Gunde Ninda Gudi Gantalu Today Episode: అపార్ట్‌మెంట్‌లో క్లీనర్‌గా బాలు- మీనాకు దొరికిపోయిన ముళ్లకంప- మనోజ్‌కు గిఫ్ట్-gunde ninda gudi gantalu serial november 28th episode rohini present to manoj balu joined as cleaner star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: అపార్ట్‌మెంట్‌లో క్లీనర్‌గా బాలు- మీనాకు దొరికిపోయిన ముళ్లకంప- మనోజ్‌కు గిఫ్ట్

Gunde Ninda Gudi Gantalu Today Episode: అపార్ట్‌మెంట్‌లో క్లీనర్‌గా బాలు- మీనాకు దొరికిపోయిన ముళ్లకంప- మనోజ్‌కు గిఫ్ట్

Sanjiv Kumar HT Telugu
Nov 28, 2024 10:13 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial November 28 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 28 ఎపిసోడ్‌లో అపార్ట్‌మెంట్‌లో 20 కార్లకు క్లీనర్‌గా బాలు పనిలో చేరతాడు. మరోవైపు ఇంటికి వచ్చిన బాలుతో సరుకుల డబ్బు గురించి మాట్లాడుతారు. మీనాపై దొంగతనం అంటగడితే తానే డబ్బులు ఇచ్చినట్లు బాలు సపోర్ట్ చేస్తాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 28 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 28 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు వెళ్తుంటే ఒకతను పిలుస్తాడు. హెల్ప్ అడుగుదామంటే అస్సలు కనిపించట్లేదని అతను అంటాడు. చెప్పండి సర్ ఏం కావాలి అని బాలు అంటాడు. ఒక పని ఉంది. డ్రైవర్ కావాలని అతను అంటే.. పర్లేదు సర్ చెప్పండని బాలు అంటాడు.

మంచి పనోడు కావాలి

ఒక అపార్ట్‌మెంట్ ఉంది. అక్కడ 20 కార్లు ఉంటాయి. వాటిని క్లీన్ చేయాలి. ఇదివరకు ఒక క్లీనర్ ఉండేవాడు. అతను ఆ పని ఈ పని అని నెలకు 15 రోజులు లీవ్‌లు పెడుతున్నాడు. వాడి ప్లేస్‌లో వేరే ఎవరైనా ఒక మంచి పనోడు కావాలి. కారుకు వెయ్యి రూపాయల చొప్పున నెలకు 20 వేలు వస్తాయి. ఆ క్లీనింగ్‌తోపాటు ఓనర్ సెల్లర్‌లో పనిచేస్తే కూడా ఎక్స్‌ట్రా డబ్బులు కూడా వస్తాయి. ఎవరైనా మంచి పనోడు ఉంటే చెప్పు అని అతను అంటాడు.

నేను చేస్తాను అని బాలు అంటాడు. నీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుని ఈ పని చేస్తానంటావ్ ఏంటీ. కారు ఓనర్ అయిండి వేరే వారి కార్లు క్లీన్ చేయడం నామోషిగా ఉండదా అని అతను అంటే.. అదేమైనా దొంగతనమా. నా కారు కడుక్కునేవాన్ని ఇప్పుడు వాళ్లవి క్లీన్ చేస్తాను అని బాలు అంటాడు. ఆలోచించే చెబుతున్నావా అని అతను అంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించే చెబుతున్నా పని ఎక్కడ సర్ అని బాలు అంటాడు.

పదా వెళ్దాం అని బాలును తీసుకెళ్తాడు అతను. మరోవైపు గుణకు చిట్టీ డబ్బులు ఇచ్చిన శివ అక్క గాజులు తీసుకుని పెద్ద అమౌంట్ ఇవ్వమని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ శివ. ఇదేనా అర్థం చేసుకుంది. ఎంత కావాలో చెప్పు నోటు లేకుండా ఇస్తాను. అయినా నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా. గాజులు తాకట్టుపెట్టడం ఎందుకు నీ దగ్గరే ఉంచు అని డబ్బులు ఇస్తాడు గుణ. దాంతో థ్యాంక్స్ చెప్పి వెళ్తాడు శివ. మరోవైపు బాలుకు అపార్ట్‌మెంట్ చూపిస్తాడు.

మీనా భర్త కదా

అపార్ట్‌మెంట్ ఓనర్‌కు బాలును పరిచయం చేస్తాడు. ఓనర్‌తో మాట్లాడటం అయ్యాక ఒకతను తన కారు కడిగి వారం అయిందని, బాలును వెంటనే కడగమని చెబుతాడు. దాంతో వెంటనే కారు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు బాలు. ఇంతలో వచ్చిన అపార్ట్‌మెంట్ ఓనర్ బాగా క్లీన్ చేస్తున్నావు. ఇవాళ్టి నుంచి లెక్క కట్టి ఇస్తాను. రేపటి నుంచి రమ్మని బాలుతో చెబుతాడు. తర్వాత అక్కడున్న వాచ్‌మెన్ ఇతను మీనా భర్త కదా. కారు ఓనర్ కదా. ఇక్కడ కారులు కడుగుతున్నాడేంటీ అని అనుకుంటాడు.

మరోవైపు శివను డబ్బులు తెచ్చావా అని అడుగుతుంది మీనా. దాంతో డబ్బులు ఇస్తాడు శివ. రశీదు తీసుకున్నావా అని మీనా అడిగితే.. తీసుకున్నా అని శివ అబద్ధం చెబుతాడు. సరే నీ దగ్గర ఉండని. డబ్బులు నువ్వే తిరిగి ఇవ్వాలి కదా అని మీనా అంటుంది. ఇంట్లో ఏమైనా సమస్య. లేకుంటే ఇంతడబ్బు అడగవు అని శివ అంటే.. నాకు డబ్బు అవసరం తెలుసురా. తప్పు చేయట్లేదు అని మీనా వెళ్లిపోతుంది. మరోవైపు ఇంటికి సరుకులు తీసుకొస్తారు.

డ్రై ఫ్రూట్స్ కిచెన్‌లో వద్దు. మందులోకి మంచింగ్‌గా ఇవి తీసుకెళ్తాడు. మన రూమ్‌లో పెట్టుకుందామని మనోజ్ అంటాడు. ఇంతలో మీనా పై నుంచి వస్తే.. బాలు బయటి నుంచి వస్తాడు. ఓ సరుకులు తెచ్చారా. డబ్బు ఇవ్వాలి కదా. రేపు ఇస్తాను అని బాలు వెళ్లిపోతుంటే.. ఆగరా. రేపు ఇవ్వడం ఏంటీ. మీ ఆవిడ తెచ్చి ఇచ్చింది కదా. నీకు తెలియదా. వీడిని అడిగే డబ్బులు తెస్తానన్నవ్. వాడికి తెలియకుండా ఎక్కడి నుంచి తెచ్చావ్. ఇంత డబ్బు నీకు ఎక్కడిది. దొంగతనం చేశావా అని ప్రభావతి అంటుంది.

దొంగతనం అంటగట్టాలా

నా ప్రాణం పోయినా దొంతనం చేయను అని మీనా అంటుంది. ఏ పౌరుషం పొడుచుకు వచ్చిందా. నీ తమ్ముడు దొంగతనం చేయలేదా. నువ్ కూడా మొదలుపెట్టావా అని ప్రభావతి అంటుంది. నా మొగుడు సంపాదించినప్పుడే తింటాను. లేకుంటే పస్తులు ఉంటాను అని మీనా అంటుంది. ఇప్పుడు ఆంటీ అడగడంలో తప్పేముంది. ఏం జరుగుతోంది అని రోహిణి అంటుంది. అలా అని దొంగతనం అంటగట్టాలా. ఎన్ని లక్షలు ఎత్తుకెళ్లాను నేను అని ఇన్‌డైరెక్ట్‌గా మనోజ్‌ను అంటుంది మీనా.

దాంతో అంతా షాక్ అవుతారు. మరి ఇప్పటికిప్పుడు పదివేలు ఎక్కడి నుంచి తెచ్చావ్ అని ప్రభావతి నిలదీస్తుంది. ఎక్కడి నుంచి తెస్తుంది. నేను ఇస్తే తీసుకొచ్చి ఇస్తుంది అని బాలు అంటాడు. ఇప్పుడే కదరా నువ్వు ఇవ్వలేదని అన్నావ్ అని మనోజ్ అంటాడు. నోరు మూయిరా లక్షలు మింగినోడా. నీ పెళ్లానికి చెప్పుకో. నేను పోలీస్ కేసు పెడితే నువ్ 40 లక్షలు మింగినందుకు నువ్ జైల్లో కూర్చుంటావని. అక్కడికి వచ్చి ఈవిడగారు నీ మొహం చూడాల్సి వస్తుందని అని బాలు అంటాడు.

ఇల్లు మింగినావిడా, ఇంటి పత్రాలు మింగినావిడా.. లక్షలు మింగినోడా అందరు అంటున్నారా అని బాలు అంటాడు. వాడిని అంటావేంట్రా నువ్వేకదా ఇవ్వలేదు అన్నావ్ అని ప్రభావతి అంటుంది. నేను సరుకుల కోసం ఇవ్వలేదు. కారు ఈఎమ్ఐ కోసం ఇచ్చాను. అయినా నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావ్ అని బాలు అంటాడు. సరుకులు తిరిగి పంపించాల్సి వస్తుందని అంటే ఇచ్చాను అని మీనా అంటుంది. ఇప్పుడు అర్థమైందా. మంచి పని చేశావ్. రేపు వచ్చేటప్పుడు ఈఎమ్ఐ కడతానులే అని బాలు వెళ్లిపోతాడు.

నిలదీసిన బాలు

దాంతో తనకు సపోర్ట్ చేసినందుకు మీనా సంతోషిస్తుంది. తర్వాత నువ్వెందుకు డబ్బులు ఇచ్చావ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చావ్ అని మీనాను అడుగుతాడు. డబ్బులు లేట్ అయితే మీ దగ్గర కారు పోయిందని చెప్పాలి కదా. మీరు ఇచ్చినదాంట్లో దాచి దాచి ఉంచాను అని మీనా అంటుంది. అంత డబ్బు అయ్యేలా నేను ఎప్పుడు ఇవ్వలేదు అని బాలు గట్టిగా నిలదీస్తాడు. మీ అమ్మగారు అన్నట్లు నేను దొంగతనం చేయలేదు అని మీనా అంటుంది.

నేను ఆ మాట ఇప్పుడే కాదు. ఎప్పుడు అనుకోను. కానీ, మా అమ్మ అంతమాట అన్న సమాధానం చెప్పకుండా ఉన్నావ్. అదే నాకు అర్థం కావట్లేదు అని బాలు అంటాడు. పోనిలేండి నేను కూడా సమాధానం చెప్పాను కదా అని మీనా వెళ్లి టవల్ ఇస్తుంది. తర్వాత మీనా చేయి చూసి గాజులు తాకట్టు పెట్టావా. రేపైనా తీసుకొచ్చి ఇచ్చేవాన్ని కదా అని బాలు అంటాడు. మీ పరువు కాపాడుదామని. మీ వల్ల కాకపోతే మీ అన్నయ్యను అడిగి ఇస్తానంది మీ వదినా. మీరు డబ్బులు ఇవ్వనందుకు చాలానే అన్నారు. మీరు ఏం ఇవ్వకుండా నాతోపాటు తింటున్నారట మీనా అంటుంది.

నేను అందరు తిన్న తర్వాత నేను తింటున్నాను. మిగిలిపోతుందనే తింటున్నాను. కూరలేకపోతే పచ్చడితో సరిపెట్టుకుంటున్నాను. అయినా నేను పిడికెడు అన్నం ఎక్కువ తింటున్నాను అంటున్నారు. నన్ను అన్న పర్వాలేదు. మీరు డబ్బులు ఇవ్వకుండా ఇలాగే నెట్టుకొస్తారట. ఫ్రీగా ఎంతకాలం తింటాడు అని అంటున్నారు. మిమ్మల్ని అంటే ఎలా ఊరుకుంటాను. ప్రతినెల ఇచ్చే మీరు ఈ ఒక్క నెల ఇవ్వకుంటే తిన్నదానికి లెక్కలు వేస్తారా. అందుకే పౌరుషమొచ్చి తాకట్టు పెట్టాను అని మీనా అంటుంది.

బాలు అబద్ధం

ఇక్కడ మీనా మాటలు చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటాటి. అదంతా అర్థం చేసుకున్న బాలు తర్వాత నన్ను చేతకానివాడిగా చూశావా. రేపటి వరకు ఆగితే అయిపోయేది కదా అని అంటాడు. రేపటి వరకు ఆ మాటలు నేను పడలేను. తాకట్టు పెట్టింది మనిద్దరికి మాత్రమే తెలుసు. నా ముందు మిమ్మల్ని ఎవరైనా నేను ఊరుకోను. ఇప్పుడేమైంది. మీరు సంపాదించినతర్వాత గాజులు విడిపించి ఇవ్వండి. సరే ఉద్యోగం చూసుకుంటానని వెళ్లారు కదా. ఏమైందని మీనా అంటుంది. దొరికింది. ఒక ఫారెన్ కారుకు పర్సనల్ డ్రైవర్‌గా దొరికిందని అబద్ధం చెబుతాడు బాలు.

పోనిలేండి మావయ్యగారికి నిజం తెలియకుండా ఉంటే చాలు అని మీనా అంటుంది. దీనికి క్లీనర్‌గా చేస్తున్నాని తెలిస్తే వద్దని అంటుంది అని మనసులో అనుకున్న బాలు సరే నెల కాగానే గాజులు విడిపిద్దాం. చీటి జాగ్రత్తగా దాచిపెట్టు. ఉదయమే వెళ్లాలి. లేపు అని బాలు అంటాడు. మరోవైపు బాల్కనీపై ఉద్యోగం చేస్తున్నట్లు నటించడం కంటే జాబ్ చేయడమే ఈజీ అనుకుంటా అని మనోజ్ అనుకుంటుండగా రోహిణి వస్తుంది. దాంతో కంగారుపడుతాడు మనోజ్.

తర్వాత దీపావళి తర్వాత అప్రైజల్స్ ఉంటాయి కదా. ఏమైనా గుడ్ న్యూస్ అని రోహిణి అంటే.. నేను అదే అనుకున్నా. కానీ, లాస్ట్ మినట్‌లో మిస్ అయింది. మా కొలిగ్ మావయ్యకు పెద్ద పెద్ద బిజినెస్‌లు ఉన్నాయి. వాడు ఒకేసారి కారులు కొనేసరికి ఇంప్రెస్ అయి అతనికి ఇచ్చేశాడు. నేను ఇంత టాలెంట్ పెట్టుకుని ఇక్కడ జాబ్ చేయడమేంటీ. మీ నాన్నకు మలేషియాలో బోలెడు బిజినెస్‌లు ఉన్నాయి కదా. ఆయన సపోర్ట్ ఇస్తే ఇక్కడే మనం సొంత బిజినెస్ చేసుకోవచ్చు. దీనిగురించి ఎప్పుడు ఎందుకు సీరియస్‌గా తీసుకోవు ఏంటీ అని మనోజ్ అంటాడు.

దుబాయ్ నుంచి తెప్పించాను

టాపిక్ నా వైపు తిరిగేలా ఉందని రోహిణి అనుకుంటుంది. మీ నాన్న కూడా నీతో ఎప్పుడు మాట్లాడడు. అసలు సమస్య ఏంటని మనోజ్ అడుగుతాడు. అద్భుతాలన్ని ఒకేసారి జరగవు. ఏదో ఒకరోజు సర్‌ప్రైజ్ వస్తుంది అని రోహిణి అంటే.. ఆరోజు కోసమే చూస్తున్నాను అని మనోజ్ అంటాడు. సరే నీకో సర్‌ప్రైజ్ అని నీకు ఎంతో ఇష్టమైన శాండల్‌వుడ్ పర్ఫ్యూమ్. మీకోసం దుబాయ్ నుంచి తెప్పించాను అని రోహిణి అంటుంది.

అవునా. దీన్ని కొందామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను అని సంబరపడిపోతాడు మనోజ్. దాంతో హమ్మయ్య ఈరోజుకు తప్పించుకున్నాను అని రోహిణి అంటుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన అమ్మో తెల్లారిపోయింది అని స్తానానికి వెళ్తాడు బాలు. మీనాను టవల్ అడుగుతాడు. టవల్ ఇస్తున్న మీనాను లోపలికి బాలు లాగినట్లు మీనా కలకంటుంది. టవల్ పట్టుకుని మురిసిపోతుంది. బయటకొచ్చిన బాలు అది చూసి ఓయ్ అని అడుగుతాడు. హో ఇది నా కల అనుకుంటుంది అని మీనా.

తర్వాత అపార్ట్‌మెంట్ సెక్యురిటీ గార్డ్ భార్య వచ్చి మీనాతో బాలు క్లీనర్‌గా చేరిన విషయం చెబుతుంది. దాంతో ఆ అపార్ట్‌మెంట్‌కు మీనా వెళ్లి చూస్తుంది. అక్కడ బాలు కారులు కడగడం చూసి బాధపడిపోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner