది. వాళ్ల అవసరం కనపడి వెళ్తున్నాను. ఇందులో నా స్వార్థం లేదు. త్యాగం అస్సలు లేదు అని కావ్య అంటుంది. కావ్య మా అత్తగారు చాలా చూశారు. రాజ్ మార్పు కోసమే చూస్తున్నారు. ముందు ఇలాగే అవంతారాలు వస్తాయి. తర్వాతే విజయం అని అపర్ణ అంటుంది. నేను వెళ్లేది అమ్మమ్మ, తాతయ్య కోసమే. అంత సామ్రాజ్యం సృష్టించిన వాళ్లకోసమే అని కావ్య క్యారేజ్ పట్టుకుని దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది కావ్య.
దీన్ని ఎలా కన్నావే. మునులు, సన్యాసులు ఉండే ఆశ్రమంలోనా. మధ్యలో నేను వెర్రిదాన్ని అని అపర్ణ అంటుంది. నిజమే వదినా అని కనకం అంటే.. ఏంటీ నేను పిచ్చిదాన్నా అని అపర్ణ అంటుంది. అయ్యయ్యో అది కాదు వదినా. తప్పు చేస్తే తల్లికి ఉరిశిక్ష పడుతుందని తెలిసినా సరే సాక్ష్యం చెప్పేలాంటిది అని కనకం అంటుంది. వెళ్లని అక్కడ వాడు చేసే అవమానం తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఏడిస్తే అప్పుడు చెబుతాను అని అపర్ణ అంటుంది.
బాధపడి వచ్చాను
కావ్య క్యారేజ్‌తో రావడం చూసి రాజ్ షాక్ అవుతాడు. ఎవరు నువ్వు అని రాజ్ అడుగుతాడు. బెల్‌మాటో అనే ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీ నుంచి ఫుడ్ డెలీవరి చేయడానికి వచ్చాను అని కావ్య అంటే.. ఏంటీ ఓవరాక్షన్ అని రాజ్ అంటే.. ఎవరు నువ్వు అన్నది ఏం యాక్షన్. మీ యాక్షన్‌కు నా రియాక్షన్ అని కావ్య అంటుంది. ఫోన్‌లోనే దులిపేసరికి వచ్చావా అంటే.. లేదు బాధపడి వచ్చాను అని కావ్య అంటుంది. నీ భోజనం నాకు అక్కర్లేదని రాజ్ అంటే.. నీకోసం ఎవరు తెచ్చారు. మీరు అడిగినా తేను అని కావ్య అంటుంది.
ఈ క్యారేజ్ ఎవరికోసం అని రాజ్ అంటే.. నువ్ వెళ్లగొట్టాకా ఇంటింటికి తిరిగి క్యారేజ్ వేస్తుందేమో అని రుద్రాణి అంటుంది. అ జమానా అయిపోయింది. ఇది నేను మా అమ్మమ్మ తాతయ్యలకు తీసుకొచ్చాను అని కావ్య అంటుంది. దాంతో ఇందిరాదేవి, సీతారామయ్య సంతోషిస్తారు. కావ్యకు ఏం హక్కుంది తీసుకురాడానికి అని రాజ్ అంటే కావ్య మా మనవరాలురా. ఆ హక్కుతోనే తీసుకొచ్చింది అని ఇందిరాదేవి అంటుంది. నాకు అక్కర్లేనిది మీకెలా అక్కరకు వచ్చిందని రాజ్ అంటాడు.
అసలు నువ్వెవరురా. కోన్ కిస్ కా గున్నయ్యవి. పోరా అని ఇందిరాదేవి అవమానిస్తుంది. దీన్ని రమ్మంటే ఇల్లంత నాదే అనుకునే రకం అని రాజ్ అంటాడు. ఇది తన ఇల్లే. తన ఇల్లు కాదని ఏ ఎబ్రాసి అన్నాడు, ఏ సన్నాసి అన్నాడు అని రాజ్‌ను తెగ తిడుతుంది ఇందిరాదేవి. ఇది నీ ఇల్లు కావ్య. ఇలాంటి మేనేజర్‌లు. ఆ పెంపుడు జంతువులు. సారీ సారీ పెంపుడు కూతుళ్లు ఏమన్నా పట్టించుకోకు అని ఇందిరాదేవి అంటుంది. ఎప్పటికి కావ్య ఇంటి కోడలే. మా మనవరాలే అని సీతారామయ్య అంటాడు.
కావ్యకు అవమానం
వంటమనిషిగా అవతారం ఎత్తింది చాలు. పనిమనిషిగా తాతయ్య వాళ్ల దగ్గర మార్కులు కొట్టేద్దామని చూస్తున్నావా. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లు అని రాజ్ అంటే.. రోజు వస్తాను. ప్రతిరోజూ తీసుకొస్తాను అని కావ్య అంటుంది. తర్వాత డిన్నర్ రెడీ చేసి పెట్టాను అని కావ్య వెళ్తుంటే.. మీ భోజనం ఇల్లంతా నచ్చిందని ప్రశంసించారు కాబట్టి. టిప్పుతో కలిపి ఇదిగో తీసుకో అని డబ్బులు ఇచ్చి అవమానిస్తాడు రాజ్. అది చూసి కావ్య షాక్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్